News


యాంఫి మార్పుల ప్రభావం ఫండ్స్‌పై ఉంటుందా..?

Monday 13th January 2020
Markets_main1578855164.png-30867

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు) అసోసియేషన్‌ ‘యాంఫి’ సెబీ నిబంధనల మేరకు స్టాక్స్‌ వర్గీకరణ జాబితాను ఇటీవలే ప్రకటించింది.  మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా టాప్‌100 స్టాక్స్‌ను లార్జ్‌క్యా్‌ప్‌ విభాగంలోకి, తదుపరి 150 స్టాక్స్‌ను మిడ్‌క్యాప్‌ విభాగం కింద, ఆ తర్వాత స్టాక్స్‌ను స్మాల్‌క్యాప్‌గా వర్గీకరించడం జరిగింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పనితీరు పోల్చి చూసుకునేందుకు, సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సెబీ 2017 అక్టోబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల వర్గీకరణ, క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంది. తద్వారా ఇన్వెస్టర్లు సరైన పెట్టుబడుల నిర్ణయాలు తీసుకోగలరన్నది సెబీ ఉద్దేశ్యం. 

 

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మార్కెట్‌ విలువ ఆధారంగానే ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. లార్జ్‌క్యాప్‌, లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌, మల్టీక్యాప్‌ ఇలా ఎన్నో రకాల ఫండ్స్‌ ఉన్నాయి. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌గా వర్గీకరణ విధానాన్ని సెబీ నిర్ణయించింది. దీని ఆధారంగా యాంఫి.. సెబీ, స్టాక్‌ ఎక్సేంజ్‌లతో సంప్రదించి ప్రతీ ఆరు నెలలకోసారి స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఇచ్చిన గణాంకాల ఆధారంగా స్టాక్స్‌ను వర్గీకరించాల్సి ఉంటుంది. సెబీ చివరి సారి వర్గీకరణ సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అని వర్గీకరణకు అంతకుముందు ఓ ప్రామాణిక నిర్వచనం ఉండేది కాదు. దాంతో ప్రతీ మ్యూచువల్‌ ఫండ్స్ సంస్థ తనకంటూ ప్రత్యేక ప్రమాణాలను పాటించేది. అందరికీ ఒకటే వర్తించేది కాదు. దీంతో ఇన్వెస్టర్లకు ఫండ్స్‌ పనితీరు పోల్చి చూసుకోవడం కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అన్ని ఫండ్స్‌కూ ఒకటే విధానం అమలవుతోంది.

 

యాంఫి ఈ నెల 3న విడుదల చేసిన నూతన జాబితాలో ఐదు స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌లోకి మారాయి. అవి ఇన్ఫో ఎడ్జ్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఆర్‌ఈసీ, కన్సాయ్‌ నెరోలాక్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌. అదే విధంగా ఐదు స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌ నుంచి మిడ్‌క్యాప్‌లోకి వెళ్లిపోయాయి. అవి క్యాడిలా హెల్త్‌కేర్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌, వొడాఫోన్‌ ఐడియా, యస్‌ బ్యాంకు. 12 స్టాక్స్‌ స్మాల్‌ క్యాప్‌ నుంచి మిడ్‌క్యాప్‌లోకి వెళ్లగా, అంతే సంఖ్యలో మిడ్‌క్యాప్‌ నుంచి స్మాల్‌క్యాప్‌లోకి వెళ్లాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో కొత్తగా చేరిన స్టాక్స్‌ ఐఆర్‌సీటీసీ, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌. అదే విధంగా స్మాల్‌క్యాప్‌ విభాగంలోకి కొత్తగా నాలుగు చేరాయి. ‘‘ఈ ప్రతిపాదన అమలైతే లార్జ్‌క్యాప్‌నకు కటాఫ్‌గా ప్రస్తుతమున్న రూ.22,000 కోట్ల మార్కెట్‌ విలువ కాస్తా రూ.16,000 కోట్లకు తగ్గుతుంది. అదే విధంగా మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు రూ.11,000 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు తగ్గుతుంది’’ అని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈక్విటీస్‌ హెడ్‌ అనూప్‌ భాస్కర్‌ తెలిపారు. దీంతో మరోసారి రంగాలవారీ స్కీమ్‌ పోర్ట్‌ఫోలియోలలో మార్పులు అవసరం అవుతాయని, ఈ చార్జీలను ఎన్‌ఏవీ రూపంలో ఇన్వెస్టర్లే భరించాల్సి ఉంటుందన్నారు. 



You may be interested

టాప్‌-10 కంపెనీలకు లాభాల పండగే.!!

Monday 13th January 2020

మార్కెట్‌ విలువ పరంగా దేశంలోని మొదటి పది పెద్ద కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి లాభాల్లో 23 శాతానికి పైగా సగటు వృద్ధిని చూపించొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గడం, ఆర్థిక సేవల రంగం కాస్త తెరిపిన పడడం వంటి వాటిని ఇందుకు ఆధారంగా పేర్కొంటున్నారు. క్రితం ఏడాది ఇదే కాలంలో (2018 డిసెంబర్‌ త్రైమాసికం) ఈ కంపెనీల లాభాల్లో వృద్ధి సగటున 14 శాతంగానే ఉండడం

ఈ కంపెనీల క్యూ3 ఫలితాలపై కన్నేయండి..!

Saturday 11th January 2020

ఇన్ఫోసిస్‌ శుక్రవారం క్యూ3 ఫలితాలను ప్రకటన అనంతరం దేశీయ కార్పోరేట్‌ కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాల విడుదలకు సన్నద్దమయ్యాయి. ఇప్పటికే విశ్లేషకులు వివిధ కంపెనీల మూడో కార్వర్ట్‌ పనితీరుపై తమ అంచనాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోతీలాల్‌ ఓస్వాల్‌, కోటక్‌ ఇన్ట్సిట్యూషనల్ ఈక్విటీస్ బ్రోకరేజ్‌ సంస్థలు 10 కంపెనీల క్యూ3 పనితీరుపై తన అంచనాలను వెల్లడించింది.  1.బ్లూస్టార్‌ కంపెనీ:-  వార్షిక ప్రాతిపాదికన కంపెనీ నికర లాభం 600శాతం వృద్ధి సాధించి

Most from this category