News


ఇన్వెస్టింగ్‌ విషయంలో ఈ మూడూ వద్దు

Sunday 5th January 2020
personal-finance_main1578246858.png-30682

స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ అన్నది అంత ఈజీ టాస్క్‌ కాదు. తగినంత పరిజ్ఞానం, అవగాహన, ప్రణాళిక ఉంటేనే విజయం సాధ్యపడుతుంది. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల విషయంలో ఎన్నో అపోహలు వినిపిస్తుంటాయి. ఇన్వెస్టర్లు వాటిని గుడ్డిగా అనుసరిస్తుంటారు కూడా. ఇవి ఏంటి, వీటిని ఎలా అధిగమించాలన్నది ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ తెలియజేస్తున్నారిలా.. 

 

బ్లూచిప్‌ స్టాక్స్‌ 
ఇన్వెస్టర్లు స్టాక్‌ను కొనుగోలు చేసే ముందు మార్కెట్‌ విలువ కాకుండా షేరు ధరను చూస్తుంటారు. ఒక షేరు రూ.100 దిగువన ఉంటే అది పెన్నీ షేరు అని, రూ.1,000 పైన ఉంటే లార్జ్‌క్యా్ప్‌ అని భావిస్తుంటారు. కానీ, చాలా మంది తప్పు చేసేది ఇక్కడే. మారికో షేరు ధర రూ.334గా ఉంటే మార్కెట్‌ క్యాప్‌ రూ.43,220 కోట్లు. అదే ఐఆర్‌సీటీసీ షేరు ధర రూ.931, మార్కెట్‌ విలువ రూ.15,000 కోట్లు. అందుకే స్టాక్‌ ధరను చూడడం కాదు. స్టాక్స్‌ విషయంలో మంచి వ్యాపారం, స్వచ్ఛమైన యాజమాన్యం తదితర అంశాలను చూడాలి. 

 

డివిడెండ్‌
కంపెనీలు 500 శాతం, 1000 శాతం డివిడెండ్‌ ప్రకటించేవీ ఉన్నాయి. దీంతో ఆ కంపెనీలు  భారీగా డివిడెండ్‌ ఇస్తున్నాయని అనుకుంటుంటారు. ఒక కంపెనీ షేరు ముఖ విలువ రూ.1గా ఉండి, 200 శాతం డివిడెండ్‌ ప్రకటిస్తే.. వచ్చే డివిడెండ్‌ ఒక్కో షేరుకు కేవలం రూ.2. స్టాక్‌ ధర రూ.100 ఉంటే, చెల్లించే డివిడెండ్‌ రూ.2.. ఇదేమంత భారీ మొత్తమేమీ కాదు. కనుక నంబర్లను చూసి మాయలో పడిపోకుండా వాస్తవాలను పరిశీలించాలి. 

 

ఇతరత్రా..
మిడ్‌క్యాప్‌ పెరగబోతున్నాయని, కమోడిటీలు పెరుగుతాయని, లార్జ్‌క్యాప్స్‌ ఈ దశలో ఆగిపోతాయని కొందరు చెబుతుంటారు. కొన్ని స్టాక్స్‌ పెరుగుతాయని, మిగతావి పెరగవన్న అపోహలతో ఉండకూడదు. తగిన పరిశోధన చేసి, మంచి వృద్ధిని చూపించే అవకాశాలున్న స్టాక్స్‌ను గుర్తించాలి. యాజమాన్యం నాణ్యత, కంపెనీ భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, పోటీ నుంచి తట్టుకునే శక్తి సామర్థ్యాలు, స్టాక్‌ వ్యాల్యూషన్‌ ఇటువంటివి చూసి నిర్ణయం తీసుకోవాలి. You may be interested

మార్కెట్లపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా..?

Sunday 5th January 2020

ఇరాక్‌లో ఇరాన్‌ సైనిక కమాండర్‌ను అమెరికా దాడి చేసి హతం చేయడంతో.. మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించడం, అమెరికా వ్యక్తులు, ఆస్తులకు నష్టం కలిగిస్తే ఇరాన్‌లోని 52 స్థావరాలను ధ్వంసం చేయాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించడం చూడా జరిగిపోయాయి. ఇకపై వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రపంచమంతటా నెలకొంది. ఈక్విటీ మార్కెట్లపై ఈ ప్రభావం కొంత మేరకు ఉండొచ్చని అనలిస్టులు భావిస్తున్నారు.

అస్థిరతలను తోసిపుచ్చలేం: మనాలి భాటియా

Sunday 5th January 2020

గతేడాది మార్కెట్లకు మొత్తం మీద లాభదాయకంగానే ముగిసింది. నిఫ్టీ-50 నికరంగా 1,300 పాయింట్లు లాభపడింది. ఎన్ని కరెక్షన్లు చోటు చేసుకున్నా బుల్స్‌ ఆధిపత్యం కొనసాగింది. అయితే, 2020లోనూ మార్కెట్లలో ఇదే ధోరణి కొనసాగవచ్చని, అయితే అస్థిరతలను తోసిపుచ్చలేమని రుద్ర షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా అభిప్రాయపడ్డారు. రానున్న నెలల్లో మార్కెట్లలో మరిన్ని గరిష్టాలను చూసే అవకాశం ఉందన్నారు. అయితే, ఆ ప్రయాణం అంత సాఫీగా

Most from this category