News


ఫండ్‌ మేనేజర్లు అధికంగా ‘బై’, ‘సెల్‌’ చేసిన స్టాకులు

Tuesday 20th August 2019
personal-finance_main1566298338.png-27900

ఈ ఏడాది జులై నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌) నికరంగా రూ. 14,846.75 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. అంతేకాకుండా జులై నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లో జూన్‌ నెలతో పోల్చుకుంటే 6 శాతం పెరిగిందని, జూన్‌ నెలలో ఈ ఇన్‌ఫ్లో రూ. 7,663 కోట్లుండగా, జులై నెలలో రూ. 8,113 కోట్లకు పెరిగిందని వివరించింది. సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్‌ఫ్లో స్థిరంగా ఉందని తెలిపింది. కాగా దేశియ ఈక్విటీ మార్కెట్‌ 17 ఏళ్లలో జులై నెలలో అధికంగా పతనం కావడం గత నెలలోనే చోటు చేసుకుం‍ది.  మార్కెట్‌ పతనాన్ని లెక్కచేయక, దేశీయ ఈక్విటీ మార్కెట్లో జులై నెలలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 20,395 కోట్ల పెట్టుబడులను పెట్టడం గమనార్హం. ఈ పెట్టుబడులు గత ఏడాది 2018 అక్టోబర్‌ తర్వాత అత్యధికమని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది.

 ఎంఎఫ్‌లు కొన్న, అమ్మిన లార్జ్‌క్యాప్‌ స్టాకులు: 
ఈ ఏడాది జులై నెలలో ఫండ్ మేనేజర్లు కొనుగోలు చేసిన స్టాకులలో ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఐఓసీ స్టాక్స్‌  మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయని ఐసిఐసిఐ డైరెక్ట్ తెలిపింది. మరోవైపు, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యుపీఎల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను ఫండ్‌ మేనేజర్‌లు అత్యధికంగా విక్రయించారని పేర్కొంది. జూన్‌లో కూడా అత్యధికంగా కొనుగోలు చేసిన వాటిలో గెయిల్‌ ఇండియా, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, యుపీఎల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ జూన్‌ నెలలో ఎంఎఫ్‌ల ద్వారా అత్యధికంగా అమ్ముడైన స్టాక్లలో ఉన్నాయి.

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌:
మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులు ఆయిల్ ఇండియా, ఎస్‌జేవీఎన్‌, ఎన్‌బీసీసీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎన్‌ఎల్‌సీ ఇండియా షేర్లను జులై నెలలో అధికంగా కొనుగోలు చేయగా, మైండ్‌ట్రీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, ఆర్‌ఈసి, ఎస్కార్ట్‌ షేర్లను అత్యధికంగా విక్రయించారు. జూన్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయించిన టాప్ 10 స్టాక్‌ల జాబితాలో ఉన్న ఆయిల్ ఇండియా, జులై నెలలో కొనుగోలు చేసిన టాప్ స్టాకుల జాబితాలో ఉండడం గమనార్హం. జూన్‌లో ఫండ్‌ మేనేజర్లు కొనుగోలు చేసిన టాప్ 10 జాబితాలో ఉన్న డిష్ టీవీ, రిలయన్స్ నిప్పన్ లైఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు జులైలో కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా, జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వెస్ కార్ప్, గ్రాఫైట్ ఇండియా షేర్ల విక్రయాలను జులై నెలలో కూడా ఎంఎఫ్‌లు కొనసాగించాయి. 

స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌: 
టాటా స్పాంజ్ ఐరన్, కెన్ ఫిన్ హోమ్స్, బిర్లాసాఫ్ట్, తేజాస్ నెట్‌వర్స్క్‌, క్రెడిట్ యాక్సెస్ గ్రామీన్ స్టాకులను మ్యూచువల్ ఫండ్స్‌ జులై నెలలో అధికంగా కొనుగోలు చేయగా, ఇంటలెక్ట్‌ డిజైన్‌ అరేనా, మిండా కార్పొరేషన్, వండర్లా హాలిడేస్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్, ఆవాస్ ఫైనాన్షియర్స్ షేర్లను అధికంగా విక్రయించారు.You may be interested

మూడురోజుల లాభాలకు బ్రేక్‌...!

Tuesday 20th August 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా మార్కెట్‌ మూడురోజుల వరుస లాభాలకు మంగళవారం ముగింపు పడినట్లైంది. సెన్సెక్స్‌ 74 పాయింట్ల నష్టంతో 37328 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయి 11017 వద్ద స్థిరపడింది. ఐటీ, అటో, ఫార్మా షేర్ల తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌, రియల్టీ, ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్‌, మెటల్‌, రియల్టీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి

స్వల్పకాలానికి హెచ్‌డీఎఫ్‌సీకి దూరం!

Tuesday 20th August 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ సూచన వీక్లీ చార్టుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బేరిష్‌ ధోరణి చూపుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ చెప్పారు. చార్టుల్లో హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని, దీనికితోడు కీలక మద్దతుకు దిగువన క్లోజయిందని చెప్పారు. గతంలో ఆర్‌ఐఎల్‌లో కనిపించిన ధోరణి ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీలో ఉందన్నారు. అందువల్ల స్వల్పకాలానికి ఈ షేరుకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. కొన్ని వారాలపాటు హెచ్‌డీఎఫ్‌సీపై బుల్లిష్‌ కాల్స్‌ను పట్టించుకోవద్దన్నారు. మరో దిగ్గజం

Most from this category