STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ర్యాలీ... నిలుస్తుందా..?

Friday 19th July 2019
personal-finance_main1563559620.png-27192

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూపులో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ శుక్రవారం జీవితకాల నూతన గరిష్ట స్థాయి రూ.2,370ను నమోదు చేసింది. 7 శాతం లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండడంతో గత నాలుగు రోజుల్లోనే ఈ షేర్‌ 20 శాతానికి పైగా పెరిగింది. కానీ, గత అక్టోబర్‌లో రూ.1248 కనిష్ట ధర నుంచి చూసుకుంటే 85 శాతం లాభం ఇచ్చింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ స్థాయి రాబడులు ఇచ్చి శభాష్‌ స్టాక్‌గా నిలిచింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారి ముందున్న ప్రశ్న... ఈ స్టాక్‌ త్వరలో రూ.3,000ను చేరుతుందా ఇంకాస్త ర్యాలీ చేసి రూ.4,000ను చేరుతుందా..? 

 

నిజానికి హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసుకోతగిన స్టాకే అయినప్పటికీ, ప్రస్తుత ర్యాలీ కొనసాగడం కష్టమేనంటున్నారు నిపుణులు. దీనిపై శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తన విశ్లేషణ తెలియజేశారు. ‘‘ఇక్కడ స్పష్టమైన ట్రెండ్‌ ఏమీ లేదు. కానీ, అవకాశాలను గుర్తించేందుకు మంచి మార్గం ఏమిటంటే ఆయా రంగాలను విశ్లేషించడమే. సెబీ ఆదేశాల మేరకు ఏఎంసీలు అప్‌ఫ్రంట్‌ కమీషన్లను తగ్గించుకోవాల్సి ఉంది. కనుక ఏఎంసీ కంపెనీలు రిపోర్ట్‌ చేస్తున్న వ్యయాలు తగ్గనున్నాయి. దాంతో లాభాలు పెరుగుతాయి. వచ్చే సెప్టెంబర్‌ వరకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కూడా వచ్చే మూడు నాలుగు నెలల్లో అప్‌ఫ్రంట్‌ కమీషన్లను తగ్గించుకోనుంది. ప్రస్తుతం స్టాక్‌ వ్యాల్యూషన్లు గొప్పగానే ఉన్నాయి. కానీ, ఇవి కొనసాగవు. వృద్ధి తగ్గుముఖం పడుతుంది. రెండు క్వార్టర్లలో ఇది జరుగుతుంది. దాంతో పీఈ మల్టిపుల్‌ అన్నది రీరేటింగ్‌ అవుతుంది. ఒక్కసారి ఈ షేరు ధర తగ్గిన తర్వాత అప్పుడు మంచి విలువను ఆఫర్‌ చేయగలదు’’ అని ఉమేష్‌ మెహతా తెలిపారు. You may be interested

ఎఫ్‌ఐఐలు అమ్ముతుంటే మనకు కొనే అవకాశం: భాసిత్‌

Friday 19th July 2019

రానున్న 10-12 వారాల సమయం పెట్టుబడులకు మంచి అనువైనదని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌ పథకాల్లో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. మార్కెట్లో భయం అతిగా ఉందని, ఎఫ్‌ఐఐలు పన్ను భారం కారణంగా వెళ్లిపోతున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రతికూల వాతావరణం అక్టోబర్‌ మధ్య వరకే ఉంటుందన్నారు. ఆ తర్వాత నుంచి మన మార్కెట్లు

రెండు నెలల కనిష్టానికి సూచీల పతనం

Friday 19th July 2019

  560 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 177 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ  దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం ఆర్థిక సంవత్సరపు రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల సునామితో  సెన్సెక్స్‌ 560.45 పాయింట్లు నష్టపోయి 38,337 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు క్షీణించి 11,419.25 వద్ద స్థిరపడ్డాయి. ఈ సూచీలకు ఇది రెండునెలల గరిష్టస్థాయి అత్యధికంగా అటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంకింగ్‌ రంగ

Most from this category