News


ఐసీఐసీఐ ఎఫ్‌డీల రేట్లు మారాయి...

Thursday 15th August 2019
personal-finance_main1565852362.png-27783

ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్ల రేట్లలో మార్పులు చేసింది. 7-14 రోజుల డిపాజిట్లపై 4 శాతం, 15-29 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 30-45 రోజుల ఎఫ్‌డీలపై 5.25 శాతం, 46-60 రోజుల ఎఫ్‌డీపై 5.75 శాతం, 61-90 రోజుల డిపాజిట్‌పై 5.75 శాతం, 91-120 రోజుల డిపాజిట్‌పై 5.75 శాతం, 185-289 రోజుల డిపాజిట్‌పై 6.25 శాతం, 290-ఏడాదిలోపు డిపాజిట్లపై 6.50 శాతం, ఏడాది నుంచి 389 రోజుల డిపాజిట్లపై 6.70 శాతం, 390 రోజుల నుంచి 18 నెలల్లోపు డిపాజిట్లపై 6.80 శాతం, 18నెలలు-2 ఏళ్ల డిపాజిట్లపై 7.10 శాతం, 2 ఏళ్లు దాటిన, మూడేళ్ల వరకు డిపాజిట్లపై 7.10 శాతం, మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోంది. 



You may be interested

మార్కెట్లోకి ‘టియాగో జేటీపీ, టిగోర్‌ జేటీపీ’

Thursday 15th August 2019

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌, కోయంబత్తూరుకు చెందిన జయం ఆటోమోటివ్స్‌ భాగస్వామ్యంలో టియాగో జేటీపీ, టిగోర్‌ జేటీపీ నూతన వెర్షన్‌ కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇరు సంస్థల జాయింట్‌ వెంచర్‌ జేటీ స్పెషల్‌ వెహికల్స్‌ (జేటీఎస్‌వీ) ఈ కార్లను బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.6.69 లక్షల నుంచి రూ.7.59 లక్షలుగా ప్రకటించింది. ఈ అధునాత వెర్షన్లలో ఆటో-ఫోల్డ్‌ వెలుపల అద్దాలు,

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రేటింగ్స్ కోత

Thursday 15th August 2019

ముంబై: గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ (ఐబీహెచ్) దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ వెల్లడించింది. అలాగే భవిష్యత్ అంచనాలను కూడా 'స్థిర' స్థాయి నుంచి 'నెగటివ్‌' స్థాయికి తగ్గించినట్లు తెలిపింది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు.. నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఈ డౌన్‌గ్రేడ్ సూచిస్తుందని మూడీస్ పేర్కొంది. 

Most from this category