News


ఇండియన్ బ్యాంక్‌తో ఆదిత్య బిర్లా లైఫ్ జట్టు

Thursday 8th August 2019
personal-finance_main1565242730.png-27629

చెన్నై: ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్‌ కార్పొరేట్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇండియన్ బ్యాంక్ ఎండీ పద్మజ చుండూరు, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్ ఇన్సూరెన్స్ ఎ౾ండీ అజయ్ శ్రీనివాసన్ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌కు చెందిన జీవిత బీమా పథకాలను ఇండియన్ బ్యాంక్ తమ ఖాతాదారులకు విక్రయించనుంది. 2,900 పైచిలుకు శాఖల్లో ఇవి అందుబాటులో ఉంటాయని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. అర్బన్‌, సెమీ-అర్బన్ ప్రాంతాల వారికి మరింత చేరువ కావడానికి ఈ డీల్ తోడ్పడగలదని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ పేర్కొంది. 



You may be interested

హైదరాబాద్‌లో రూ.700 ‍కోట్లతో కటేరా ప్లాంటు

Thursday 8th August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- డిజైన్‌, టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నిర్మాణ రంగంలో ఉన్న యూఎస్‌ కంపెనీ కటేరా హైదరాబాద్‌ వద్ద ప్లాంటును నెలకొల్పుతోంది. శంషాబాద్‌ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ సుమారు రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. నవంబరు నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తుల తయారీ ప్రారంభం అవుతుందని కటేరా ఆసియా ప్రెసిడెంట్‌ ఆశ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. డిజైన్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ నజీబ్‌ ఖాన్‌తో

ఆదుకోండి మహాప్రభో!!

Thursday 8th August 2019

ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి వాహనాలపై జీఎస్‌టీ తగ్గించండి కేంద్రానికి ఆటోమొబైల్ పరిశ్రమ విజ్ఞప్తి న్యూఢిల్లీ: అమ్మకాలు లేకపోవడంతో పాటు పలు సవాళ్లతో సతమతమవుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆపన్న హస్తం అందించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమను ఆదుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని, వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గించాలని కోరాయి. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మారుతీ సుజుకీ

Most from this category