News


బైక్‌ అప్‌గ్రేడ్‌... బీమా అప్‌గ్రేడ్‌

Monday 17th June 2019
personal-finance_main1560750550.png-26344

దేశంలో వాహనాల వినియోగం పెరిగిపోతోంది. ఏ ఇతర దేశంతో పోల్చి చూసిన ఎక్కువ వృద్ధి మనదేశంలోనే. దేశీయ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో 80 శాతం ద్విచక్ర వాహనాలదే ఆధిపత్యం. రవాణా పరంగా అత్యంత సౌకర్యమైనది కావడం వల్లే. అయితే, ఆశ్చర్యకరమైన విషయం  ఏమిటంటే అధిక ఇంజన్‌ సామర్థ్యంతో కూడిన మోటారు సైకిళ్లకు డిమాండ్‌ పెరుగుతుండడం. ఈ విభాగంలో 300 నుంచి 500సీసీ ఇంజన్‌ సామర్థ్యాల బైకుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక 500సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన బైకుల మార్కెట్‌ కూడా వేడెక్కుతోంది. మెట్రోలు, టైర్‌-1 పట్టణాల్లో ఈ బైకులకు ఆదరణ పెరుగుతోంది. ఈ బైకుల ఖరీదు ఎక్కువే అయినప్పటికీ, రుణం లభించే వెసులుబాటు ఉండడం సానుకూలం. అయితే, దురదృష్టవశాత్తూ ఈ బైకులు ప్రమాదం బారిన పడితే విడిభాగాలకు జరిగే నష్టం పెద్దగానే ఉంటుంది. ఇది పాకెట్‌కు చిల్లు పెడుతుంది. కనుక కాంప్రెన్సివ్‌ కవరేజీతో కూడిన మోటారు ఇన్సూరెన్స్‌ ఒక్కటీ ఉండే సరిపోదు. తగిన యాడ్‌ఆన్‌ కవర్లను కూడా తీసుకోవడం అవసరం. అప్పుడే పూర్తి రక్షణ లభిస్తుంది. 

జీరో లేదా నిల్‌ డిప్రిసియేషన్‌ కవర్‌, ఇంజన్‌ ప్రొటెక్టర్‌
సున్నా లేదా తరుగుదల లేని కవరేజీ అన్నది మీ బైక్‌కు తప్పనిసరి. ఎందుకంటే చిన్న విడిభాగం రిపేర్‌ చేయాల్సి వచ్చినా ఖర్చు ఎక్కువే అవుతుంది. మన దేశంలోకి దిగుమతి అయ్యే బైకుల్లో అధిక శాతం పూర్తిగా నిర్మించిన యూనిట్లే (సీబీయూ). వీటికి ఏదైనా నష్టం జరిగితే ఈ కవరేజీతో తగినంత పరిహారాన్ని ఏ మినహాయింపు లేకుండా పొందొచ్చు. ఇంజన్‌ ప్రొటెక్టర్‌ కూడా తప్పనిసరి. దీని కింద ఇంజన్‌లో చిన్న విడిభాగాలను మార్చాల్సి వచ్చినా లేదా రిపేర్‌ చేయాల్సి ఉన్నా కవరేజీ పొందొచ్చు. అలాగే, గేర్‌బాక్స్‌లో విడిభాగాలను మార్చాల్సి ఉన్నా కవరేజీ ఇస్తుంది. దెబ్బతిన్న ఇంజన్‌ ఓవర్‌హాల్‌, గేర్‌బాక్స్‌ ఓవర్‌హాల్‌, లేబర్‌ ఖర్చులను సైతం చెల్లిస్తుంది. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో బైకుల ఇంజన్లలోకి నీరు వెళితే అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఈ కవరేజీ ఉపయోగపడుతుంది. 

కన్జ్యూమబుల్‌ కవర్‌
చిన్నవి కూడా మొత్తం ఖర్చుల్లో చేరి పెద్దవవుతాయి. వాహనంలో కన్జ్యూమబుల్స్‌ అంటే ఇంజన్‌ ఆయిల్‌, గేర్‌బాక్స్‌ ఆయిల్‌, పవర్‌ స్టీరింగ్‌ ఆయిల్‌, బైక్‌ ఆయిల్‌, బ్యాటరీ ఎలక్ట్రోలైట్‌, ఫ్లూయిడ్‌, రేడియేటర్‌ కూలంట్‌, నట్లు, బోల్టులు ఈ తరహా విడిభాగాలు. కన్జ్యూమబుల్‌ కవర్‌ అన్నది కన్జ్యూమబుల్స్‌కు కవరేజీనిచ్చే యాడ్‌యాన్‌. ఇది సాధారణ మోటార్‌ బీమాలో భాగంగా ఉండదు. కానీ, ఇది తప్పనిసరిగా తీసుకోవాల్సిన యాడ్‌ ఆన్‌ కవర్‌. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగితే ఆయిల్‌తోపాటు ఇతర కన్జ్యూమబుల్స్‌ మార్చాల్సి వస్తే ఖర్చులు ఎక్కువే అవుతాయి. జీరో డిప్రిసియేషన్‌, ఇంజన్‌ ప్రొటెక్టర్‌కు టాపప్‌గా దీన్ని తీసుకోవచ్చు. 

పిలియన్‌ కవర్‌ లేదా ఎక్స్‌ట్రా యాక్సిడెంటల్‌ కవర్‌ 
సూపర్‌బైకులన్నవి అధిక ఇంజన్‌ సామర్థ్యం, అధిక పవర్‌తో ఉంటాయి. వీటిని నడపడంలో, ముఖ్యంగా వెనుక ఎవరైనా కూర్చున్న సమయాల్లో నడపడంలో శిక్షణ, సాధన అవసరం. ఈ బైకులకు యాక్సిడెంట్‌ జరిగితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా కేసుల్లో బైక్‌ నడిపే వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వారు కూడా మరణించే అవకాశాలు ఉంటాయి. బండిని నడిపే వ్యక్తి యజమాని కాకపోయినా, వెనుక కూర్చున్న వారికీ రూ.15 లక్షల కవరేజీ లభిస్తుంది. 

  • గుర్నీష్‌ ఖురానా, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ మోటార్‌ కంట్రీ హెడ్‌ 



You may be interested

మోస్తరు రిస్క్‌... రాబడులు ఎక్కువ!

Monday 17th June 2019

ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ కాస్త అధిక రాబడుల కోసం మోస్తరు రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌ కూడా ఒకటి. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది.

నష్టాల్లో అడాగ్‌ షేర్లు

Monday 17th June 2019

క్యూ4 ఫలితాలలో నష్టాలను ప్రకటించిన ఆర్‌ ఇన్‌ఫ్రా ఫలితాలకు సరియైన ఆడిట్‌ ఆదారాలు లేవంటున్న ఆడిట్‌ సంస్థలు సోమవారం అనిల్‌ అంబాని రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన పలు కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వీటిలో తాజాగా క్యు4 ఫలితాలు విడుదల చేసిన రిలయన్స్‌ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు  11శాతం నష్టపోయి రూ.52.70 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం విడుదల చేసిన 2018-19 నాలుగో త్రైమాసిక ఫలితాలలో రూ.3,301కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. రూ.8,500కోట్ల  రైటాఫ్‌ల కారణంగా

Most from this category