STOCKS

News


మీ లక్ష్యాలకు గన్‌షాట్‌

Monday 29th July 2019
personal-finance_main1564382952.png-27372

  • మిరే అస్సెట్‌ ఎమర్జింగ్ బ్లూచిప్‌ ఫండ్‌

దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో దూకుడైన రాబడులు రెండూ ఈ పథకంలో భాగం. ఎందుకంటే మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. ఈ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. 

రాబడులు...
ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ రాబడుల విషయంలో మెరుగైన పనితీరును నిరూపించుకుంది. ఏడాది కాలంలో 10.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 18.6 శాతం, ఐదేళ్లలో 21 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. కానీ, ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే ‘నిఫ్టీ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ 250టీఆర్‌ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 2 శాతం, 14.5 శాతం, 12.8 శాతంగానే ఉండడం గమనార్హం. బెంచ్‌ మార్క్‌తో చూసుకుంటే 4-6 శాతం అధిక రాబడులు అందించింది. అంతేకాదు ఇదే విభాగంలోని కెనరా రొబెకో ఎమర్జింగ్‌ ఈక్విటీస్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌, ఎల్‌అండ్‌టీ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకాల కంటే పనితీరు పరంగా ముందుండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది.

పెట్టుబడుల విధానం...
లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌నకు 35-65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. ప్రస్తుతానికి 99.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉండగా, పెట్టుబడుల్లో కేవలం 0.48 శాతమే నగదు రూపంలో కలిగి ఉంది. ప్రస్తుతం 50.5 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేయగా, మరో 43 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో, 6.43 శాతం మేర స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 61 స్టాక్స్‌ ఉన్నాయి. ఇందులో టాప్‌ 10 స్టాక్స్‌లోనే 37.63 శాతం మేర ఇన్వెస్ట్‌ చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 33 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేయగా, ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో 12.59 శాతం, ఇంధన రంగ స్టాక్స్‌లో 8 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ తీవ్ర అస్థిరతలు, దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. గత ఏడాది కాలంలో లార్జ్‌క్యాప్‌ సూచీ 7 శాతం లాభపడితే, మిడ్‌క్యాప్‌ సూచీ 4 శాతం పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 10 శాతం మేర రాబడులు అందించిందంటే దీని పనితీరుకు ఇదే నిదర్శనం. 2011, 2018 మార్కెట్‌ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని కూడా పరిశీలించొచ్చు.You may be interested

ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ దృష్టి

Monday 29th July 2019

- వడ్డీ రేట్ల నిర్ణయంపై మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం - డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్ ఫలితాలు ఈవారంలోనే.. - మౌలిక సదుపాయాల గణాంకాలు (బుధవారం), మార్కిట్‌ తయారీ పీఎంఐ డేటా (గురువారం) వెల్లడి ముంబై: గత వారాంతాన ఆగస్టు సిరీస్‌ తొలి రోజు ట్రేడింగ్‌ లాభాలను నమోదుచేసినప్పటికీ.. వారం మొత్తం మీద చూస్తే బేర్స్‌దే హవాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా,

ఇ-స్మార్ట్‌ పాలసీ..!

Monday 29th July 2019

ప్రీమియం వెనక్కి రాదన్న భావన వద్దే వద్దు ప్రీమియం చాలా తక్కువ ఎన్నో అవసరాలకు రక్షణ రుణాలకూ రక్షణనిచ్చే టర్మ్‌ ప్లాన్‌లు ప్రీమియం భారం తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్‌ ఆర్జన కలిగిన ప్రతీ ఒక్కరూ ఒక్కసారి దృష్టి సారించాల్సిందే జీవిత బీమా... ఇప్పటికీ చాలా మంది దీన్ని పెట్టుబడి సాధనంగానే చూస్తున్నారు. తమకు ఏదైనా జరగరానిది జరిగితే తమ కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదన్న ఆకాంక్ష ఎక్కువ మందిలో ఉన్నప్పటికీ... ఆచరణకు వచ్చే సరికి సరైన కవరేజీ తీసుకుంటున్న

Most from this category