News


గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 9వ తేదీతో ముగింపు

Wednesday 7th August 2019
personal-finance_main1565155268.png-27596

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సౌర్వభౌమ బంగారం బాండ్ల పథకంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడో విడత పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. గ్రాముకు రూ.3,499గా ధర నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 5న ఆరంభం కాగా, ఈ నెల9వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 14వ తేదీన అర్హులైన వారికి బాండ్లను జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ.50 వరకూ డిస్కౌంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అటువంటి ఇన్వెస్టర్లు గ్రాముకు చెల్లించాల్సింది రూ.3,449 మాత్రమేనన్న మాట. దేశంలో బంగారానికి (ఫిజికల్‌గా) డిమాండ్‌ను తగ్గించడం లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో బంగారం ధర నూతన గరిష్టాలకు చేరిన తరుణంలో ప్రభుత్వం బాండ్ల ఇష్యూను చేపట్టడం గమనార్హం. ఇందులో పెట్టుబడులను కనీసం 8 ఏళ్లు కొనసాగించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరపై ఏటా 2.5 శాతం వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లించడం జరుగుతుంది. మెచ్యూరిటీ సమయానికి మార్కెట్‌ ధర ప్రకారం బాండ్లపై చెల్లింపులు జరుగుతాయి. You may be interested

మాస్టర్‌కార్డ్ కొత్త ఫీచర్‌

Wednesday 7th August 2019

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలు సురక్షితంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా జరిగే దిశగా అంతర్జాతీయ పేమెంట్ సొల్యూషన్స్ దిగ్గజం మాస్టర్‌కార్డ్ తాజాగా కొత్త పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'ఐడెంటిటీ చెక్ ఎక్స్‌ప్రెస్‌' పేరిట ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడంలో థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌ అవసరం ఉండదని సంస్థ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన గ్లోబల్ మాస్టర్‌కార్డ్‌ సైబర్‌సెక్యూరిటీ సదస్సులో మాస్టర్‌కార్డ్ దీన్ని ఆవిష్కరించింది. సాధారణంగా 20

ఆర్‌బీఐ రేట్ల కోత ఎంత?

Wednesday 7th August 2019

రుతుపవనాల లోటు తగ్గుతుండడం, చమురు ధరల పతనం, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టడం వలన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరుపుతున్న ద్రవ్య పరపతి విధాన సమావేశంలో స్వల్పకాలిక రుణ రేటు, రెపో రేటును 25-50 బేసిస్ పాయింట్లు (బిపిఎస్‌) తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ బృందం నిర్ణయం బుధవారం వెలువడనుంది. దేశియ ఆర్థిక మం‍దగమనాన్ని తగ్గించేందుకు వరుసగా నాలుగోసారి రేట్ల కోతకు

Most from this category