ఎంఎఫ్ పెట్టుబడులు ఎప్పుడు వెనక్కు తీసుకోవాలి!
By D Sayee Pramodh

ధీరేంద్ర కుమార్ సూచనలు
మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ల కోసం బోలెడు పథకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు నెట్ నిండా పలు సైట్ల సిఫార్సులు, పలువురు నిపుణుల సలహాలు హోరెత్తిస్తుంటాయి. అందువల్ల ఎంఎఫ్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆలోచించాల్సిన పని రిటైలర్‌కు రాదు. ఉన్నవాటిలో నాణ్యమైన పథకాన్ని, నాణ్యమైన నిపుణుడి సలహాను ఎంచుకొంటే సగం పనైపోతుంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య వస్తుంది. ప్రతిఒక్కరు ఏది కొనాలి? ఎప్పుడు కొనాలి? ఎందుకు కొనాలి? అని చెప్పేవాళ్లే కానీ, సరైన సమయంలో ఎప్పుడు సదరు పథకం నుంచి ఎగ్జిట్ కావాలి? అని చెప్పేవాళ్లు కనిపించరు. కరెక్ట్ సమయంలో ఎంఎఫ్‌ల నుంచి ఎగ్జిట్ కాలేక పలువురు రిటైలర్లు నష్టపోవడం కనిపిస్తుంటుంది. అందువల్ల ఏ సమయంలో, ఏ ఫండ్‌ను, ఏ ధర వద్ద విక్రయించాలనేది చాలా కీలకమైన విషయంగా చెప్పవచ్చు.
సాధారణంగా ఎంఎఫ్‌ల నుంచి ఎగ్జిటయ్యేందుకు మూడు కారణాలు చెబుతారు.
సాకులు వద్దు..
లాభాలు వచ్చాయి.. ఇక చాలు లేదా నష్టాలు పెరిగాయి.. ఇంకొద్దు లేదా ఎన్నాళ్లైనా స్తబ్దుగానే ఉంటోంది.. బయటకు వచ్చేద్దాం.. అనే మూడు కారణాలను ఫండ్స్ విక్రయించే ఇన్వెస్టర్లు తరచు చెబుతుంటారు. ఇవన్నీ సాకులే తప్ప నిజమైన కారణాలు కావు. ఒక ఫండ్ నుంచి వైదొలిగేందుకు ఇవి కారణం కారాదు. లాభాల స్వీకరణ అనే సాకుతో అమ్ముకునే వాళ్లు తమ విన్నర్స్‌ను వదిలించుకొని లూజర్స్‌ను అట్టిపెట్టుకోవడం జరుగుతుంది. ఒక ఫండ్ లాభాల్లో ఉందంటే ఆ ఫండ్ మేనేజర్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడని అర్దం. అలాంటప్పుడు దాన్ని అమ్ముకోవడం అనవసరం. నష్టాల్లో ఉంది అమ్మేసుకుందాం అనుకునేవాళ్లు ముందుగా సదరు ఫండ్ కొని ఎన్నాళ్లైంది? ఎంత లాస్ వచ్చింది? లెక్కించాలి. కొన్నిసార్లు ఇతర ఫండ్స్‌తో పోలిస్తే తక్కువ రాబడినిచ్చే ఫండ్స్‌ను అమ్ముకోవడం జరుగుతుంటుంది. ఇది అనవసరైమన చర్య. ఏ ఫండ్‌కు ఆ ఫండ్ ప్రత్యేకమైనవిగా తెలుసుకోవాలి. ఇలా పక్క ఫండ్స్‌కు స్విచ్ అవుతూ పోతుంటే రిటర్న్స్ క్రమంగా తగ్గుతాయి. వరుసగా రెండు మూడేళ్లు ఒక ఫండ్ పేలవ ప్రదర్శన జరిపితే అప్పుడు అమ్ముకోవాలి, తప్ప ఏడాది, ఆరు నెలల పరిమితిలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇదే సూత్రం స్తబ్దుగా ఉన్న ఫండ్స్‌కు కూడా వర్తిస్తుంది.
రైట్‌టైమ్?
మరి ఒక ఫండ్‌నుంచి బయటకు రావడానికి సరైన సమయం ఏది? అంటే ఒక్కటే సమాధానం. మీ ఆర్థిక లక్ష్యం నెరవేరిన రోజు వైదలగాలి. ఒక పెట్టుబడికి ముందు మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు కదా, అది పూర్తయ్యేవరకు కొంత సహనంతో వేచిచూడడం మంచిది. దీంతో పాటు మీకు అత్యవసరమైన అక్కర వస్తే అప్పుడు తప్పకుండా అమ్మేసుకోవచ్చు. అంతే తప్ప ఎలాంటి ఆర్థిక అవసరం లేకున్నా ఊరికే పైన చెప్పిన సాకులను చెబుతూ ఫండ్స్‌ను విక్రయించాల్సిన అవసరం లేదు. సిప్కైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక ఫండ్ 10- 15ఏళ్లు కొనసాగిస్తే వచ్చే రాబడి మీ అంచనాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలిక లక్ష్యంతో పెట్టిన పెట్టుబడులను ఊరికే కదిలించడం మంచిదికాదు. నిజమైన అవసరం లేకుంటే లాంగ్‌టర్మ్‌కు ఫండ్స్‌ను కొనసాగించడమే ఉత్తమం.
You may be interested
6శాతం పెరిగిన భారతీ ఎయిర్టెల్
Monday 25th November 2019గతవారంలో వరుస మూడు ట్రేడింగ్ సెషన్లో నష్టాలను చవిచూసిన భారతీ ఎయిర్టెల్ షేరు ఈ వారం మొదటిరోజే లాభాల బాట పట్టింది. బీఎస్ఈలో సోమవారం ఈ కంపెనీ షేరు రూ.421.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెల్కోల రాబడి (ఏజీఆర్)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌తో పాటు వోడాఫోన్ కంపెనీ శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. మరోవైపు సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేరుకు రేటింగ్ అప్‌గ్రేడ్ చేయడంతో
బంగారం దిగుమతులు తగ్గుముఖం
Monday 25th November 2019ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో 9 శాతం క్షీణత దేశీయ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) పై ప్రభావం చూపే బంగారం దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ కాలంలో 9 శాతం తగ్గాయి. సమీక్షిస్తున్న కాలంలో భారత్ 17.63 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. మన కరెన్సీలో ఇది రూ.1.25 లక్షల కోట్లు. క్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న 19.4 బిలియన్ డాలర్లతో పోలిస్తే తొమ్మిది శాతం