STOCKS

News


పెట్టుబడుల వృద్ధికి... రిలయన్స్‌ గ్రోత్‌ ఫండ్‌

Monday 12th August 2019
personal-finance_main1565589003.png-27701

రిలయన్స్‌ గ్రోత్‌ ఫండ్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ మిడ్‌క్యాప్‌ తరహా పథకం. అధికంగా వృద్ధిని సాధించే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం నిర్వహణ వ్యవహారాలను (మేనేజర్‌) మనీష్‌ గున్వానీ 2017 నుంచి చూస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో ఆయనకు 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 
పెట్టుబడుల విధానం...
బోటమ్‌ అప్‌ విధానాన్ని ఈ పథకం ఎక్కువగా అనుసరిస్తుంది. లేదా స్టాక్‌ వారీగా పెట్టుబడుల విధానాన్ని ఆచరిస్తుంది. సరైన విలువ, మార్కెట్‌ విలువ మధ్య ఉన్న అంతరం ఆధారంగా పెట్టుబడుల కోసం ఓ షేరును ఎంచుకుంటుంది. సహేతుక విలువ వద్ద లభిస్తూ, వృద్ధికి అవకాశాలున్న స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడాన్ని గమనించొచ్చు. ప్రధానంగా మిడ్‌క్యాప్‌ కంపెనీలపై ఈ పథకం దృష్టి సారిస్తుంటుంది. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ కోసం మొత్తం పెట్టుబడుల్లో 65-70 శాతం వరకు పెట్టుబడులను కేటాయిస్తుంటుంది. మిగిలిన మేర నిధులను లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌నకు సమానంగా కేటాయించడాన్ని గమనించొచ్చు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా 3-8 శాతం మధ్య నగదు నిల్వలను కూడా ఈ పథకం కొనసాగిస్తుంటుంది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కౌంటర్లలో లిక్విడిటీని దృష్టిలో ఉంచుకుని పోర్ట్‌ఫోలియోలో చక్కని వైవిధ్యాన్ని కూడా పాటిస్తుంది. టాప్‌ 40 స్టాక్స్‌లో పెట్టుబడులు 75-80 శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ పథకం బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ విభాగంలోని కంపెనీల్లో 23 శాతానికి పైగా పెట్టుబడులు ఉన్నాయి. ఆ తర్వాత హెల్త్‌కేర్‌, కన్జ్యూమర్‌ డిస్క్రెషనరీ, సేవల రంగానికి చెందిన కంపెనీల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. 
రాబడుల పనితీరు...
ఈ పథకం నిర్వహణలో పెట్టుబడులు జూలై చివరికి 6,257 కోట్లుగా ఉన్నాయి. మంచి పనితీరు చరిత్ర కూడా ఉంది. గత రెండు దశాబ్దాల కాలంలో మంచి సంపద సృష్టించడంలో ఈ పథకం ముందున్నది. 1995 అక్టోబర్‌ నెలలో ఈ పథకం ఆరంభం కాగా, నాడు ఇన్వెస్ట్‌ చేసి ఉంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు 113 రెట్ల మేర పెట్టుబడులు వృద్ధి చెందేవి. ఆరంభం నుంచి చూస్తే వార్షిక రాబడుల రేటు 21.55 శాతంగా ఉంది. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ టీఆర్‌ఐ రాబడులు ఇదే కాలంలో 18.01 శాతంగానే ఉన్నాయి. పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చి ఉంటే రూ.3.75 కోట్ల సంపద జూన్‌ చివరికి సమకూరి ఉండేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.14.20 లక్షలు కాగా, మిగతాదంతా రాబడులే. గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ తీవ్రంగా నష్టపోవడంతో ఈ పథకం గతేడాది పనితీరు మాత్రం 6 శాతం నష్టాలుగా ఉంది. మూడేళ్ల కాలంలో 6.30 శాతం, ఐదేళ్లలో 10.44 శాతం, పదేళ్లలో 11.71 శాతం చొప్పున వార్షిక రాబడుల రేటు ఈ పథకంలో ఉంది. You may be interested

స్థూల ఆర్థికాంశాలే కీలకం.!

Monday 12th August 2019

ఈ వారంలో ట్రేడింగ్‌ 3 రోజులకే పరిమితం సోమ (బక్రీద్‌), గురు (స్వాతంత్ర్య దినోత్సవం) వారాల్లో మార్కెట్‌కు సెలవు ఎఫ్‌పీఐ ట్యాక్స్‌ అంశంపై దృష్టిసారించిన మార్కెట్‌ వర్గాలు జూన్‌లో 2 శాతం ఐఐపీ.. మంగళవారం ట్రేడింగ్‌పై ప్రభావం..! - సీపీఐ ద్రవ్యోల్బణం (సోమ), డబ్ల్యూపీఐ బుధవారం వెల్లడి ముంబై: గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం వరకు లాభాలను నమోదుచేసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. అంతక్రితం వరుసగా నాలుగు వారాల పాటు నష్టాల్లో ట్రేడయ్యి..

ఒత్తిడిలో ఆసియా మార్కెట్లు

Monday 12th August 2019

దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ వలన ప్రపంచ, యుఎస్‌ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో చిక్కుకుంటాయనే ఆందోళన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఫలితంగా  బంగారం ధరలు పెరిగాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం పతనమవ్వడంతో, జపాన్ వెలుపల ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇండెక్స్‌) ఆసియా-పసిఫిక్ ఇండెక్స్‌ సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో 0.17 శాతం తగ్గింది. ఆస్ట్రేలియా మార్కెట్‌ 0.1 శాతం క్షీణించగా, దక్షిణ కొరియా కొస్పి

Most from this category