News


ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఈ 8 విషయాలు అనుసరించాల్సిందే

Saturday 22nd June 2019
personal-finance_main1561190126.png-26496

ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్‌ పెరిగింది. ఈ పెరుగుదలను చూసి స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది సిద్ధ పడ్డారు. కానీ మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టడం అంత సులభమైన పక్రియ కాదు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? బలంగా కనిపించే కంపెనీలు నిజం‍గానే లాభాలను ఇస్తాయా? పెట్టుబడులు పెట్టే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
    ఒక కంపెనీలో ఇన్వేస్ట్‌ చేసే ముందు ఆ కంపెనీకి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. ఒక సంస్థ మంచిదా?కాదా? అనే విషయాన్ని కనుక్కోవాలంటే ఆ సంస్థ గుణాత్మక, పరిమాణాత్మక అంశాలను తనిఖీ చేయాలి. గుణాత్మక కారకాలు కంపెనీ విడుదల చేసే సంఖ్యలో ఉండకపోవచ్చు. ఆ కంపెనీ మంచిది అని భావించాలంటే  కంపెనీ నిర్వహణ ఇంటర్వ్యూలు, కాన్ఫెరన్స్‌-కాల్స్, పెట్టుబడిదారుల ప్రదర్శనలు, నిర్వహణ చర్చ, విశ్లేషణ నివేదికలు ఏదో ఒక దాని ద్వారా గుణాత్మక కారకాలను నిర్ధారించవచ్చు.
గుణాత్మక కారకాలు:
వ్యాపార నమూనా:
ఒక సంస్థ ఏం చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. సంస్థ వ్యాపారం చేసే విధానం ఏమిటి?  డబ్బును ఎలా సంపాదిస్తుంది?  నగదు అధికంగా ఉన్న వ్యాపారమా లేదా నగదుతో కూడిన వ్యాపారమా? తయారుచేసే ఉత్పత్తి ఏమిటి? ఆ ఉత్పత్తికి మార్కెట్‌లో ఎంత డిమాండ్‌ ఉంది? అనే విషయాలు గమనించాలి. ప్రతి విషయం సానుకూలంగా ఉంటే ఆ సంస్థను మంచి సంస్థగా నిర్ధారించవచ్చు.
ఉదాహరణ: పిడిలైట్ ఇండస్ట్రీస్ గుత్తాధిపత్య వ్యాపారంలో ఉంది.
కార్పొరేట్ పాలన:
సంస్థ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కంపెనీ ఇన్వెస్టర్లు స్నేహపూర్వకంగా ఉన్నారా? లేదా? సంస్థ చట్టం నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తుందా? కంపెనీ ఏదైనా చట్టపరమైన గొడవలో ఉందా? వీటి సమాధానలు సరిగ్గా ఉంటే కార్పొరేట్‌ పాలన బాగున్నట్టే.
ఉదాహరణ: బజాజ్ కార్పొరేట్ పాలన బలంగా ఉంది.
మానేజ్‌మెంట్‌:
సంస్థను నడిపించడంలో మానేజ్‌మెంట్‌ సమర్థవంతంగా ఉందా?  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానేజ్‌మెంట్‌ మారగలదా? ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందా? పెట్టుబడిదారులతో మానేజ్‌మెంట్‌ స్నేహపూర్వకంగా ఉంటుందా?  మానేజ్‌మెంట్‌పై సానుకూల స్పందన వస్తే, ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
తులనాత్మక ప్రయోజనాలు:
కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్‌ ఎలా ఉంది?  ఇతర పోటిదారుల నుంచి ఎక్కువ కాలం పోటీని ఎదుర్కోగలదా? ఈ విషయాలపై సరియైన అవగాహాన ఉన్నట్టయితే మంచిది. 
ఉదాహరణ: పాడి రంగంలో మిగిలిన కంపెనీల కంటే  అముల్ ముందు వరుసలో ఉంది.


పరిమాణాత్మక కారకాలు:
ఇండస్ట్రీ:
కంపెనీ వృద్ధి ఆ ఇండస్ట్రీ వృద్ధికి అనుగుణంగా ఉందో లేదో చూసుకోవాలి.  కంపెనీ వృద్ధి ఇండస్ట్రీ వృద్ధిని అధిగమిస్తే ఇంకా మంచిది. కంపెనీ, ఇండస్ట్రీ వృద్ధి శాతాలను గమనించాలి. 
ఉదాహరణ: ఇండియాలో విమాన రంగ వృద్ధి కంటే ఇండిగో వృద్ధి ఎక్కువగా ఉంది.
వినియోగదారులు:
ఒక సంస్థ అమ్మకాలకు వివిధ రకాల వినియోగదారులుంటే ఆ కంపెనీకి నష్టాలను తగ్గించుకునే అవకాశం​ఉంటుంది. అందువలన కంపెనీ అమ్మకాలకు వినియోగదారులు ఎలా ఉన్నారనే విషయాన్ని గమనించాలి.
ఉదాహరణ: హిందుస్తాన్ యునిలివర్‌ వివిధ రకాల కస్టమర్-బేస్‌ను కలిగి ఉంది.
పోటీ:
ఒక సంస్థకు ఆ రంగంలో ఎక్కువ మంది పోటి దారులుంటే లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఒక రంగంలో చాలా మంది పోటిదారులుంటే భారీ పోటీ కారణంగా సంస్థ తన మార్కెట్ వాటాను పెంచకోవడం, ధరలను పెంచడం కష్టమవుతుంది.
ఉదాహరణ: టెలికాం సెక్టార్ కంపెనీలు.

ఆర్ధిక సంబంధమైన కారకాలు:
ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టే ముందు ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడం చాలా అవసరం. ఆ కంపెనీ
ఆదాయ ప్రకటన, నగదు ప్రవాహ ప్రకటన, బ్యాలెన్స్ షీట్‌లు వంటి ఆర్థిక నివేదికలు సంస్థ ఆర్ధిక పరిస్థితిని గురించి తెలియజేస్తాయి. సంస్థ భవిష్యత్తులో సంపాదించే సామర్థ్యాన్ని బట్టి ఆ సంస్థ లాభదాయకంగా ఉందా?, ఆర్ధిక సంపాదన ఆశాజనకంగా కనిపిస్తుందా? వంటి విషయాలు తెలుస్తాయి. 

ఆదాయ ప్రకటన నివేదిక:
ఒక సంస్థ రోజువారీ పనితీరును తెలుసుకోడానికి ఆ కంపెనీ ప్రకటించే ఆదాయ ప్రకటనలు ఉపయోగపడతాయి.
-క్వార్టర్-ఆన్-క్వార్టర్ (క్యూఓక్యూ) ప్రాతిపదికన కంపెనీ తన అమ్మకాలు, లాభాలను పెంచుకోగలిగిందా? అనే విషయం తెలుస్తుంది.
- సంస్థ లాభాలు పెరుగుతున్నాయా? లేదా?
- సంస్థ తన ఖర్చులను నియంత్రించుకుంటూ అమ్మకాలు, లాభాలను పెంచుకోగలుగుతుందా? లేదా?
- మొత్తం మీద కంపెనీ వృద్ధి ఎలా ఉందనే విషయాలు ఆదాయ నివేదికల ద్వారా తెలుస్తాయి.

బ్యాలెన్స్‌ షీట్‌:
-వైఓవై ప్రతిపదికన ఒక సంస్థ ఆస్తులు, బాధ్యతలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయనే విషయం బ్యాలెన్స్‌ షీట్‌ ద్వారా తెలుస్తుంది. 
- రుణ భారం, ఖాతా చెల్లింపులు పెరిగితే కంపెనీ ద్రవ్య లభ్యతకు ఆటంకం.
- అదేవిధంగా, ఆస్తులలో స్వీకరించదగిన ఖాతాలు పెరిగితే అది కూడా కంపెనీ ద్రవ్య లభ్యతపై ప్రభావం చూపిస్తుంది.
- ఈ విధంగా బ్యాలన్స్‌ షీట్లను అనుసరించడం వలన కంపెనీ ఆస్తులు పెరుగుతున్నాయా?లేదా?, అప్పులు పెరుగుతున్నాయా? అనే విషయాలు తెలుస్తాయి. 
- ఆస్తులు పెరిగితే నగదు తగ్గుతుంది.  ఈ పెరుగుదలకు కంపెనీలు అంతర్గతంగా నిధులను ఏర్పాటు చేసుకున్నాయా లేదా అప్పుల ద్వారా సమకూర్చుకున్నాయా అనే విషయాలు తనిఖీ చేయాలి.

నగదు ప్రవాహ ప్రకటన: 
ఒక కంపెనీ వ్యాపారం బలంగా ఉందో లేదో నగదు ప్రవాహా ప్రకటన ద్వారా అర్థం చేసుకోవచ్చు.
- వ్యాపారంలోని లాభాల వలన కార్యచరణ నగదు ప్రవాహం సానుకూలంగా ఉంటే ఆ కంపెనీ మంచి స్థాయిలో ఉన్నట్టే.
- సంస్థ ఫైనాన్సింగ్ నగదు ప్రవాహం సానుకూలంగా ఉంటే, ఆ సంస్థ తన నగదును సంస్థ వృద్ధికి సమర్ధవంతంగా ఉపయోగించుకోగలదని అర్థం.
- సంస్థ తన ఆస్తులను పెంచుకుంటే పెట్టుబడి నగదు ప్రవాహం ప్రతికూలంగా ఉంటుంది. అందువలన కంపెనీ తన భవిష్యత్‌ కార్యచరణలకు ఇబ్బంది పడవచ్చు.
- సంస్థ తన వ్యాపారం నుంచి సానుకూల నగదు ప్రవాహాన్ని సృష్టించగలిగినప్పుడు, అది సంస్థ భవిష్యత్ వృద్ధికి సహాయపడుతుంది.

   మనం ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆ కంపెనీ గుణాత్మక, పరిమాణత్మక కారకాలను పరిశీలించడం అవసరం. ఆదాయ ప్రకటన నివేదిక కంపెనీ రోజువారి కార్యచరణను తెలియజేస్తే, బ్యాలన్స్‌ షీట్‌ వార్షికంగా కంపెనీ ఆస్తులను, బాధ్యతలను వివరిస్తుంది. ఫలితంగా కంపెనీ బలాబలాలను, బలహీనతలను అర్ధం చేసుకోవచ్చు. నగదు ప్రవాహం అన్నిటి కన్నా ముఖ్యమైనది. దీనిని పరిశీలించడం వలన కంపెనీ నగదు అవసరాలు తెలుస్తాయి. ఫలితంగా కంపెనీ భవిష్యత్‌ వృద్ధిని అంచనా వేయవచ్చు. 
 You may be interested

1400డాలర్లపై ముగిసిన పసిడి ధర

Saturday 22nd June 2019

ప్రపంచమార్కెటో పసిడి ధర 6ఏళ్ల సుధీర్ఘ విరామం తొలిసారి 1400డాలర్ల పైన ముగిసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రికత్తలు, వడ్డరేట్లపై ఈసీబీ, ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకుల మెతక వైఖరీ, క్రూడాయిల్‌ ధరల అస్థిరత, డాలర్‌ ఇండెక్స్‌ 3నెలల కనిష్టానికి పతనం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి పసిడి ఫ్యూచర్ల వైపు మళ్లిస్తున్నారు. నిన్నటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకనొకదశలో 20డాలర్ల వరకు

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 22nd June 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌లో  నిన్నరాత్రి 3పాయింట్ల స్వల్ప లాభంతో 11,757.00 వద్ద స్థిరపడింది. మధ్యప్రాచ్య దేశంలో చెలరేగిన యుద్ధ ఉద్రికత్తలు, ముడిచమురు ధరల అనూహ్య పెరుగుదలతో మార్కెట్‌ ఈ వారంతపు రోజైన శుక్రవారం‍ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 407 పాయింట్లు నష్టంతో 39,194 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లను కోల్పోయి 11724 వద్ద స్ధిరపడ్డాయి. ట్రేడ్‌వార్‌ యుద్ధం, రూపాయి బలహీనత, రుతుపవనాల

Most from this category