News


ఈఎల్‌ఎస్‌ఎస్‌ తక్షణమే ఆరంభిస్తే మంచిది

Tuesday 28th May 2019
personal-finance_main1559032916.png-25965

  • మార్చి వరకు ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు
  • ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ సహా పలు ఎంపికలు

ముంబై: ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ఆదాకు ఉపకరించే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. ఏప్రిల్‌ నుంచి ఆరంభించి మార్చి వరకు క్రమానుగతంగా ప్రతీ నెలా ఎంపిక చేసుకున్న ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఏడాది చివర్లో ఆందోళన పడక్కర్లేదు. పైగా ఎంపిక విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో మంచి పనితీరు కలిగిన పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ, యాక్సిస్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ సహా పలు ఫండ్స్‌ ఉన్నాయి. 
పన్ను ఆదా...
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తం పెట్టుబడులపై పన్ను మినహాయింపు అవకాశం ఉంటుంది. సెక్షన్‌ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ కూడా ఒకటి. అన్ని పన్ను ఆదా సాధనాల్లోనూ తక్కువ లాకిన్‌ పీరియడ్‌ (మూడేళ్లు) ఉన్నది కూడా ఈఎల్‌ఎస్‌ఎస్‌లోనే. పైగా ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం. మార్కెట్‌ క్యాప్‌తో సంబంధం లేకుండా మంచి రాబడులకు అవకాశం ఉన్న కంపెనీలను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేసే సౌలభ్యం ఈ ఫండ్స్‌ మేనేజర్లకు ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో ఇన్వెస్టర్ల లక్ష్యాలకు సరిపడా సంపదను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. డివిడెండ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సమయంలో వచ్చే లాభం రూ.1 లక్ష వరకు పన్ను ఉండదు. అంతకుమించితే ఆ మొత్తంపై కేవలం 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నెలా రూ.12,500 మొత్తాన్ని సిప్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే 12 నెలల్లో మొత్తం రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసినట్టవుతుంది. 
సరైన పథకం...
ముఖ్యంగా పన్ను ఆదా ప్రయోజనం ఒక్కటే ప్రాముఖ్యం కాదు. మంచి రాబడులను ఇచ్చే పథకాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే. ఆ విధంగా చూసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల చరిత్ర ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌లో చూడొచ్చు. మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సగటున స్థిరమైన రాబడులను ఇచ్చింది. ఐదేళ్లలో వార్షికంగా 10.54 శాతం, పదేళ్లలో వార్షికంగా 14.3 శాతం చొప్పున రాబడులు ఈ పథకంలో ఉన్నాయి.



You may be interested

ఎన్‌పీఏలు తగ్గినా...పీఎన్‌బీ 4 శాతం డౌన్‌

Tuesday 28th May 2019

ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) మార్కెట్‌ అంచనాల్ని మించిన ఫలితాల్ని ప్రకటించినా, ఈ  షేర్లు మంగళవారం 4.50శాతం నష్టపోయాయి. గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికంలో బ్యాంక్‌ భారీ నష్టాలను నమోదు చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేర్లు రూ.90.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు బ్యాంక్‌ క్యూ4 ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో షేర్లు హెవీ వాలూ‍్యమ్స్‌తో ట్రేడయ్యాయి. ఫలితాల ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేర్ల అమ్మకాలకే

రెండిందాల లాభం

Tuesday 28th May 2019

హైబ్రీడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌తో ప్రయోజనాలు పెట్టుబడికి తక్కువ రిస్కు భయాలు దీర్ఘకాలంలో అధిక రాబడులు సాధారణంగా షేర్లలోనూ, షేర్ల ఆధారిత ఫండ్స్‌లోనూ పెట్టుబడులంటే అధిక రాబడులకు అవకాశాలు ఉన్నా అందుకు తగ్గ స్థాయిలో రిస్కులూ ఉంటాయి. ఇక పెట్టుబడులకు పెద్ద రిస్కులు లేని సురక్షితమైన డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేద్దామంటే ఫండ్స్‌ వైపు చూద్దామంటే రాబడులు ఓ మోస్తరు స్థాయిలోనే ఉంటాయి. అలా కాకుండా ఇటు అధిక రాబడులివ్వగలిగే ఈక్విటీలు, అటు సురక్షితమైన డెట్‌

Most from this category