STOCKS

News


వేరే ఫండ్‌కు మారిపోవాలా ?

Monday 10th February 2020
personal-finance_main1581308797.png-31643

(ధీరేంద్ర కుమార్‌ వాల్యూ రీసెర్చ్‌ సీఈవో)

ప్ర: ఒక కంపెనీ(యాక్సిస్‌) మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర కంపెనీల మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే మంచి రాబడులనిస్తున్నాయి. ఒకే కేటగిరీ అని కాకుండా అన్ని కేటగిరీల ఫండ్స్‌ విషయంలో కూడా ఈ కంపెనీ పనితీరు బాగా ఉంది. దీనికేమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా ?
-సూరిబాబు, విశాఖపట్టణం 
జ: సదరు కంపెనీ అనుసరిస్తున్న పెట్టుబడుల వ్యూహం మంచి ఫలితాలనిస్తున్నందువల్ల ఆ కంపెనీ ఫండ్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయని చెప్పవచ్చు. ఒక్కో కంపెనీకి ఒక్కో విధమైన పెట్టుబడుల వ్యూహం ఉంటుంది. కంపెనీల వ్యూహాలు వేర్వురుగా, విభిన్నంగా ఉంటాయి. అయితే వేర్వేరు వ్యూహాలు వేర్వేరు కాలాల్లో మంచి ఫలితాలనిస్తాయి. రెండేళ్ల క్రితం చూస్తే, మీరు చెప్పిన కంపెనీ ఫండ్స్‌ కాకుండా వేరే కంపెనీ ఫండ్స్‌ మంచి రాబడులనిచ్చాయి.  అంటే ఆ కాలంలో ఆ ఫండ్‌ మేనేజర్‌ వ్యూహం మంచి ఫలితాలనిచ్చిందన్నమాట.  ఇప్పుడు మీరు పేర్కొన్న కంపెనీ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, అత్యున్నత నాణ్యత గల కంపెనీలపైననే సదరు ఫండ్‌ సంస్థ, దృష్టి పెడుతోంది. మార్కెట్‌ పతనబాటలో ఉన్నప్పుడు ఈ ఫండ్స్‌ పనితీరు క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పనితీరు బాగా లేదని ఈ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ పక్కన బెట్టిన కంపెనీలు పుంజుకోవచ్చు. అందుకని వేర్వేరు çసమయాల్లో వేర్వేరు పరిస్థితులు, వ్యూహాలు  ఉంటాయి. మొత్తం మీద సదరు ఫండ్‌ సంస్థ మ్యూచువల్‌ ఫండ్స్‌ పనితీరు బాగా ఉంది. మార్కెట్‌ బాగా పెరుగుతున్నా, బాగా పతనమవుతూ ఉన్నా, తమ పెట్టుబడి వ్యూహాలకే ఈ సంస్థ కట్టుబడి ఉంది. కొన్ని సమయాల్లో ఈ వ్యూహం మంచి ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ, ఈ వ్యూహానికే కట్టుబడి ఉంది. అందుకే ఇప్పుడు ఈ స్థాయి రాబడులను ఈ ఫండ్స్‌ రాబడుతున్నాయి. 


ప్ర: గత రెండేళ్ల నుంచి ఫ్రాంక్లిన్‌  ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇతర ఫండ్స్‌తో పోల్చితే ఈ ఫండ్‌ రాబడులు ఏమంత సంతృప్తికరంగా లేవు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? లేక వేరే ఫండ్‌కు మారిపోమ్మంటారా ? 
-సౌదామిని, హైదరాబాద్‌ 
జ: మీరు ఈ ఫండ్‌లో కొనసాగవచ్చు. సాధారణంగా ఫ్రాంక్లిన్‌ ఫండ్స్‌ నాణ్యత పరంగా ఉన్నత స్థాయిలోనే ఉంటాయి. స్మాల్‌ క్యాప్‌ కంపెనీలకు సంబంధించి కొన్ని కంపెనీలు ఒక్కోసారి బ్లాక్‌బస్టర్‌ షేర్‌గా అవతరిస్తాయి. అది ఎప్పుడనేది తెలుసుకోవడం కష్టసాధ్యమైన విషయం. సాధారణంగా గత కొంత కాలంగా స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకనే ఇతర కేటగిరీ ఫండ్స్‌తో పోల్చితే స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ రాబడులు ఓ మోస్తరుగానే  ఉన్నాయి. ఇక ›ఫ్రాంక్లిన్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ విషయానికొస్తే, ఇది మంచి నాణ్యత గల ఫండే కాబట్టి, మీరు ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిరభ్యంతరంగా కొనసాగించొచ్చు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు  కేవలం రెండేళ్ల ఫండ్‌ పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో మంచి రాబదులు పొందాలంటే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

 

ప్ర: నేను మరో పదేళ్లలో రిటైరవ్వబోతున్నాను. రిటైర్మెంట్‌ తర్వాతి అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాకు సరైన పెట్టుబడి వ్యూహాన్ని సూచించండి. 
-మహ్మద్‌ గౌస్‌, విజయవాడ 
జ: మీకు ఎంత సాధ్యమైతే అంత పొదుపు, మదుపు చేయండి. మీరు మరో రెండు లేదా మూడేళ్లలో రిటైరయ్యేవరకూ ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయండి. అంటే మీకు ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఏడేళ్ల కాలం ఉంది. ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేసే ముందు ముఖ్యంగా మూడు పనులు చేయాలి. ముందుగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత హెల్త్‌ ఇన్సూరెన్స్, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవాలి. ఈ మూడు పనులు పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్‌ అవసరాల కోసం మదుపు చేయడానికి ఉపక్రమించండి. రిటైరైన తర్వాత ఏడాదికి ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కేయండి. ఈక్విటీ ఫండ్స్‌ సాధారణంగా 10-12 శాతం మేర రాబడులనిస్తాయి. కొన్ని ఫండ్స్‌ 18-24 శాతం మేర రాబడులు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ 10-12 శాతం మేర రాబడులు వస్తాయనే అంచనాలనే పెట్టుకుంటే మంచిది. ఎక్కువ రాబడులు ఆశించి భంగపడటం కంటే తక్కువ రాబడులు ఆశించి దానికి తగ్గట్లుగా ఆలోచనలు చేయడం శ్రేయస్కరం. ఇప్పటి నుంచి ఎంత వీలైతే, అంత ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. మీకు ఇంక్రిమెంట్‌ పెరిగినప్పుడల్లా  ఆ మొత్తానికి సిప్‌ను కూడా పెంచండి. ఏడాదికి కనీసం 10 శాతం సిప్‌ పెంచడం మంచిది. మీరు మరో మూడేళ్లలో రిటైరవుతారనగా ఈ మొత్తాన్ని స్థిర ఆదాయం వచ్చే సాధనాలకు మళ్లించండి. మూడేళ్లకు అవసరమయ్యే మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌కు బదిలీ చేయండి.  సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్, పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌లను కూడా పరిశీలించవచ్చు. You may be interested

ఆటుపోట్ల మార్కెట్లో ఇవే బెటర్‌!

Monday 10th February 2020

దేశీయ మార్కెట్లు గతవారం ఆరంభంలో చూపిన జోరును కొనసాగించలేకపోతున్నాయి. ఈ వారం ఆరంభంలో సూచీలు దాదాపు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా కరోనా భయాలు, ఆర్థిక మందగమన భయాలు.. మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా స్థిర ప్రదర్శన చూపే క్వాలిటీ స్టాకులను నమ్ముకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మంచి రాబడులు ఇచ్చిన ట్రాక్‌ రికార్డు ఉండి, నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీల షేర్లపై దృష్టి పెట్టడం

రైలు వీల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Monday 10th February 2020

ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి చరిత్రలో మరో ముందడుగు పడింది. భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌లో శనివారం వీల్స్‌ ఉత్పత్తి ప్రారంభించారు. స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి.కె.రథ్‌ తొలి వీల్‌ ఉత్పత్తిని అధికారికరంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.1,680 కోట్లు వ్యయం అయిందన్నారు. ఈ ప్లాంట్‌లో ఏడాదికి లక్ష రైలు

Most from this category