News


నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ ఉపయోగాలివే..!

Saturday 18th January 2020
personal-finance_main1579335357.png-31017

దూరంగా ఉన్న మన స్నేహితులకో, బంధువులకో ఏదైనా విషయాన్ని చెప్పాలంటే మొదట్లో తంతి తపాల మీద ఆధారపడేవారము.మన రాసిన ఉత్తరం చేరడానికి కొన్ని సార్లు నెలలు కూడా పట్టేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతరోజుల్లో టెక్నాలజీ వాడకం బాగా పెరగడంతో సమాచారం ఒకచోట నుంచి మరో చోటికి సెకన్ల వ్యవధిలోనే చేరిపోతుంది. దీంతో ఇప్పుడు పోస్టు ఆఫీసులకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. కానీ భారత పోస్టల్‌ వ్యవస్థ వివిధ రకాల సేవింగ్‌ పథకాలతో ప్రజలకు చేరువవుతోంది.ఇండియా పోస్ట్‌లోని పోస్టల్‌ నెట్‌వర్క్‌ విభాగం పొదుపు, పెట్టుబడి అంశాలతో కూడిన పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల శాఖల ద్వారా అందిస్తోంది. వీటిలో ముఖ్యంగా పోస్టాఫీసు సేవింగ్స్‌ అకౌంట్‌, నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అకౌంట్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) అకౌంట్‌, కిసాన్‌ వికాస్‌ పాత్రా అకౌంట్‌, సుకన్య సమృద్ధి అకౌంట్‌లు ఉన్నాయి. వీటిలో అసలు ఎన్‌ఎస్‌సీ అంటే ఏంటో చూద్దాం...

    నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌(జాతీయ పొదుపు సర్టిఫికెట్‌): ఇండియా పోస్టు అందిస్తున్న సేవింగ్‌ పథకాల్లో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ అకౌంట్‌ కూడా ఒకటి. దీనిలో అకౌంట్‌ కలిగిన వ్యక్తి ఐదేళ్ల కాలానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా కనీసం రూ.1000లను జమ చేయవచ్చు. అంతేగాక దీనిలో రూ.100 చొప్పున కూడా జమచేసే సౌకర్యం కూడా ఉంది. ఇంకా ఈ ఎన్‌ఎస్‌సీ పథకం 7.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ అసలుతో కలిపి చక్రగతిన ఏటా పెరుగుతుంది. పథకం మెచ్యూరిటీకి చేరుకున్నప్పుడు మొత్తాన్ని చెల్లిస్తారు. అంతేగాక ఆదాయపు పన్ను చట్టంలోని సెక‌్షన్‌ 80 సి ప్రకారం.. ఎన్‌ఎస్‌సీ అకౌంట్‌ కలిగిన వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక ఈ సర్టిఫికెట్‌ అకౌంట్‌ను వయోజనులు ఎవరైనా తమ పేరు మీద తీసుకోవచ్చు. ఇంకా తమ పిల్లలు మైనర్‌లు అయితే వారి పేరు మీద తల్లిదండ్రులు గానీ ఇంట్లో పెద్దవారు తీసుకోవచ్చు. ఇక ఈ సర్టిపికెట్‌ను ఇతరులకు కూడా బదిలీ చేసుకునే సదుపాయం కూడా ఉంది. You may be interested

ఎం అండ్‌ ఎం చేతికి ఫిప్త్‌గేర్‌ వెంచర్స్‌

Saturday 18th January 2020

న్యూఢిల్లీ: మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ(ఎం అండ్‌ ఎం)  ఈ-కామ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫిప్త్‌ గేర్‌ వెంచర్స్‌(ఎఫ్‌జీవీఎల్‌)ను కొనుగోలు చేయనుంది. మహీంద్ర కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన  మహీంద్ర ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌ లిమిటెడ్‌(ఎంఎఫ్‌సీడబ్ల్యూఎల్‌) ఫిప్త్‌గేర్‌ వెంచర్స్‌ను రూ.30.45 కోట్లవరకు కొనుగోలు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. డిజిటల్‌ ఆటోమోటివ్స్‌ను మరింత విస్తరించేందుకు ఎఫ్‌జీవీఎల్‌ను సొంతం చేసుకుంటున్నట్లుగా మహీంద్ర మహీంద్ర కంపెనీ  వెల్లడించింది.  ఇప్పటికే ఫిప్త్‌ గేర్‌ వెంచర్స్‌ను పూర్తిస్థాయిలో

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలివే..!

Saturday 18th January 2020

అంచనాలకు తగ్గట్టే ఫలితాలు ఉండొచ్చు అటో, వ్యసాయ రంగ సిప్లేజ్‌లు కీలకం అంటున్న బ్రోకరేజ్‌లు దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు క్యూ3 ఫలితాలను పలు బ్రోకరేజ్ సంస్థలు తమ అంచనాలను వెలువరించాయి. కార్పోరేట్‌ కంపెనీలపై పన్ను తగ్గింపు కలిసొచ్చే అవకాశంగా ఉన్నందున ఈ క్యూ3లో వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 20శాతం

Most from this category