News


డిపాజిట్లపై బీమా పెంపు చిన్న బ్యాంకులకు మేలు!

Wednesday 19th February 2020
personal-finance_main1582052121.png-31905

కంపెనీల రుణ ఎగవేతలు, క్రెడిట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ప్రభావితమవుతున్న తరుణంలో.. బ్యాంకు డిపాజిట్లపై బీమాను ఒక్కో డిపాజిట్‌దారునికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు ఇటీవల పెంచడం చిన్న బ్యాంకులకు మేలు చేసేదేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ప్రతిపాదనను బడ్జెట్లో పేర్కొనగా, అనంతరం ఆర్‌బీఐకి చెందిన డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ దీన్ని అమల్లోకి తెస్తున్నట్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్లు భద్రమైనవని తెలిసిందే. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడితే ఒక్కో డిపాజిట్‌దారునికి గరిష్టంగా ఇకపై రూ.5 లక్షలు కచ్చితంగా వెనక్కి వస్తుంది. దీని కారణంగా చిన్న బ్యాంకులు మరిన్ని డిపాజిట్లను ఖాతాదారుల నుంచి ఆకర్షించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

‘‘చిన్న బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తుంటాయి. అయినా ఆయా బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడానికి ప్రజలు సంకోచిస్తుంటారు. ఎందుకంటే వాటి వ్యాపార రిస్క్‌ల గురించి వారికి అంతగా తెలియకపోవడమే. ఇప్పుడు అధిక ఇన్సూరెన్స్‌ కవరేజీ కారణంగా చిన్న బ్యాంకుల డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా మారతాయి’’ అని ప్రైమ్‌ ఇన్వెస్టర్‌ డాట్‌ ఇన్‌ వ్యవస్థాపకులు విద్యా బాల తెలిపారు. ఇదే జరిగితే డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాకపై ప్రభావం పడనుంది. గత డిసెంబర్‌లో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌.. రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ డెట్‌ సెక్యూరిటీల్లో ఎక్స్‌పోజర్‌ను పూర్తిగా మాఫీ చేసేసింది. వొడాఫోన్‌ ఐడియా కంపెనీ డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులను ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సున్నాగా మార్చేయగా, ఇదే బాటలో వొడాఫోన్‌లో ఎక్స్‌పోజర్‌ను యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, నిప్పన్‌ ఇండియా, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మాఫీ చేసేయడం గమనార్హం.

 

అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ అనలిస్టులు మాత్రం దీన్నేమీ ఆందోళనకరమైన అంశంగా పరిగణించడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పెంచిన కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వైపు ఇన్వెస్టర్లు తమ నిధులను మళ్లిస్తారని వారు భావించడం లేదు. ‘‘మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకునేందుకు సముఖంగా ఉంటారు. ఇది (డిపాజిట్‌ బీమా పెంపు) ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందనుకోవడం లేదు. కాకపోతే చిన్న డిపాజిట్‌ దారుల డిపాజిట్లు సురక్షితంగా మారాయి’’ అని వ్యాల్యూ రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌ తెలిపారు. ఇటీవలి కార్పొరేట్‌ కంపెనీల సంక్షోభం కారణంగా ఆయా సంస్థల డెట్‌ సాధనాల్లో ఎక్స్‌పోజర్‌ ప్రభావం చాలా ఫండ్స్‌పై ప్రభావం చూపించగా, ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉత్తమమైన నిర్వహణ విధానాల కారణంగా ఎటువంటి ప్రభావానికి గురికాకపోవడం గమనార్హం.You may be interested

మళ్లీ పేలనున్న సెల్‌బాంబ్‌ ..!

Wednesday 19th February 2020

రూ.300కు చేరనున్న ఏఆర్‌పీయూ  అప్పుడే కంపెనీలకు దండిగా లాభాలు భారీ బకాయిలు కట్టేందుకు తప్పని చార్జీల పెంపు ఇప్పటికే గత డిసెంబర్‌లో 42 శాతం వరకు పెంపు మొబైల్‌ చార్జీలకు మళ్లీ పూర్వపు రోజులు న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్‌ జియోతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో ఇప్పుడు అదే వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి...! కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్‌,

ఈ స్టాక్స్‌పై దేశ, విదేశీ ఇనిస్టిట్యూషన్ల ఆసక్తి..

Wednesday 19th February 2020

దేశీయ ఇనిస్టిట్యూషన్లు (మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా సంస్థలు), విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోళ్లను పరిశీలిస్తే.. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శించినట్టు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. డిసెంబర్‌ త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు 4.88 బిలియన్‌ డాలర్ల మేర మన ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టగా, మన డీఐఐలు 793 మిలియన్‌ డాలర్ల మేర విక్రయాలు జరిపినట్టు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌

Most from this category