ఫండ్ మేనేజర్లకు చిక్కిన టాప్ స్టాక్స్
By Sakshi

మ్యూచువల్ ఫండ్స్ పథకాలు జూన్ నెలలో ప్రైవేటు బ్యాంకులు, కన్జ్యూమర్, యుటిలిటీలు, టెక్నాలజీ, ఎన్బీఎఫ్సీలు, రిటైల్, మెటల్స్, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టినట్టు ఐసీఐసీఐ డైరెక్ట్ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. అదే సమయలో ఆయిల్ అండ్ గ్యా్స్, కెమికల్స్, ఆటో, సిమెంట్ స్టాక్స్‌లో వాటాలు తగ్గించుకున్నారని తెలిపింది. ఈ నివేదికలోని మరిన్ని వివరాలు గమనిస్తే... ఫండ్స్ మేనేజర్లు కొనుగోలు చేసిన లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో... గెయిల్, క్యాడిలా, గోద్రేజ్ కన్జ్యూమర్, హిందుస్తాన్ జింక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. యూపీఎల్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, యస్ బ్యాంకు, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంకు స్టాక్స్‌ను లార్జ్‌క్యాప్ విభాగంలో ఫండ్స్ మేనేజర్లు ప్రధానంగా అమ్మకాలు జరిపారు. మిడ్‌క్యాప్ విభాగంలో శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఇమామీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా షేర్లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. గ్రాఫైట్ ఇండియా, జీఎంఆర్ ఇన్ఫ్రా, క్వెస్‌కార్ప్, అపోలో టైర్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్‌లో అమ్మకాలు నిర్వహించారు. స్మాల్‌క్యాప్ విభాగంలో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, వైభవ్ గ్లోబల్, సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఫోర్టిస్ హెల్త్‌కేర్, డీబీకార్ప్లో ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కొనుగోళ్లు జరిపాయి. ఇదే విభాగంలో టీవీ18బ్రాడ్కాస్ట్, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, సౌత్ ఇండియన్ బ్యాంకు, మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, ఐడీఎఫ్‌సీలో అమ్మకాలు జరిపాయి. జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్టాక్స్‌లోకి పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. దీంతో దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం పెట్టుబడులు (ఈక్విటీ, డెట్) రూ.25.49 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. త్రైమాసికం వారీగా చూస్తే 4 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఎప్పటిమాదిరే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మార్గంలో వచ్చే పెట్టుబడుల జోరు కొనసాగింది. సిప్ ద్వారా రూ.8,000 కోట్లు వచ్చాయి. ఈక్విటీ మార్కెట్లలో వాతావరణం అస్థిరంగానే ఉన్నా ఇన్వెస్టర్లలో నమ్మకం సడలలేదు. ‘‘మార్కెట్లు ముందుకు, వెనక్కీ ఊగిసలాడుతున్నప్పటికీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించారు. నిధుల రాక స్థిరంగా ఉండడమే కాకుండా, సిప్ ద్వారా పెట్టుబడులు సైతం జూన్‌లో రూ.8,120 కోట్లుగా ఉన్నాయి’’ అని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యానికి తోడు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఆస్తుల వృద్ధికి తోడ్పడినట్టు ఫండ్ మేనేజర్లు పేర్కొన్నారు.
You may be interested
సన్ ఫార్మాకు నవోదయం ఆరంభమైందా...?
Tuesday 16th July 2019సన్ ఫార్మా లాభాలు ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిలకు చేరాయి. షేరు ధర కూడా 2013 నాటి స్థాయిల్లోనే కదలాడుతోంది. కానీ, ‘సన్‌ఫార్మా’ బలమైన టర్న్ అరౌండ్ స్టోరీగా మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. తాజాగా ఈ స్టాక్‌కు రేటింగ్‌ను ఓవర్ వెయిట్ (అధిక ప్రాధాన్యం)కు పెంచడంతోపాటు రూ.505 టార్గెట్‌ను కూడా ఇవ్వడం గమనార్హం. గత ఐదు రోజుల్లోనే ఈ స్టాక్ రూ.381 స్థాయి నుంచి రూ.433 స్థాయికి పెరిగిపోవడం విశేషం. 2020-21
మార్చినాటికి నిఫ్టీ @12,900!
Tuesday 16th July 2019నోమురా అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి నిఫ్టీ టార్గెట్ 12900 పాయింట్లని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ నోమురా ప్రకటించింది. దేశీయ మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఏడాది కాలానికి దేశీయ మార్కెట్లపై పాజిటివ్‌గా ఉన్నామని, బడ్జెట్లో ప్రకటించిన చర్యలన్నీ పెట్టుబడి సైకిల్‌ను ముందుకు నడిపేవిగా ఉన్నాయని నోమురా ఇండియా రిసెర్చ్ హెడ్ సైయోన్ ముఖర్జీ చెప్పారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, బ్యాంకింగ్ రంగంలో రుణ కేటాయింపులు తగ్గడమనేవి దేశీయ మార్కెట్‌కు ప్రధాన