News


రిస్క్‌ను తగ్గించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌

Tuesday 19th March 2019
personal-finance_main1553018687.png-24697

పన్ను ఆదా పథకాలకు ఏటా మార్చి నెలలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు కోసం ఈ నెలలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. అలా చూసినప్పుడు పన్ను ఆదాతో పాటు మెరుగైన రాబడులకు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) అనువైనవి. భిన్న మార్కెట్‌ పరిమాణంతో కూడిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు ఈ పథకాలకు సహజంగానే ఉంటుంది. దీంతో అగ్రెస్సివ్‌ పథకాలు మిడ్‌, స్మాల్‌క్యాప్‌నకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంటాయి. అయితే, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని తెలిసిందే. కనుక రిస్క్‌ గురించి ఆందోళన చెందే వారు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంటే లార్జ్‌క్యాప్‌నకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను ఎంచుకోవచ్చు. నిర్వహణ ఆస్తుల్లో మూడింట రెండొంతులు లార్జ్‌క్యాప్‌నకు కేటాయించే మూడు పథకాలను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ తెలియజేసింది. 

 

యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ
పన్ను ఆదా చేసే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల విభాగంలో అత్యధిక ఆస్తులతో కూడిన భారీ పథకం ఇది. రూ.17,600 కోట్ల పెట్టుబడులు ఈ ఒక్క పథకంలోనే ఉన్నాయి. 65-75 శాతం ఆస్తులను లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేస్తుంది. 25-30 శాతం ఆస్తులను మిడ్‌క్యాప్‌లో, మిగిలిన మేర ‍స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో పెడుతుంది. పనితీరులో మంచి స్థిరత్వం చూపిస్తూ వస్తోంది. తొమ్మిదేళ్ల కాలంలో బెంచ్‌ మార్క్‌, ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగం రాబడులతో పోలిస్తే ఈ పథకం వెనుకబడినది ఒకే ఒక్క సంవత్సరం. మిగతా అన్ని సంవత్సరాల్లోనూ చక్కని పనితీరుతో ముందుంది. ఐదేళ్ల పనితీరులో ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో​ మూడో స్థానంలో నిలిచింది. మూడేళ్లలో 14.5 శాతం, ఐదేళ్లలో 18.5 శాతం చొప్పున వార్షిక రాబడులను పంచింది.

 

ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్‌ ప్లాన్‌
ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో స్థిరమైన పనితీరుతో కూడిన పథకం. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్ అధికంగా కలిగిన పథకాల్లో ఇటీవలే ఇది కూడా చేరిపోయింది. ఐదేళ్ల కాలంలో బెంచ్‌ మార్క్‌, ఈ విభాగం పనితీరును మించి రాబడులు చూపించింది. బుల్‌, బేర్‌ మార్కెట్లలోనూ పనితీరును నిరూపించుకున్న పథకం. మూడేళ్లలో 15.1 శాతం, ఐదేళ్లలో 17.5 శాతం చొప్పున వార్షిక రాబడులు ఉన్నాయి.

 

మోతీలాల్‌ ఓస్వాల్‌ లాంగ్‌టర్మ్‌
ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగంలో ఆలస్యంగా వచ్చిన పథకం. బుల్‌, బేర్‌ మార్కెట్ల సమయాల్లో పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు దీర్ఘకాలిక ట్రాక్‌ రికార్డు కలిగి లేదు. అయితే, ఈ పథకం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన రాబడులను గమనిస్తే మెరుగ్గానే ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌కు పెట్టుబడులను 65-75 శాతం మేర కేటాయించింది. మిడ్‌క్యాప్‌నకు 20 శాతం, స్మాల్‌క్యాప్‌నకు 4 శాతం మేర కేటాయింపులు చేసింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 17.4 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 20th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ వరుసగాఏడు రోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు మార్పేదీ లేకుండా ట్రేడవుతోంది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50  గంటలకు 11,571 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ

ఈ సమయంలో ఐదు మిడ్‌క్యాప్స్‌...!

Tuesday 19th March 2019

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన విలువలతో ఎన్నో స్టాక్స్‌ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ చోటు చేసుకుంటుందన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో 91 స్టాక్స్‌ను బ్లూంబర్గ్‌ అనలిస్టులు ట్రాక్‌ చేయగా, ఇందులో ఎక్కువ రికమండేషన్లు ఉన్న ఐదు స్టాక్స్‌ వివరాలు ఇవి.    సన్‌టీవీ నెట్‌వర్క్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ... సన్‌ టీవీకి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో

Most from this category