News


గత ఐదేళ్లలో లాభాలు తినిపించిన ఫండ్స్‌

Thursday 5th December 2019
personal-finance_main1575485492.png-30058

అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల (మ్యూచువల్‌ ఫండ్స్‌/ఏఎంసీలు) నిర్వహణలో ప్రస్తుతం మొత్తం రూ.25.60 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు ఇచ్చేందుకు ప్రతీ ఏఎంసీ ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కానీ, అందరూ రాణించలేరు. కొన్ని ఫండ్స్‌ మాత్రమే మార్కెట్‌కు ఎదురీది లాభాలు తినిపిస్తాయి. చార్ట్‌ల్లో కానీ, ఆయా విభాగాల్లో కానీ టాప్‌ పథకాలుగా నిలస్తుంటాయి. కనుక మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ ఫండ్స్‌ విషయంలో ముందస్తు అధ్యయనం చేయడం ఎంతో అవసరం. 

 

గత ఐదేళ్ల కాలంలో గణనీయమైన రాబడులు ఇచ్చిన ఫండ్స్‌ వివరాలను ఈటీమ్యూచువల్‌ ఫండ్స్‌ డాట్‌ కామ్‌ గుర్తించింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు కనీసం ఐదేళ్ల కాలవ్యవధి అవసరమన్న అంచనా ఆధారంగా.. ఐదేళ్ల కాల పనితీరును అధ్యయనం చేసి ఆయా మ్యూచువల్‌ ఫండ్స్‌ వివరాలు వెల్లడించింది. ఇవన్నీ యాక్టివ్‌గా నిర్వహణతో కూడిన ఫండ్స్‌. కనీసం రూ.1,000 కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులు కలిగినవి. పైగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒకే ఫండ్‌ మేనేజర్‌ నిర్వహణలో ఉన్నవాటిని ఈటీమ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంపికలోకి తీసుకుంది. ముఖ్యంగా గమనించాల్సినది ఏమిటంటే.. ఇవి మాత్రమే మంచి పనితీరు చూపించాయని భావించకూడదు. వీటి మాదిరే, వీటికంటే మెరుగైన రిటర్నులు ఇచ్చిన ఫండ్స్‌ కూడా ఉన్నాయి. కాకపోతే ఒకరే ఫండ్‌ మేనేజర్‌ దీర్ఘకాలం పాటు నిర్వహణ, అలాగే, నిర్వహణ ఆస్తుల పరిమాణం.. ఇలా ఎన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకోవడంతో ఇతర పథకాల వివరాలు ఇందులో లేవు.

 

రాబడుల్లో టాప్‌..
మ్యూచువల్‌ ఫండ్‌        ఫండ్‌ మేనేజర్‌    నిర్వహణ ఆస్తులు(రూ.కోట్లలో)    ఐదేళ్లరాబడుల శాతం
మిరే లార్జ్‌క్యాప్‌ ఫండ్‌            నీలేష్‌సురానా      14,917                                 12.22
మిరే ఎమర్జింగ్‌బ్లూచిప్‌          నీలేష్‌సురానా        8,219                                 16.94
యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ఈక్విటీ    జినేష్‌గోపానీ        20,425                                 13.07
ఎస్‌బీఐ ఫోకస్డ్‌ఈక్విటీ           ఆర్‌శ్రీనివాసన్‌        5,726                                 12.65
ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్‌              ఆర్‌శ్రీనివాసన్‌        2,704                                 17.24
పరాగ్‌లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ        రాజీవ్‌ఠక్కర్‌          2,205                                 12.42
కోటక్‌ స్టాండర్డ్‌ మల్టీక్యాప్‌       హర్షఉపాధ్యాయ     26,991                                12.33
డీఎస్‌పీ మిడ్‌క్యాప్‌               వినీత్‌సంబ్రే             6,348                                 12.39
కోటక్‌ ఎమర్జింగ్‌ఈక్విటీ          పంకజ్‌టిబ్రేవాల్‌       4,960                                 12.24 

   

నోట్‌: ఆర్టికల్స్‌ ఇన్వెస్టర్ల అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలకు సూచనగా, మార్గదర్శిగా భావించకూడదు. You may be interested

టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంపు..!

Thursday 5th December 2019

జనవరి 1 నుంచి అమలు జైసల్మేర్‌/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, సాధారణంగా మోడల్‌ ప్రాతిపదికన రూ.10,000-15,000 వరకు పెంపు ఉండనుండగా.. ఈసారి ఎంత మేర

ఈ స్టాక్స్‌లో రాబడులకు చాన్స్‌..!

Thursday 5th December 2019

ప్రభుత్వం ప్రకటించిన పలు ప్రోత్సాహక చర్యలు, ఇతర సానుకూల అంశాల ఆధారంగా ఈక్విటీ మార్కెట్లు అధిక బేస్‌ దిశగా అడుగులు వేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో కొనుగోళ్లు చేస్తుండడం కూడా కలిసొస్తోంది. అటు ఎఫ్‌ఐఐలు, ఇటు డీఐఐల పెట్టుబడులతో నూతన గరిష్టాలకు మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. కొన్ని అధిక వెయిటేజీ స్టాక్స్‌తో ప్రస్తుత ర్యాలీ నడుస్తోందని, ఇది తదుపరి ఆర్థిక సంవత్సరానికి కూడా

Most from this category