News


అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల కోసం

Monday 2nd March 2020
personal-finance_main1583126299.png-32209

  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఫండ్‌

మన మార్కెట్లతో పోలిస్తే అమెరికా స్టాక్‌ మార్కెట్లలో పరిపక్వత ఎక్కువ. అలాగే అస్థిరతలు కొంచెం తక్కువ. ప్రపంచంలో ఆర్థికంగా బలీయమైన స్థానంలో ఉన్న అమెరికాలోని స్టాక్‌ మార్కెట్లలో ఇన్వె‍స్ట్‌ చేయడం మంచి నిర్ణయమే అవుతుంది. పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. ఆ విధంగా చూసినా అమెరికా ఈక్విటీలకు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచిది. ఇలా అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లోని లిస్టెడ్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం కల్పిస్తున్న ఫండ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ కూడా ఒకటి. 

పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వె‍స్ట్‌ చేయడం సూచనీయం కాదు. ఈక్విటీ, డెట్‌ రెండు రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు వర్గీకరించుకోవడం వైవిధ్యం అవుతుంది. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇక ఈక్విటీల్లోనూ వైవిధ్యం కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ వీలు కల్పిస్తుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి మన ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి బదులు, కొంత మేర అమెరికా స్టాక్స్‌కూ కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా మన స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో కేవలం ఎంపిక చేసిన బ్లూచిప్‌ స్టాక్స్‌ మాత్రమే ర్యాలీ చేశాయి. కానీ, ఇదే కాలంలో అమెరికా స్టాక్స్‌ మంచి పనితీరు ప్రదర్శించాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

పెట్టుబడుల విధానం...
ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వె‍స్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వడమనే విధానంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పథకం తన పెట్టుబడులను అమెరికా స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో లిస్టెడ్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. అలాగే, భారత్‌, ఇతర విదేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్‌, జీడీఆర్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంది. అందులోనూ లార్జ్‌ క్యాప్‌ కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేస్తుంది. ప్రస్తుతం ఈ పథకం తన దగ్గరున్న నిధుల్లో 95.1 శాతం మేర స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఇక ఈక్విటీ మొత్తం పెట్టుబడుల్లో 94 శాతం మెగాక్యాప్‌, 6 శాతం లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. మనదేశంలో ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో అధిక శాతం (సెక్టార్‌ ఫండ్స్‌ కాకుండా) బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌కే అగ్ర ప్రాధాన్యం ఇస్తాయి. కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ అమెరికా స్టాక్స్‌లో హెల్త్‌కేర్‌ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లో 25 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత 18 శాతం పెట్టుబడులను టెక్నాలజీ కంపెనీల్లో, 12 శాతం ఎఫ్‌ఎంసీజీలకు కేటాయించగా, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు 7 శాతం కేటాయింపులు చేసింది. 

రాబడులు...
ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ పథకం పనితీరు ఆకర్షణీయంగానే ఉంది. ఏడాది కాలంలో 9.71 శాతం రాబడులను ఇచ్చింది. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 12.52 శాతంగా ఉన్నాయి. ఐదేళ్లలో 11.54 శాతం, ఏడేళ్లలో 15.35 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసుకోవాలనుకునే వారు, ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడే ఆశించిన రాబడులకు అవకాశం ఉంటుంది. లార్జ్‌క్యాప్‌ ఫండ్‌ కనుక సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఇంకాస్త మెరుగైన రాబడులకు వీలుంటుంది. 

 



You may be interested

మార్కెట్లపై కాకుండా స్టాక్స్‌పై దృష్టి పెట్టండి!

Monday 2nd March 2020

స్టాక్స్‌ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు చేయండి మార్కెట్లు ఎప్పుడు బాటమవుట్‌ అవుతాయన్నది చెప్పలేం - జోనాథన్‌ షీల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫండ్‌ మేనేజర్‌ కరోనా సృష్టిస్తున్న విలయంకారణంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలు అవకాశాల కోసం చూడవచ్చు. అయితే మార్కెట్లు ఎక్కడ బాటమ్‌అవుట్‌ అవుతాయన్నది అంచనా వేయలేమంటున్నారు జోనాథన్‌ షీల్‌. కరోనా వైరస్‌, కేంద్ర బ్యాంకులు, మార్కెట్లు తదితర అంశాలపై ఐఐఎఫ్‌ఎల్‌ ఫండ్‌ మేనేజర్‌ జోనాథన్‌ ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను

డిజిటల్‌ పాలసీ ఎంతో చౌక

Monday 2nd March 2020

ఏ సంస్థ నుంచి తీసుకుంటే నయం..? ఆన్‌లైన్‌లో వాహన బీమా పాలసీ ఎంతో ఆదా అకో, గో డిజిట్‌ నుంచి మంచి ఆఫర్లు 20-30 శాతం తక్కువ ప్రీమియం ఇతర సంస్థల నుంచి కూడా ఎన్నో ఆఫర్లు కాకపోతే చూడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి వాహనానికి బీమా తీసుకోవడం నిబంధనల రీత్యా తప్పనిసరి. ఏటేటా వాహన ‍ప్రీమియం ఖరీదయిపోతోంది. ఈ క్రమంలో ప్రీమియం భారం కాస్త తగ్గించుకునేందుకు డిజిటల్‌ పాలసీలపై దృష్టి సారించొచ్చు. ఆన్‌లైన్‌లోనే సేవలతో దూసుకుపోతున్న అకో,

Most from this category