News


మల్టీబ్యాగర్‌ను గుర్తించడం కాదు.. కలసి నడవాలి..!

Wednesday 5th February 2020
personal-finance_main1580841945.png-31508

ఒక స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా గుర్తించడంతోనే సక్సెస్‌ రాదని, అది మల్టీ బ్యాగర్‌ రాబడులు ఇచ్చేంత వరకు.. అవసరమైతే సుదీర్ఘకాలం పాటు ఆ స్టాక్‌లో పెట్టుబడులను కొనసాగించడం ముఖ్యమని పేర్కొన్నారు యూటీఏ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ వెట్రి సుబ్రమణియన్‌. లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మధ్య అంతరం, మల్టీబ్యాగర్‌ విషయాలపై తన అనుభవాలను ఆయన ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.

 

స్మాల్‌క్యాప్‌ వర్సెస్‌ లార్జ్‌క్యాప్‌
‘‘గత 20 ఏళ్ల డేటాను గమనించినట్టయితే లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్స్‌ అత్యంత కనిష్ట స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నాయి. 2018 జనవరి నాటికి అంతక్రితం ఐదు సంవత్సరాల కాలంలో నిఫ్టీతో పోలిస్తే మిడ్‌క్యాప్‌ సూచీ వార్షికంగా 8 శాతం మేర అధిక రాబడులను ఇచ్చింది. ఇది ఎంతో అసాధారణమైనది. అది రివర్స్‌గేర్‌లోకి వెళ్లడాన్ని చూశాం. గత రెండేళ్లలో మిడ్‌క్యాప్‌ చాలా ప్రతికూల పనితీరు చూపించింది. దీంతో మిడ్‌క్యాప్‌ వ్యాల్యూషన్లు తిరిగి సంప్రదాయ శ్రేణికి చేరాయి. లార్జ్‌క్యాప్‌ కంటే చౌకగా లభిస్తున్నాయి. మిడ్‌క్యాప్‌లోనూ వైరుధ్యం ఉంది. మరింత స్థిరత్వం, వృద్ధి అవకాశాలతో కూడిన స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌ మాదిరే అధిక వ్యాల్యూషన్లలోనే ఉన్నాయి. ఫండ్‌ మేనేజర్‌గా మేము గత ఆరు నెలల్లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాలకు కేటాయింపులు పెంచాం. చారిత్రకంగా చూస్తే స్మాల్‌క్యాప్‌ విభాగం ఎంతో ఆటుపోట్లతో కూడుకుని ఉంటుంది. మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ విభాగాలను దీర్ఘకాలం పాటు ఇది అధిగమించలేదు. కనుక ఈ విభాగంలో స్టాక్స్‌ ఎంపిక అనేది ఎంతో ముఖ్యమవుతుంది.

 

మల్టీ‍బ్యాగర్‌ ఐడియా..
పెట్టుబడులను నష్టపరిచే స్టాక్స్‌ను మేము ముందుగా గుర్తిస్తాం. దాంతో మా పెట్టుబడుల ప్రక్రియ నుంచి, మా పోర్ట్‌ఫోలియో నుంచి ముందుగా వాటిని తొలగించేస్తాం. దాంతో మంచి క్యాష్‌ ఫ్లో, పెట్టుబడులపై ఆరోగ్యకరమైన రిటర్నులు ఉన్నవే పోర్ట్‌ఫోలియోలో మిగులుతాయి. దాంతో వాటిల్లో మల్టీబ్యాగర్లు అయ్యే వాటిని గుర్తిస్తాం. ముఖ్యమైనది ఏమిటంటే.. సానుకూల, ప్రతికూల సమయాల్లోనూ ఆ స్టాక్‌లో కొనసాగడం అన్నది ఎంతో కీలకమవుతుంది. నా పోర్ట్‌ఫోలియోలోని ప్రతీ మల్టీబ్యాగర్‌ను గమనించినట్టయితే అవి, అన్ని కాలాల్లోనూ పెరుగుతూ పోలేదు. కొన్ని సార్లు ఏడాదిలో 30 శాతం పడిపోయాయి. కొన్ని 20 ఏళ్ల కాలంలో రెండు సార్లు 50 శాతం వరకు క్షీణించినవే. కాకపోతే మల్టీబ్యాగర్‌గా గుర్తించడం కంటే ఆ స్టాక్‌లో కొనసాగడం ద్వారానే మల్టీ‍బ్యాగర్‌ రిటర్నులు అందుకోవడం సాధ్యపడుతుంది’’ అని సుబ్రమణియన్‌ తెలిపారు. You may be interested

అంతలోనే అంత ర్యాలీ..? తర్వాత ఏంటి..?

Wednesday 5th February 2020

స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ రోజు గత శనివారం భారీ నష్టాల తర్వాత.. మంగళవారం భారీ లాభాల వర్షం కురవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి..? ఇంత ర్యాలీ చేసిన తర్వాత తదుపరి సూచీల గమనం ఏంటి? అన్న దానిపై నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...   చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సానుకూలం. మన విదేశీ మారక నిల్వలు త్వరలోనే అర ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటనున్నాయి. మోస్తరు ద్రవ్యోల్బణం

కేజీ బ్లాక్‌ వార్తలా? డివిడెండ్‌పై ఆశలా?

Tuesday 4th February 2020

3 శాతం దూసుకుపోయిన ఆర్‌ఐఎల్‌ షేరు మంగళవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 3 శాతం దూసుకుపోయింది. కేజీ డీ6 బ్లాకులో ఉత్పత్తి ఈ ఏడాది మధ్య నుంచి ఆరంభమవుతుందన్న వార్తలు, ఏప్రిల్‌లోపు భారీ మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించవచ్చన్న ఆశలు.. షేరులో ఉత్సాహం పెంచాయి. కేజీ బేసిన్‌ డీ6లో ఉత్పత్తికి అన్ని సురక్షిత ఏర్పాట్లు చేశామని ఆర్‌ఐఎల్‌- బీపీ జేవీ ప్రకటించింది. మరోవైపు  ఏప్రిల్‌ అనంతరం డివిడెండ్‌ టాక్స్‌ గ్రహీతలు కట్టాల్సిఉంటుందని

Most from this category