News


టాప్‌ ఫండ్స్‌ మార్చిలో ఏం చేశాయ్‌?

Saturday 13th April 2019
personal-finance_main1555147298.png-25116

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం మార్చిలో ఐదు నెలల గరిష్ఠాన్ని చేరింది. అక్టోబర్‌ తర్వాత తిరిగి మార్చిలో ఫండ్స్‌ భారీగా కొనుగోళ్లను చేపట్టాయి. ఈ నేపథ్యంలో గత నెల టాప్‌ 5 ఎంఎఫ్‌లు వేటిని కొని, వేటిని విక్రయించాయో చూద్దాం..
1. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌: ఈ ఫండ్‌ నిర్వహణలో 1.5 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎక్కువగా ఫైనాన్షియల్స్‌(33 శాతం), యుటిలిటీస్‌, ఇండస్ట్రీస్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.

మార్చిలో బీఓబీ, భెల్‌, ఓబీసీల్లో వాటాలను పెంచుకుంది. పవర్‌గ్రిడ్‌, ఐడీఎఫ్‌సీ, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ కంపెనీల్లో వాటాలు తగ్గించుకుంది. ఎంబసీ పార్క్‌ రైట్స్‌, నాల్కోల్లో కొత్తగా కొనుగోళ్లు చేసింది. విజయాబ్యాంక్‌, స్పెన్సర్‌, మాట్రిమోనీ డాట్‌కామ్‌లో పూర్తిగా వాటాలు వదిలించుకుంది.
2. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌: ఈ ఫండ్‌ నిర్వహణలో దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఎక్కువగా ఫైనాన్షియల్స్‌(27 శాతం), మెటీరియల్స్‌, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.

మార్చిలో వొడాఫోన్‌ ఐడియా, ఎన్‌బీసీసీ, ఎస్‌బీఐ లైఫ్‌ల్లో వాటాలు పెంచుకుంది. భెల్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌ల్లో వాటాలు తగ్గించుకుంది.  సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, ఇండియా ఇన్‌ఫ్రా ట్రస్ట్‌, ఎంబసీ పార్క్‌ రైట్స్‌ల్లో వాటాలు కొత్తగా కొనుగోలు చేసింది. విజయాబ్యాంక్‌లో వాటాలు పూర్తిగా విక్రయించింది.
3. ఎస్‌బీఐ ఫండ్‌: ఫండ్‌ ఆధ్వర్యంలో రూ. 1.6 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఎక్కువగా ఫైనాన్షియల్స్‌(36 శాతం), అఽస్సెట్స్‌, టెక్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది.

మార్చిలో వొడాఫోన్‌ ఐడియా, టాటాపవర్‌, ఐసీఐసీఐ ప్రు లైఫ్‌ ఇన్సూ‍్యరెన్స్‌ల్లో వాటాలు పెంచుకుంది. నాల్కో, ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌లో వాటాలు తగ్గించుకుంది. కొత్తగా ఎండురెన్స్‌ టెక్‌, గుజరాత్‌ పిప్‌వావ్‌, బజాజ్‌ఆటో షేర్లను కొనుగోలు చేసింది. అర్వింద్‌, టొరెంట్‌ పవర్‌లో వాటాలు వదిలించుకుంది. 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన పసిడి

Saturday 13th April 2019

డాలరు స్థిరమైన ర్యాలీతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం పాజిటివ్‌గా ముగిసింది. రాత్రి అమెరికాలో ఔన్స్‌ పసిడి ధర 1.90 డాలరు స్వల్పంగా లాభపడి 1,295.20 డాలర్ల వద్ద స్థిరపడింది. అయితే ఈ వారంలో మొత్తం మీద చూస్తే పసిడి ఫ్లాట్‌(0.02శాతం) గానే ముగిసింది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో 0.23శాత క్షీణించి  96.58 స్థాయి వద్ద స్థిరపడింది. అలాగే 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్‌

పతనం పొంచి ఉంది!

Saturday 13th April 2019

కానీ భారీగా ఉండదు నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు ఈ వారం పోటాపోటీ దశలోకి చేరాయి. అటు బుల్స్‌, ఇటు బేర్స్‌ సమానంగా పోరాటం జరపడంతో సూచీల్లో ఎవరికీ పట్టు చిక్కలేదు. అయితే నిజానికి టెక్నికల్‌గా ఇది కరెక‌్షన్‌ దశని నిపుణులు చెబుతున్నారు. 10600- 11800 పాయింట్ల వరకు అలుపు లేకుండా ర్యాలీ జరిపిన సూచీలు పతనం మూడ్‌లోకి జారాయి. ఇలాంటి పతనాలు గతంలో దాదాపు నెల రోజులపాటు కొనసాగాయి. అందువల్ల తాజా

Most from this category