STOCKS

News


ఫండ్‌ మేనేజర్లు ప్రధానంగా కొన్న షేర్లివే..

Friday 15th November 2019
personal-finance_main1573841699.png-29624

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తులు అక్టోబర్‌లో 7 శాతం పెరిగాయి. కానీ, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక మాత్రం 5 నెలల కనిష్టానికి చేరింది. మార్కెట్లలో ఇటీవలి కాలంలో అనిశ్చితులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. పైగా గత ఏడాదిన్నర కాలంలో చూసుకుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో అధిక శాతం ఫండ్స్‌ ఇచ్చిన రాబడులు ఒక అంకెలోపే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడుల రాక తగ్గడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలలో రూ.6,600 కోట్లు ఈక్విటీ ఫండ్స్‌లోకి వస్తే, అక్టోబర్‌లో ఇవి రూ.6,000 కోట్లకు తగ్గాయి. అయితే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ప్లాన్‌ (సిప్‌) రూపంలో వచ్చే పెట్టుబడులు మాత్రం రూ.8,122 కోట్లతో బలంగా ఉండడం గమనార్హం. అయితే, ఫండ్‌ మేనేజర్లు గత నెలలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వివరాలను ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. 

 

లార్జ్‌క్యాప్‌
ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, సిప్లా, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో ఫండ్స్‌ ఎక్కువగా కొనుగోళ్లు చేశాయి. లార్జ్‌క్యాప్‌ విభాగంలోనే అధికంగా విక్రయించిన షేర్లు.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఎన్‌ఎండీసీ, సీమెన్స్‌, పిడిలైట్‌, యస్‌ బ్యాంకు, యునైటెడ్‌ స్పిరిట్స్‌, న్యూఇండియా అష్యూరెన్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌.

 

మిడ్‌క్యాప్‌
ఈ విభాగంలో ఫండ్స్‌ అధికంగా కొనుగోలు చేసినవి.. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, 3ఎం ఇండియా, ఎస్కార్ట్స్‌, ఎన్‌బీసీసీ, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, ఫెడరల్‌ బ్యాంకు, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, టాటా పవర్‌. అధికంగా విక్రయించిన షేర్లలో.. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, అదానీ పవర్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, క్రిసిల్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా ఉ‍న్నాయి. 

 

స్మాల్‌క్యాప్‌
ఈ విభాగంలో బజాజ్‌ కన్జ్యూమర్‌కేర్‌, జేకుమార్‌ ఇన్‌ఫ్రా, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, పీవీఆర్‌, కెన్‌ఫిన్‌ హోమ్స్‌, క్రెడిట్‌ యాసెస్‌ గ్రామీణ్‌, అవంతి ఫీడ్స్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, యూనికెమ్‌ ల్యాబ్స్‌ షేర్లను మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్కువగా కొనుగోలు చేశాయి. అదే.. ఆసాహి ఇండియా గ్లాస్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌, రైట్స్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు, ఇండియా సిమెంట్స్‌, రామకృష్ణ ఫోర్జింగ్స్‌, కర్ణాటక బ్యాంకు, ఎన్‌ఐఐటీ లిమిటెడ్‌, మహానగర్‌ గ్యాస్‌లో షేర్లను విక్రయించాయి.  You may be interested

ఆర్సెలర్‌ మిట్టల్ చేతికే ఎస్సార్‌ స్టీల్‌!!

Saturday 16th November 2019

 టేకోవర్‌కు మార్గం సుగమం ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు కొట్టేసిన సుప్రీం కోర్టు వాటాలపై సీవోసీదే అంతిమ నిర్ణయం బ్యాంకులకే మొదటి ప్రాధాన్యం రుణదాతలందరినీ ఒకే గాటన కట్టలేమని  అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్‌ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌ మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్‌ మొత్తాన్ని ఫైనాన్షియల్‌ రుణదాతలు (బ్యాంకులు

ఐటీ కంటే ఫార్మా సానుకూలం: భాసిన్‌

Friday 15th November 2019

ఐటీ కంటే ఫార్మా రంగం పట్ల సానుకూలతను వ్యక్త పరిచారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. ఫార్మా రంగంలో సన్‌ ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లను ఆయన సూచించారు. ఐటీ రంగంలో ఒక్క విప్రో షేరును మాత్రం తాను కొనుగోలు చేస్తానని పేర్కొన్నారు. పలు మార్కెట్‌ అంశాలపై ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు.    ఫార్మాలో వేటి పట్ల సానుకూలం? మూడు ‍స్టాక్స్‌పై అధిక

Most from this category