News


ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేసుకోతగినది.!

Monday 10th February 2020
personal-finance_main1581310572.png-31647

  • మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌

దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. గతంలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండే ఈ పథకం, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పునర్‌వర్గీకరణ అనంతరం ఎక్కువ పెట్టుబడులను లార్జ్‌ క్యాప్‌ విభాగానికి కేటాయించే విధంగా మార్పులు చేసింది. పలు సంస్థలు ఈ పథకానికి 5 స్టార్‌ ఇవ్వడం గమనార్హం. 

రాబడులు...
ఈ పథకంలో ఏడాది రాబడులు 18 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షికంగా 14 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అలాగే, ఐదేళ్లలో వార్షికంగా 15.76 శాతం, ఏడేళ్లలో వార్షికంగా 23.42 శాతం రాబడులను అందించింది. కానీ, ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా భావించే బీఎస్‌ఈ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ సూచీ పెరుగుదల ఏడాదిలో 10 శాతం, మూడేళ్లలో 11.56 శాతం, ఐదేళ్లలో 8.6 శాతం, ఏడేళ్లలో 12.5 శాతం చొప్పునే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. అంతేకాదు, గత 15 నెలల కాలంలోనూ పోటీ పథకాల కంటే రాబడుల పరంగా ముందుంది. ఇదే కాలంలో బెంచ్‌ మార్క్‌ రాబడులు 15 శాతంలోపే ఉండగా, మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ రాబడులు 16.5 శాతంగా ఉన్నాయి. 

పెట్టుబడుల విధానం...
లార్జ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం, గరిష్టంగా 65 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం గత పనితీరును పరిశీలించినట్టయితే కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. తర్వాతి సంవత్సరాల్లో అద్భుత రాబడులతో సగటున మెరుగైన పనితీరును చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు. గత రెండేళ్లలో ఎన్నో అస్థిరతలు నెలకొనగా.. ఈ సమయంలోనూ ఈ పథకం పనితీరు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండడాన్ని గమనించాలి. గత ఏడేళ్లలో చూసుకంటే ఈ విభాగంలోనే ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. ప్రస్తుతం తనవద్దనున్న పెట్టుబడుల్లో 99.4 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. ముఖ్యంగా మెగాక్యాప్‌, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 52 శాతం పెట్టుబడులు ఉండగా, మిడ్‌క్యాప్‌లో 42.5 శాతం, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో 5.3 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే వ్యాల్యూషన్ల పరంగా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో ఆకర్షణీయ ధరల్లో ఉండడంతో వీటిల్లో ఎక్స్‌పోజర్‌ పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 59 స్టాక్స్‌ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 33 శాతం వరకు పెట్టుబడులను ఈ రంగంలోని  కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసింది. ఆ తర్వాత హెల్‌కేర్‌ రంగం (10.83 శాతం), ఎనర్జీ (10 శాతం), ఎఫ్‌ఎంసీజీ (8.50 శాతం) రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. 
 You may be interested

కరోనా ఎఫ్టెక్ట్‌- ఫార్మా ఎగుమతులకు చెక్‌?!

Monday 10th February 2020

చైనా నుంచి తగ్గుతున్న బల్క్‌డ్రగ్‌ దిగుమతులు యాంటిబయోటిక్స్‌ తయారీకి ముడిసరుకుల కొరత? ఇప్పటికే ఏపీఐ, తదితరాల ధరలు పెంచిన ట్రేడర్లు కొన్ని కీలకమైన యాంటీబయోటిక్స్‌ ఎగుమతులను నియంత్రించాలని దేశీ ఔషధ శాఖ(డీఓపీ) భావిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు వీలుగా ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో పలు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోవడంతో కొంతమంది ట్రేడర్లు బల్క్‌డ్రగ్స్‌ ధరలను పెంచుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీయంగా అత్యవసరమైన ఔషధాల

నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం!

Monday 10th February 2020

ఎఫ్‌అండ్‌ఓ నిపుణుల సూచన ఈవారం పరిమిత శ్రేణిలో నిఫ్టీ కదలాడే ఛాన్సున్నందున షార్ట్‌స్ట్రాడిల్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యూహంలో ఫిబ్రవరి 13న ఎక్స్‌పైరీ అయ్యే 12100 నిఫ్టీ కాల్‌ ఒకటి, పుట్‌ ఒకటి విక్రయిస్తారు. నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద బలమైన మద్దతు, 12200 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఉన్నందున ఈ వ్యూహం మంచి ఫలితాన్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ ఈ రేంజ్‌ను దాటితే మాత్రం వ్యూహంలో నష్టం

Most from this category