STOCKS

News


దీర్ఘకాలంలో మోస్తరు రాబడులనిచ్చే ఫండ్‌

Monday 27th January 2020
personal-finance_main1580095553.png-31221

  • టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌

మార్కెట్ల ర్యాలీలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ పాత్ర అన్ని సమయాల్లోనూ ఉంటుంది. పైగా లార్జ్‌క్యాప్‌ విభాగంలో రిస్క్‌ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రిస్క్‌ ఎక్కువగా ఉన్నా కానీ, దీర్ఘకాలానికి రాబడులు కూడా అధికంగానే ఉంటాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడులపై సంపద సృష్టించే విధంగా టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌ పనిచేస్తుంటుంది. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనకునే వారు, తమ పెట్టుబడులపై మోస్తరు రాబడులను ఆశించే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. 

రాబడులు...
ఈ పథకంలో ఏడాది రాబడులు 16.49 శాతంగా ఉన్నాయి. కానీ, బీఎస్‌ఈ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఇదే కాలంలో 11 శాతం వృద్ధినే నమోదు చేయడం గమనార్హం. ఇక ఈ పథకం మూడేళ్ల కాలంలో వార్షికంగా 11.43 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.51 శాతం, ఏడేళ్లలో 13.68 శాతం, పదేళ్ల కాలంలో వార్షికంగా 11 శాతం వరకు రాబడులను ఇచ్చినట్టు గత పనితీరు ఆధారంగా తెలుస్తోంది. దీర్ఘకాలానికి సగటున 11 శాతం వార్షిక రాబడులు అద్భుతం కాకపోయినా, ఫర్వాలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా మూడేళ్లు, ఐదేళ్ల కాలానికి బెంచ్‌మార్క్‌తో పోలిస్తే పనితీరు విషయంలో వెనుకబడినప్పటికీ... ఈ విభాగంలోని ఇతర పథకాలతో పోలిస్తే టాటా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ మెరుగైన పనితీరును చూపించడాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి. గత ఏడాది కాలంలో ఎల్‌ఐసీ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌, ఎడెల్‌వీజ్‌ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ పథకాల కంటే అధిక రాబడులను ఇచ్చింది. ఏక మొత్తంలో కంటే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మరింత అదనపు రాబడులకు అవకాశం ఉంటుందని గమనించాలి. 

పెట్టుబడుల విధానం...
పోర్ట్‌ఫోలియో కోసం స్టాక్‌ను ఎంచుకునే ముందు ఈ పథకం ఫండ్‌ మేనేజర్‌ ఐదు అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. కంపెనీ నిధులను ఎంత సమర్థవంతంగా వినిగియోస్తోంది, పరిపాలనా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వృద్ధి అవకాశాలు, స్టాక్‌ వ్యాల్యూషన్‌ ఏ స్థాయిలో ఉంది, స్టాక్‌లో లిక్విడిటీ అంశాల్లో మెరుగ్గా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం జరుగుతుంది. అలాగే, బోటమ్‌అప్‌ అప్రోచ్‌ విధానాన్ని స్టాక్స్‌ ఎంపికకు అనుసరిస్తుంది. ప్రస్తుతానికి ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 33 స్టాక్స్‌ ఉన్నాయి. 93.3 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా, మిగిలిన పెట్టుబడులు నగదు, నగదు సమానాల రూపంలో ఉన్నాయి. మెగాక్యాప్‌, లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 60 శాతం మేర ఇన్వెస్ట్‌ చేయగా, మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 38 శాతాన్ని, మిగిలిన మేర స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసి ఉంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తూ అత్యధికంగా 38.5 శాతం మేర ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు 12 శాతం, ఇంధన కంపెనీలకు 9.55 శాతం పెట్టుబడులు కేటాయించింది. You may be interested

పసిడి మెరుపు- చమురు డీలా

Monday 27th January 2020

కరోనా వైరస్‌ భయాలు బలపడిన జపనీన్‌ యెన్‌ ట్రెజరీలకు డిమాండ్‌- బాండ్ల ఈల్డ్స్‌ డౌన్‌ చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు మరోసారి ముడిచమురు ధరలు డీలాపడగా.. పసిడికి డిమాండ్‌ పెరిగింది. మరోపక్క రక్షణాత్మక పెట్టుబడిగా భావించే జపనీస్‌ కరెన్సీ యెన్‌ బలపడింది. ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో నేడు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు.

నేడు భారీ నష్టాలతో ప్రారంభం?!

Monday 27th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 108 పాయింట్లు పతనం ఇతర దేశాలకూ పాకుతున్న కరోనా వైరస్‌  2 శాతం క్షీణించిన ముడిచమురు ధరలు నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 108 పాయింట్లు పతనమై 12,163  వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,271 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Most from this category