News


లార్జ్‌ క్యాప్‌ పథకాల్లో మేటి..!

Monday 11th February 2019
personal-finance_main1549866951.png-24124

సూచీలు ముందుకే పయనిస్తున్నాయి. కానీ, అన్ని లార్జ్‌క్యాప్‌ పథకాలు సూచీలతో పోలిస్తే రాబడుల పరంగా షార్ప్‌గా ఉన్నాయంటే... అవునని చెప్పలేం. అన్ని పథకాలు సూచీలకు దీటుగా, సూచీలను మించి రాబడులను అన్ని సమయాల్లోనూ ఇస్తాయని ఆశించలేం. కొన్నింటికే అది సాధ్యపడుతుంది. ఈ విభాగంలోని యాక్సిస్‌ బ్లూచిప్‌ పథకం మాత్రం లార్జ్‌క్యాప్‌ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చినా, సూచీలతో పోల్చి చూసినా రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్‌, దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) అధిక రాబడులను కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్‌ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి.
రాబడులు
దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మార్కెట్లో ఎన్నో అస్థిరతలు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది సూచీల లాభాలు ఐదు శాతం లోపునకు పరిమితం అయ్యాయి. కానీ, యాక్సిస్‌ బ్లూచిప్‌ పథకం మాత్రం గడచిన ఏడాది కాలంలో 9.90 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి ఇదే సమయంలో రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 రాబడులు మాత్రం 3.99 శాతంగానే ఉన్నాయి. ఇక లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ కేటగిరీ సగటు రాబడులు గత ఏడాది కాలంలో 0.88 శాతంగానే ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసినా ఈ పథకం చక్కని పనితీరు చూపించినట్టు తెలుస్తోంది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 15 శాతంగా ఉన్నాయి. అయితే మూడేళ్ల కాలంలో నిఫ్టీ 50 రాబడులు కూడా ఇంచుమించు 15 శాతం దగ్గర్లోనే 14.96 శాతంగా ఉండగా, లార్జ్‌క్యాప్‌ విభాగం రాబడులు 13.50 శాతమే ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్‌ బ్లూచిప్‌ ప్రదర్శనే ముందుంది. వార్షికంగా 15.82 శాతం రాబడులను అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడులు 14 శాతంగాను, ఈ విభాగం రాబడులు 13.90 శాతంగాను ఉన్నాయి.
నిర్వహణ విధానం
నూరు శాతం లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. కానీ, మార్కెట్‌ అస్థిరతల్లో పెట్టుబడుల కేటాయింపుల పరంగా మార్పులతో రాబడులను కాపాడే చర్యలను ఈ పథకం మేనేజర్లు చేయడాన్ని గమనించొచ్చు. ఇందుకు నిదర్శనం... ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని ఆస్తుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు 81.65 శాతంగానే ఉన్నాయి. 19 శాతానికి పైన డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు, మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థాయిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ ఈ విధమైన నిర్వహణ చర్యలే ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌లో ఎక్కువ కేటాయింపులు కలిగి ఉండడంతో అధిక రాబడులను తెచ్చుకోగలిగింది. ప్రస్తుతం ఈ మూడు స్టాక్స్‌లోనే 17 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఇవే అని కాదు, ఈ పథకం నిర్వహణలోని చాలా స్టాక్స్‌ గతేడాది కాలంలో ర్యాలీ చేయడం గమనార్హం.

టాప్‌ హోల్డింగ్స్‌
కంపెనీ    పెట్టుబడుల శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు    9.82
బజాజ్‌ ఫైనాన్స్‌    7.51
కోటక్‌ బ్యాంకు    7.13
టీసీఎస్‌    6.08
ఐసీఐసీఐ బ్యాంకు    5.32
మారుతి సుజుకీ    4.79
అవెన్యూ సూపర్‌మార్ట్స్‌    3.83
హెచ్‌యూఎల్‌    3.65
హెచ్‌డీఎఫ్‌సీ    3.27
టైటాన్‌    3.11



You may be interested

గణాంకాలే దిక్సూచి..!

Monday 11th February 2019

 మంగళవారం రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు గురువారం టోకు ద్రవ్యోల్బణం డేటా వెల్లడి.. ఈవారంలోనే యూఎస్‌ రిటైల్ సేల్స్‌, చైనా ద్రవ్యోల్బణం, జపాన్‌ ఐఐపీ డేటా సన్‌ ఫార్మా, హిందాల్కో, ఇండియా సిమెంట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బాటా ఇండియా ఫలితాలు ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్‌ త్రైమాసికానికి పలు కార్పొరేట్‌ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు

1300 డాలర్ల పైన పసిడి పటిష్టమే

Monday 11th February 2019

పసిడిపై నిపుణుల అంచనా.. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌- నైమెక్స్‌లో పసిడి ధర పటిష్టంగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఔన్స్‌ ధర 1,300 డాలర్లపైన కొనసాగినంతకాలం పసిడిది బులిష్‌ ధోరణిగానే పరిగణించాల్సి ఉంటుందన్నది వారి విశ్లేషణ. శుక్రవారంతో ముగిసిన వారంలో ధర ఒక దశలో 1,307 డాలర్లకు పడినా, అటుపై తిరిగి 1,318 డాలర్లకు చేరడం గమనార్హం. అయితే వారంవారీగా చూస్తే ఇది 4 డాలర్లు తక్కువ. 1,325

Most from this category