News


ఫండ్స్‌ కొన్న షేర్లివే!

Wednesday 13th November 2019
personal-finance_main1573639756.png-29560

దేశీయ స్టాక్‌ ఫండ్లలోకి నిధుల ప్రవాహం వరుసగా రెండో నెల తగ్గుముఖం పట్టింది.  యాంఫీ గణాంకాలు ప్రకారం ఈ అక్టోబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.60.2 బిలియన్ల నిధులు వచ్చాయి. సెప్టెంబర్‌లో వచ్చిన నిధులతో పోలిస్తే ఇది 9శాతం తక్కువ. అలాగే మే తరువాత అతి తక్కువగా నిధుల వచ్చిన నెల అక్టోబరే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలో టాప్‌-3 మ్యూచువల్‌ ఫండ్‌  హౌసింగ్‌లు ఏ షేర్లకు కొన్నాయా, వేటిని విక్రయించాయో ఇప్పుడు తెలుసుకుందాం...
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌:- 
దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్‌ ఫండింగ్‌ హౌస్‌ ఈ అక్టోబర్‌లో గ్రీన్‌ప్యానెల్‌ ఇండస్ట్రీస్‌, గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌, ఏపిల్‌ అపోలో ట్యూబ్స్‌ కంపెనీల్లో కొత్తగా షేర్లను కొనుగోలు చేసింది. గోద్రేజ్‌ కన్జూ‍్యమర్, సన్‌ టీవీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ కంపెనీల నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఇదే నెలలో ఐటీసీ, ఎన్‌హెచ్‌పీసీ, స్టేట్‌ బ్యాంక్‌ షేర్లలో వాటాను పెంచుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, వేదాంత లిమిటెడ్‌ షేర్లలో వాటాను తగ్గించుకుంది. 
ఐసీఐసీఐ ‍ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌:- 
రెండో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండింగ్‌ హౌస్‌గా పిలువబడుతుంది. సోమని హోమ్‌ ఇన్నోవేషన్స్‌, ప్రుడెన్షియల్‌ ఐసీఐసీఐ టెక్నాలజీస్‌ ఫండ్‌, ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ కంపెనీ షేర్లను కొత్తగా కొనుగోలు చేసింది.  గృహ్‌ ఫైనాన్స్ షేర్లను తొలగించుకుంది. అలాగే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌, ఇన్ఫోసిస్‌, నాల్కో కంపెనీల్లో వాటాను పెంచుకుంది. శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ షేర్లలో వాటాను తగ్గించుకుంది. 
ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌:- 
శ్రేనో, భారత్‌ 22 ఈటీఎఫ్‌, ఐఆర్‌సీటీసీ కంపెనీల్లో షేర్లను కొత్తగా కొనుగోలు చేయగా, గృహ్‌ ఫైనాన్స్‌, శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, ఐటీడీ సిమెంటేషన్స్‌ కంపెనీల షేర్ల నుంచి ఎగ్జిట్ అయ్యింది. భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌, ఎస్‌బీఐ, గెయిల్‌ షేర్లలో వాటాను పెంచుకోగా, వోడాఫోన్‌, ఐటీసీ, అశోక్‌ లేలాండ్‌ కంపెనీల్లో వాటాను తగ్గించుకుంది. 



You may be interested

11850 దిగువన ముగిసిన నిఫ్టీ

Wednesday 13th November 2019

మిడ్‌సెషన్‌ నుంచి బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అనూహ్య అమ్మకాలతో మార్కెట్‌ బుధవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 229 పాయింట్లు కోల్పోయి 40,116 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 11850 దిగువున 11,840 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 574 పాయింట్లు నష్టపోయి 30,541 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌

క్యూ3లో ఆర్థికవ్యవస్థ బాటమ్‌ఔట్‌: సీఎల్‌ఎస్‌ఏ

Wednesday 13th November 2019

ఆర్థిక వ్యవస్థ డిసెంబర్‌ త్రైమాసికంలో బాటమ్‌ ఔట్‌ అవుతుందని, అటుతర్వాత వీ-ఆకారపు రికవరీ వుండకపోవొచ్చని సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, స్ట్రాటజిస్ట్‌, మహేష్‌ నందుర్కర్‌ అన్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధానాలను సరళతరం చేయడంతో లిక్విడిటీ లభ్యత పెరిగిందని, అదేవిధంగా రుణాలను అధికంగా ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడం, వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, బ్యాంకులకు ప్రభుత్వం మూలధనాన్ని సమకూర్చడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరికి తోడ్పాటునందిస్తున్నాయని అన్నారు. వీటితో పాటు తక్కువ బేస్‌ ఉండడం కూడా

Most from this category