News


ఫండ్‌ స్టేట్‌మెంట్‌లో ఏం చూడాలి..?

Sunday 16th June 2019
personal-finance_main1560707798.png-26328

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు తమకు ఫండ్‌ హౌస్‌ (ఏఎంసీ) నుంచి వచ్చే స్టేట్‌మెంట్‌ను తప్పకుండా పరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. ఇది కూడా బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ మాదిరే. మీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు సంబంధించి పూర్తి సారాంశమే స్టేట్‌మెంట్‌. ఫండ్స్‌ సంస్థ ఏదైనప్పటికీ, అందులోని కీలక అంశాలు అన్నింటిలోనూ తప్పకుండా ఉండాల్సిందే. 

 

  • ముఖ్యంగా ఫోలియో నంబర్‌ ఒకటి. ఇది మీ పెట్టుబడులకు రిఫరెన్స్‌ నంబర్‌. సంబంధిత అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పథకంలో ఇన్వెస్ట్‌ చేసే ప్రతీసారి ఫోలియో నంబర్‌ అదే ఉంటుంది. ఆ పథకంలో మీ పెట్టుబడులు అన్నింటినీ ట్రాక్‌ చేయడం దీని సాయంతో సులభం అవుతుంది. అలా కాకుండా అదే ఫోలియో నంబర్‌ను ప్రతీ అదనపు పెట్టుబడికి వినియోగంచకపోతే ఫోలియో నంబర్లు ఎక్కువై, ట్రాకింగ్‌ క్లిష్టంగా మారుతుంది. 
  • ఇక ఫండ్స్‌ స్టేట్‌మెంట్‌లో బ్యాంకు పేరు, అకౌంట్‌ నంబర్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో కూడా చెక్‌ చేసుకోవాలి. దీనివల్ల ఉపసంహరణ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. 
  • ఇక కేవైసీ కాంప్లియంట్‌ అవునా కాదా, ఫాక్టా డిక్లరేషన్‌ ఇచ్చారా అన్నది కూడా సరిచూసుకోవాలి. ఫాక్టా అన్నది అమెరికా చట్టం. అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం ప్రకారం భారత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు అమెరికా పౌరులా, కాదా అన్నది ధ్రువీకరించాల్సి ఉంటుంది. 
  • ఏజెంట్‌  ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తుంటే, సంబంధిత ఏజెంట్‌ కోడ్‌, ఈయూఐఎన్‌ నంబర్‌ వివరాలు కూడా స్టేట్‌మెంట్‌లో కనిపిస్తాయి. 
  • ట్రాన్సాక్షన్‌ సమ్మరీలో అన్ని రకాల లావాదేవీల వివరాలు (సంబంధిత స్టేట్‌మెంట్‌ పీరియడ్‌లో) ఉంటాయి. సిప్‌లు, ఎస్‌డబ్ల్యూపీలు, లంప్‌సమ్‌ పెట్టుబడుల వివరాలు చూసుకోవచ్చు. 
  • లోడ్‌ స్ట్రక్చర్‌ వివరాలు కూడా ఉంటాయి. అంటే ఎంట్రీ లేదా ఎగ్జిట్‌ చార్జీల వివరాలను ఇందులో చూసుకోవచ్చు
  • ప్రతీ పథకంలో ఇన్వెస్ట్‌ చేసిన తర్వాతి రెండు మూడు రోజుల్లో ఏఎంసీ స్టేట్‌మెంట్‌ను జారీ చేస్తుంది. అంటే మూడు నుంచి నాలుగు రోజుల్లో ఈమెయిల్‌కు, ఫిజికల్‌ కాపీ ఎంచుకుంటే ఏడు నుంచి పది రోజుల్లోపు స్టేట్‌మెంట్‌ ఇన్వెస్టర్‌కు అందుబాటులోకి వస్తుంది. ఇందులో వివరాలు ఏవైనా తప్పు అని గుర్తిస్తే వెంటనే ఏఎంసీ దృష్టికి తీసుకెళ్లాలి. You may be interested

పడినప్పుడు కొనుగోలు చేయడం: నర్నోలియా

Sunday 16th June 2019

నిఫ్టీ గత వారం 12,000-11,800 శ్రేణిలో ట్రేడవడంతోపాటు బార్‌ టైప్‌ క్యాండిల్‌ స్టిక్‌ ప్యాటర్న్‌ నమోదు చేసిందని, దీని ప్రకారం నిఫ్టీ దిగువ వైపున 11,770 స్థాయిని బ్రేక్‌ చేయకపోవచ్చని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ షబ్బీర్‌ ఖయ్యూమి తెలిపారు. 12,100పైన నిఫ్టీ క్లోజ్‌ అయితే తదుపరి 12,500 వరకు లక్ష్యంగా పేర్కొన్నారు. నిఫ్టీ 50డీఎంఏ 11,680 స్థాయిల పైన ట్రేడవుతోందని, మధ్యకాలానికి బలమైన

పదేళ్ల తర్వాత లాభాల్లోకి మొబిక్విక్‌!

Sunday 16th June 2019

పేటీఎం మాదిరే మొబైల్‌ రీచార్జ్‌ సేవలతో ఆరంభించి, ఆ తర్వాత పేమెంట్‌ సేవలు, బీమా, ఫండ్స్‌ ఉత్పత్తులను విక్రయించే రూపంలోకి పరిణామం చెందిన మొబిక్విక్‌ సంస్థ, 2009లో కార్యకలాపాలు ఆరంభించగా, 2019 మార్చి త్రైమాసికం ఫలితాలతో తొలిసారి లాభాలను ప్రకటించోబోతోంది. అలాగే, 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా లాభాల ప్రయాణం చేయనుంది. త్వరలో ఐపీవోకి రావవాలనుకుంటున్న ఈ సంస్థ దాని కంటే ముందుగా మొబిక్విక్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు

Most from this category