News


ఫండ్స్‌ వలకు చిక్కిన స్మాల్‌ క్యాప్స్‌

Friday 14th February 2020
personal-finance_main1581704330.png-31805

లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలో చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక రంగ మందగమనం, ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాణించేవి లార్జ్‌క్యాప్‌ కంపెనీలే కనుక విదేశీ ఫండ్స్‌, దేశీయ ఫండ్స్‌ ఇన్నాళ్లూ ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో నాణ్యమైన స్టాక్స్‌లోనే ఎక్స్‌పోజర్‌కు మొగ్గు చూపించాయి. కానీ, ఆర్థిక వృద్ధి క్షీణత బోటమ్‌ అవుట్‌ అయిందన్న అంచనాలతో, ఇక మీదట చిన్న, మధ్య స్థాయి కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని, లార్జ్‌క్యాప్‌ షేర్లతో ధరల పరంగా అంతరం తగ్గిపోతుందన్న అంచనాలతో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ జనవరి నెలలో చిన్న, మధ్య స్థాయి విభాగంలో పలు షేర్లను కొనుగోలు చేశాయి.

 

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీడీఎస్‌ఎల్‌ కంపెనీలో రూ.48 కోట్ల విలువైన 17,96,000 షేర్లను కొనుగోలు చేసింది. అదే సమయంలో లారస్‌ ల్యాబ్స్‌లో తనకున్న 7,58,000 షేర్లు, బ్లూడార్ట్‌లో 1,01,000 షేర్లు, జేకే టైర్‌లో 16,37,000 షేర్లు, శోభలో 2,39,000 షేర్లను విక్రయించేసింది. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.1,93,581కోట్ల ఈక్విటీ ఆస్తులను వివిధ పథకాల పరిధిలో జనవరి చివరి నాటికి నిర్వహిస్తోంది.

 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ రూ.1.54 లక్షల కోట్ల ఈక్విటీ ఆస్తులను జనవరి చివరికి కలిగి ఉంది. ఈ సంస్థ లా ఒపాలా ఆర్‌జీ షేర్లను రూ.106 కోట్ల మేర జనవరి నెలలో కొనుగోలు చేసింది. అలాగే, రాడికో ఖైతాన్‌ కౌంటర్‌లో 2,52,000 షేర్లు, ఆల్కిల్‌ అమైన్స్‌ కెమికల్‌లో 18,000 షేర్లు, మదర్సన్‌ సుమీ 20వేల షేర్లను నూతనంగా కొనుగోలు చేసింది. ఇక అదే విధంగా ఎన్‌ఎండీసీలో ఉన్న 1,26,000 షేర్లను, ఫ్యూచర్‌ సప్లయ్‌ సొల్యూషన్స్‌లో 14,000 షేర్లను, మెకలియోడ్‌ రస్సెల్‌ 7,56,000 షేర్లతోపాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్‌లో ఉన్న షేర్లను కూడా విక్రయించేసింది.

 

ఈక్విటీ ఆస్తుల పరంగా మూడో అతిపెద్ద ఏఎంసీ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ జనవరిలో సర్ద ఎనర్జీ, ఆర్తి ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, హ్యాట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌లో స్వల్ప వాటాలను కొనుగోలు చేసింది. అదే సమయంలో ఎస్‌ఐపీ టెక్‌, అంపర్సంద్‌ సాఫ్ట్‌ కంపెనీల్లో వాటాలను విక్రయించింది.

ఈక్విటీ ఆస్తుల పరంగా నాలుగో అతిపెద్ద సంస్థ అయిన నిప్పన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ వీఎస్‌టీ టిల్లర్‌ ట్రాక్టర్స్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, సీపీసీఎల్‌ షేర్లను కొనుగోలు చేయగా, ఫెడరల్‌ మొగల్‌, జేకే సిమెంట్స్‌, అక్జో నోబెల్‌, ఐడీఎఫ్‌సీ షేర్లను విక్రయించింది.

 

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ.. కేర్‌ రేటింగ్స్‌, సెయిల్‌, అపోలో టైర్స్‌, రైట్స్‌ షేర్లను కొనుగోలు చేసింది. అదే విధంగా ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంకు, సుందరం ఫైనాన్స్‌, మైండ్‌ట్రీ, ఎస్కార్ట్స్‌ షేర్లను విక్రయించేసింది.

 

యాక్సిస్‌ మ్యాచువల్‌ ఫండ్‌..  రామ్కో సిమెంట్స్‌, నారాయణ హృదయాలయ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. అదే సమయంలో అవాస్‌ ఫైనాన్షియర్స్‌, స్ట్రయిడ్స్‌ ఫార్మా, డిష్‌ టీవీ, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ షేర్లను పూర్తిగా విక్రయించేసింది. You may be interested

టెల్కోలపై సుప్రీం కన్నెర!

Saturday 15th February 2020

(అప్‌డేటెడ్‌...) ధిక్కరణ చర్యలుంటాయని కంపెనీ అధిపతులకు హెచ్చరిక టెల్కోల అధినేతలకు సుప్రీం కోర్టు హెచ్చరిక ఏజీఆర్‌ బాకీల ఉత్తర్వుల ఉల్లంఘనపై సీరియస్‌ టెలికం శాఖ అధికారి తీరుపై ఆగ్రహం; నోటీసు సుప్రీంకోర్టును మూసేద్దామా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు మార్చి 17లోగా బకాయిలు కట్టేయాలని స్పష్టీకరణ కట్టకపోతే అంతా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయీల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన

ఎస్‌బీఐలో రిస్క్‌ కొద్దీ రాబడులు..: మోతీలాల్‌ ఓస్వాల్‌

Friday 14th February 2020

ఆర్థిక వృద్ధి కనిష్ట స్థాయిని చవిచూసిందని, వినియోగం ఇక్కడి నుంచి తప్పకుండా వృద్ధి చెందుతుందన్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ షా. డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కంపెనీల ఫలితాలు బాగున్నాయని, ఆటోమొబైల్‌ రంగానికి ఇంతకుమించి ప్రతికూలతలు ఉండకపోవచ్చన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.   టెలికం/ఏజీఆర్‌ భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ సంస్థలు మార్కెట్‌ వాటాను పెంచుకుంటాయి. ఇది ఈ కంపెనీల ‍స్టాక్స్‌ పనితీరులో

Most from this category