News


పోర్ట్‌ఫోలియో పెద్దదైతే చిక్కులే..!

Monday 3rd June 2019
personal-finance_main1559501584.png-26048

స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది నష్టాల గురించి చెబుతుండడం చాలా మందికి అనుభవమే. దీని వెనుక ఎన్నో కారణాలు ఉంటుంటాయి. అందరిలోనూ ఇవే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఒక్కో ఇన్వెస్టర్‌ పదుల సంఖ్యలో షేర్లను తమ పోర్ట్‌ఫోలియోలో భాగంగా నిర్వహిస్తుంటారు. ఒక్కో కంపెనీలో కొంత చొప్పున, ఆకర్షణీయంగా కనిపించే ప్రతీ షేరు వెనుక పరుగులు పెడుతుంటారు. దీనివల్ల సంపద సృష్టి కష్టమవుతుందంటున్నారు వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ ధీరేంద్ర కుమార్‌. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లోని స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల వివరాలను ఇటీవల గమనించిన ఆయన, వారు అవసరానికంటే అధిక సంఖ్యలో కలిగి ఉన్నట్టు పేర్కొన్నారు. 

 

సైజు పరంగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్టు ధీరేంద్ర కుమార్‌ తెలిపారు. ఓ నమూనాలో భాగంగా 50 స్టాక్స్‌ కంటే ఎక్కువ కలిగిన పోర్ట్‌ఫోలియోల్లో సగం మేర పరిశీలించినట్టు పేర్కొన్నారు. 50 నుంచి 100, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఒక్కో ఇన్వెస్టర్‌ దగ్గర షేర్లుండడం చూసి షాక్‌కు గురయ్యయాని, ఎందుకంటే ఇంత భారీ సంఖ్యలో స్టాక్స్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు కూడా కష్టమేనన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌కు నిపుణులైన మేనేజర్లు, పరిశోధనా బృందం ఉంటుందని గుర్తు చేశారు. కనీసం తమ వ్యాల్యూ రీసెర్చ్‌సంస్థ స్టాక్‌ అడ్వైజర్‌ సర్వీస్‌లోనూ రికమండ్‌ చేసిన స్టాక్స్‌ 38కే పరిమితమైనట్టు ధీరేంద్ర కుమార్‌ తెలిపారు.  

 

ఇంత సంఖ్యలో స్టాక్స్‌ను ఇన్వెస్టర్లు కలిగి ఉండడం అనేది తగినంత పరిశోధన, అధ్యయనం ఆధారంగా చేసినది మాత్రం కాదన్నారు ధీరేంద్ర కుమార్‌. మరీ ముఖ్యంగా వీటిల్లో ఎక్కువ శాతం పెట్టుబడులు ఇటీవల చేసినవేనని, పైగా స్వల్ప కాలం కోసం కొన్నవేనని ఆయన తెలియజేశారు. ఇక స్టాక్స్‌ను వాటి కదలికల ఆధారంగా ఎంపిక చేసుకోవడం మరింత పెద్ద సమస్యగా అభివర్ణించారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్‌, స్మాల్‌ మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. ఆ స్టాక్స్‌ కూడా ఇటీవలే పెరగడం మొదలైనవని, వారి పెట్టుబడుల వెనుక కారణమిదేనన్నట్టు అభిప్రాయపడ్డారు. కొందరి వద్ద లార్జ్‌క్యాప్‌ ఉన్నా కానీ అవి కూడా ఇటీవలే పెరిగినవిగా పేర్కొన్నారు. 

 

ఒక ఇన్వెస్టర్‌ ఎన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు..? అంటే దీనికి ఇంత అనే కచ్చితమైన నంబర్‌ అనేది సమాధానం కాదన్నారు ధీరేంద్ర కుమార్‌. విడిగా ఇన్వెస్టర్‌ అవగాహన, విశ్లేషణ సామర్థ్యాలపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఓ ఇన్వెస్ట్‌ ఓ పెట్టుబడి వెనుక లాజిక్‌ను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే ఆ పెట్టుబడి చేయకుండా ఉండిపోవడమే ఉత్తమంగా సూచించారు. విడిగా ఇన్వెస్టర్‌ వద్ద రెండు లేదా మూడు లేదా పది ఉండొచ్చు కానీ, 50 స్టాక్స్‌ అయితే ఉండడం అసాధారణమేనన్నారు. అంతిమంగా నంబర్‌ కాకుండా ఇన్వెస్టర్‌ సామర్థ్యంపైనే పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఉండాలన్న సంఖ్య ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.You may be interested

మిడ్‌క్యాప్స్‌ సంబరం ఇక!

Monday 3rd June 2019

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ పీఈ, నిఫ్టీ 50పీఈ మధ్య అంతరరం మే నెలలో ప్రతికూల జోన్‌లోకి వెళ్లింది. 48 నెలల కాలంలో మొదటి సారి ఇలా జరగడం. ఇది మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీకి సంకేతంగా నిపుణులు పేర్కొంటున్నారు. చివరి సారిగా నిఫ్టీ-50కి, మిడ్‌క్యాప్‌ సూచీకి మధ్య అంతరం ప్రతికూల జోన్‌లోకి రావడం 2015 మే నెలలో జరిగింది. ఆ తర్వాత మిడ్‌క్యాప్స్‌లో మంచి ర్యాలీ చోటు చేసుకున్న విషయాన్ని నిపుణులు

ఇక ఫర్టిలైజర్స్‌ కంపెనీలకు అగ్ర తాంబూలం!?

Monday 3rd June 2019

సాగు రంగం, రైతుల ఆదాయం పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ.6,000 సాయాన్ని గతంలో​ఐదు ఎకరాల రైతులకే పరిమితం చేయగా,  మోదీ సర్కారు రెండో విడతలో దీన్ని రైతులు అందరికీ అమలు చేయాలని నిర్ణయించిన విషయం గమనార్హం. ఇప్పటి వరకు ఎరువుల కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీలను ఇస్తుంటే, అవి రైతులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌

Most from this category