News


అక్టోబర్‌లో ఫండ్స్‌ అమ్మకాలు, కొనుగోళ్లు వీటిల్లోనే

Monday 12th November 2018
personal-finance_main1542046491.png-21911

అక్టోబర్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌కు గురైనాగానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.22.23 లక్షల కోట్లకు పెరిగింది. ఈ కాలంలో ప్రధాన సూచీలు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయి. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మాత్రం ఆగలేదు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ ఈ రెండు నెలల్లో మార్కెట్లు కరెక్షన్‌ బాట పట్టగా... ఈ కాలంలో రూ.7,727 కోట్లు, రూ.7,985 కోట్ల మేర సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులుగా వచ్చాయి. గత నెలలో టాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కొనుగోలు చేసిన, విక్రయించిన షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 

హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌
కోల్‌ ఇండియా 2.82 కోట్ల షేర్లు, హెచ్‌పీసీఎల్‌ (2.25 కోట్ల షేర్లు), బీపీసీఎల్‌ (1.4 కోట్ల షేర్లు), ఎన్‌టీపీసీ (69 లక్షల షేర్లు), ఇండియన్‌ హోటల్స్‌ (55 లక్షల షేర్లు), వేదాంత (50 లక్షల షేర్లు), ఎస్‌బీఐ (44 లక్షల షేర్లు) కొనుగోలు చేసింది. ఇక గ్యామన్‌ ఇన్‌ఫ్రా, జేపీ పవర్‌ వెంచర్స్‌, టాటా మోటార్స్‌, బీహెచ్‌ఈఎల్‌, అశోక్‌లేలాండ్‌ షేర్లను అమ్మేసింది. 
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌
ఈ సంస్థ 500 కంపెనీల్లో దాదాపు రూ.1.2 లక్షల కోట్లు వివిధ పథకాల ద్వారా ఇన్వెస్ట్‌ చేసి ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ 3.8 కోట్ల షేర్లు, కోల్‌ ఇండియా (3.79 కోట్ల షేర్లు), ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (2.42 కోట్ల షేర్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (2.15 కోట్ల షేర్లు), అంబుజా సిమెంట్‌ (1.6 కోట్ల షేర్లు), ఎన్‌హెచ్‌పీసీ (1.47 కోట్ల షేర్లు), వేదాంత (1.4 కోట్ల షేర్లు), యాక్సిస్‌ బ్యాంకు 1.38 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. మరోవైపు ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌ షేర్లను విక్రయించింది. 
ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెట్‌
347 సెక్యూరిటీల్లో రూ.1.25 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేసి ఉంది. అక్టోబర్‌లో ఐసీఐసీఐ బ్యాంకు 1.27 కోట్ల షేర్లు, బీపీసీఎల్‌ 98 లక్షల షేర్లు, ఎస్‌బీఐ (94 లక్షల షేర్లు), కోల్‌ ఇండియా (76 లక్షల షేర్లు), భారతీ ఎయిర్‌టెల్‌ (61 లక్షల షేర్లు) చొప్పున కొనుగోలు చేసింది. అలాగే, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఎక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ షేర్లను అమ్మేసింది.
ఆదిత్య బిర్లా ఏఎంసీ
ఈ సంస్థ ఎస్‌బీఐ, టాటా పవర్‌, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, వేదాంత షేర్లను కొనుగోలు చేసింది. అదే సమయంలో హెచ్‌పీసీఎల్‌, యస్‌ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లను విక్రయించింది.
రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ
ఎన్‌టీపీసీ 3.59 కోట్ల షేర్లు, టాటాపవర్‌ 1.3 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అలాగే, ఇండియన్‌ ఆయిల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లను కొనుగోలు చేసింది. గెయిల్‌, అంబుజా సిమెంట్‌, బీహెచ్‌ఈఎల్‌ షేర్లను అమ్మేసింది.You may be interested

కంపెనీల బలాలను గుర్తించమే ఇన్వెస్టర్‌ సత్తా

Monday 12th November 2018

ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ ‘మోట్స్‌’ అనే అంశం ఇన్వెస్టర్లు అందరికీ అనుసరణీయమే. వ్యాపార రంగంలో ఒక కంపెనీకి పోటీ పరంగా ఉన్న సానుకూలతలు, బలాలను ఇది తెలియజేస్తుంది. పోటీ పరంగా సానుకూలత, సంబంధిత కంపెనీ వ్యాపారం నిర్వహించే రంగంలోకి ప్రవేశించడానికి ఇతర కంపెనీలకు చాలా కష్టమైన అంశం కావడం లేదా ఆ కంపెనీ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకోవడం అసాధ్యమైన అంశాలనేవి మోట్స్‌ కిందకు వస్తాయి.    ఓ కంపెనీకి ప్రస్తుత

10500 దిగువకు నిఫ్టీ

Monday 12th November 2018

345 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ మిడ్‌సెషన్‌ నుంచి మొదలైన అమ్మకాలు క్రమంగా పెరగడంతో మార్కెట్‌ వరుసగా రెండో సెషన్‌లోనూ భారీ నష్టంతో ముగిసింది. ప్రభుత్వరంగబ్యాంక్‌, అటో, మెటల్‌ షేర్లలో పతనంతో సెన్సెక్స్‌ 345 పాయింట్ల నష్టంతో 34,813 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల నష్టంతో 10,482 వద్ద ముగిశాయి. నేటి ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ..,  కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఫలితంగా

Most from this category