News


రూ.148కే టర్మ్‌ప్లాన్‌

Saturday 3rd August 2019
personal-finance_main1564806725.png-27509

ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మొబిక్విక్‌ భాగస్వామ్యంతో రూ.లక్ష నుంచి జీవిత బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తోంది. మొబిక్విక్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా యూజర్లు గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. రూ.లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. రూ.లక్ష బీమాకు ఏడాదికి ప్రీమియం రూ.148. అదే రూ.3 లక్షల బీమాకు ప్రీమియం రూ.443, రూ.5 లక్షల బీమాకు ప్రీమియం రూ.738. ఇవి టర్మ్‌ పాలసీలు. సాధారణంగా ఎండోమెంట్‌ పాలసీలతో పోలిస్తే టర్మ్‌ పాలసీల ప్రీమియం చౌకగా ఉంటుంది. ఇవి పూర్తి స్థాయి బీమా రక్షణతో కూడిన పాలసీలు. గడువు తీరిన తర్వాత పాలసీదారులు జీవించి ఉన్నా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు. మొబైల్‌ టెక్నాలజీల వినియోగం పెరుగుదల, ఇంటర్నెట్‌ విస్తరణ నేపథ్యంలో కస్టమర్లకు బీమా ఉత్పత్తుల ద్వారా చేరువ కావడానికి మొబిక్విక్‌ వంటి ఫిన్‌టెక్‌ సంస్థలు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ ఎండీ, సీఈవో సుమిత్‌రాయ్‌ వ్యాఖ్యానించారు. 



You may be interested

గోల్డ్‌ బాండ్‌ ధర గ్రాముకు రూ.3,499

Saturday 3rd August 2019

న్యూఢిల్లీ: సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ 2019-2020 (సిరీస్‌ 3) జారీ ధరను కేంద్రం గ్రాముకు రూ.3,499గా స్థిరీకరించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బాండ్లకు చందా చెల్లింపు ఆగస్టు 5వ తేదీన ప్రారంభమవుతుంది. ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. సెటిల్‌మెంట్‌ తేదీ ఆగస్టు 14 అని ఆర్థిక శాఖ తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, డిజిటల్‌ పద్దతిలో చెల్లింపులు జరిపే వారికి గ్రాముకు రూ.50

ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి ఇప్పుడు...?

Saturday 3rd August 2019

నిఫ్టీ 11,981 నుంచి ఏకధాటిగా పడిపోతూ 11,000 పాయింట్లకు దిగవకు చేరిపోయింది. కేవలం 19 సెషన్లలోనే ఇది జరిగింది. దీంతో చాలా స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా మారాయి. దేశీయ అంశాల పాత్రే ఎక్కువగా ఉంటే, అంతర్జాతీయ అంశాలు కూడా మన మార్కెట్ల నష్టాలకు తోడయ్యాయి. అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తితో ఉన్న

Most from this category