News


బంగారంపై పెట్టుబడికి బోలెడు మార్గాలు!

Thursday 19th December 2019
personal-finance_main1576739715.png-30311

భారతీయులకు బంగారం కేవలం ఆభరణమే కాదు, అది ఒక పెట్టుబడి సాధనం, ఒక హోదాచిహ్నం, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో సంపదను కాపాడే అస్త్రమని ప్రముఖనిపుణుడు సుధేశ్‌ నంబియత్‌ చెబుతారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో బంగారం పెట్టుబడి సాధనంగా మరింతమందిని ఆకర్షిస్తోంది.

ఈ నేపథ్యంలో మనదగ్గర బంగారంపై పెట్టుబడులకు ఉన్న మార్గాలు ఎన్ని? అవి ఏంటి? చూద్దాం...
1. భౌతిక రూపంలో: బంగారాన్ని భౌతికంగా నాణేలు, అచ్చులు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఆభరణాల కొనుగోలులో బంగారం ధరతో పాటు తయారీ చార్జీలు, పన్నులు తదితరాలు కలిపి ఉంటాయి. అందువల్ల ఫిజికల్‌గా బంగారం కొనదలచినవాళ్లు(పెట్టుబడికోసం) ఆభరణాల కన్నా బంగారం బార్స్‌, కాయిన్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. వీటిని కూడా ఎంఎంటీసీ అవుట్‌లెట్లు, బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి కొనడం మంచిది.
2. గోల్డ్‌ ఈటీఎఫ్‌: ఇవి భౌతిక బంగారంలో పెట్టుబడి పెట్టే ఎక్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌. స్టాక్స్‌లాగానే వీటిని కొనాలన్నా, అమ్మాలన్నా ట్రేడింగ్‌ డీమ్యాట్‌ అకౌంట్‌ అవసరం. ఇవి 99.5 శాతం బంగారంలో పెట్టుబడులు పెడతాయి. మీరు పెట్టిన పెట్టుబడిలో 90 శాతం భౌతిక బంగారంలో, మిగిలినది డెట్‌ సాధనాల్లో పెట్టుబడిగా పెడతారు. ఇవి బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టయినందున సులభ లావాదేవీలు జరపవచ్చు. భారీ పరిణామాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.
3. గోల్డ్‌ ఫండ్స్‌: బంగారం, అనుబంధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ఫండ్స్‌. వీటిని ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తారు. రిస్కు తక్కువగా ఉండాలనుకునే ఇన్వెస్టర్లకు పనికివస్తాయి. 
4. గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లేదా గోల్డ్‌ సేవింగ్‌ ఫండ్స్‌: బంగారం ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్‌ ఫండ్స్‌. వైయుక్తికంగా ఈటీఎఫ్‌ల గురించి తెలియక పెట్టుబడులు పెట్టలేనివాళ్లకు ఉపయుక్తం. నిరంతరం ధరలను మానిటర్‌ చేయలేనివాళ్లు వీటిని ఎంచుకుంటారు.
5. గోల్డ్‌ మైనింగ్‌ షేర్లు:  సెంకడరీ ఈక్విటీ మార్కెట్లో బంగారాన్ని మైనింగ్‌ చేసే కంపెనీల షేర్లను ఎంచుకొని పెట్టుబడి పెట్టవచ్చు. 
6. సావరిన్‌గోల్డ్‌ బాండ్స్‌: ఆర్‌బీఐ క్రమానుగతంగా జారీ చేస్తుంటుంది. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వారం కాలపరిమితితో అమ్మకాలు, కొనుగోళ్ల విండో ఓపెనవుతుంది. ఈ బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదు, ఆరు, ఏడేళ్ల ఎగ్జిట్‌ ఆప్షన్లుంటాయి.
మాంద్యం తదితర పరిస్థితులు కనుచూపుమేరలో ఉన్న ప్రస్తుత తరుణంలో బంగారంపై పెట్టుబడి మీ సంపదను సురక్షితంగా ఉంచుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. 



You may be interested

అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఆందోళన అనవసరం!

Thursday 19th December 2019

హేమాంగ్‌ జానీ  టాటా కంపెనీల వ్యాపారంలో రికవరీ చూస్తుంటే చంద్రశేఖర్‌ నేతృత్వం మంచి ఫలితాలు ఇస్తుందని తెలుస్తోందని షేర్‌ఖాన్‌ అనలిస్టు హేమాంగ్‌ జానీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై ఆందోళన అనవసరమని అభిప్రాయపడ్డారు. తీర్పు వచ్చాక టాటాగ్రూప్‌ షేర్లలో కొంత ఆందోళన కనిపించిందన్నారు. కానీ యథాతధ స్థితి కొనసాగే అవకాశాలున్నాయన్నది అర్ధం చేసుకోవాలని చెప్పారు. టాటాలు తప్పకుండా ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాయని అంచనా వేశారు. అయితే సుప్రీంకోర్టులో

మార్కెట్‌క్యాప్‌ వ్యత్యాసం... మరింత పెరిగింది!

Thursday 19th December 2019

ఇన్వెస్టర్లు ఎక్కువగా మక్కువ చూపడంతో చిన్న స్టాకులతో పోలిస్తే లార్జ్‌క్యాప్స్‌ అధికంగా లాభాలు చూపుతున్నాయి. దీంతో లార్జ్‌క్యాప్స్‌కు చిన్నక్యాప్స్‌కు మధ్య మార్కెట్‌ క్యాప్‌ అంతరం రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. స్టాక్‌ ఎక్చేంజ్‌లోని ఏ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ ప్రస్తుతం 94 శాతానికి పెరిగింది. 2000 సంవత్సరం తర్వాత ఈ రేంజ్‌లో ఈ మార్కెట్‌ క్యాప్‌ పెరగడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ మార్కెట్‌క్యాప్‌ 2018

Most from this category