News


మార్కెట్లు పడిపోతున్నాయా... వర్రీ వద్దు..!

Sunday 1st September 2019
personal-finance_main1567360921.png-28135

స్టాక్‌ మార్కెట్లు పడిపోతుంటే ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు చేసే పని... దూరంగా వెళ్లిపోవడం. కానీ, ఈక్విటీ మార్కెట్లో దీర్ఘకాలం పాటు కొనసాగాలంటే ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదంటున్నారు నిపుణులు. మార్కెట్లు పడిపోతుంటే... బేర్లు అమ్మకాలు చేస్తుంటే అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. మార్కెట్లో సంక్షోభాన్ని ప్రతీ ఒక్క ఇన్వెస్టర్‌ ఎందుకు ఆహ్వానించాలన్నది ఎడెల్వీజ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈవీపీ రాహుల్‌ జైన్‌ తెలియజేశారు...

 

రీబ్యాలన్స్‌ 
మీ బ్యాలన్స్‌ను పునర్నించుకునేందుకు మార్కెట్‌ పతనమే చక్కని సందర్భం. పనితీరు సరిగా లేని పెట్టుబడుల నుంచి బయటపడి, మంచి రాబడులకు అవకాశం ఉన్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఎందుకుంటే ఇదే సమయంలో ఇతర అవకాశాలు కూడా ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి. చక్కని అవకాశాలను వినియోగించుకుని, మార్కెట్‌ పతనాల నుంచి మంచిగా పైకి వచ్చేందుకు వీలవుతుంది. నిజానికి మార్కెట్‌ పతనాలే పోర్ట్‌ఫోలియోకు పరీక్ష వంటివి. అయితే, లావాదేవీ వ్యయాలు, పన్నుల అంశాలను దృష్టిలో ఉంచుకుని రీబ్యాలన్స్‌పై నిర్ణయం తీసుకోవడం మరిచిపోవద్దు. రీబ్యాలన్స్‌ అంటే ఉన్న వాటిల్లో కొన్ని విక్రయించి, మరికొన్నింటిని కొనుగోలు చేయడం. స్టాక్స్‌ అయినా, మ్యూచువల్‌ ఫండ్స్‌ అయినా అంతే. కానీ, వీటిపై చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, స్వల్ప కాల, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కూడా వర్తిస్తుంది. 

 

తక్కువ ధరల్లో...
అస్థిరతలు పెరిగిన సమయంలో చురుకైన పెట్టుబడుల నిర్వహణ విధానాలను అనుసరించాలి. రిస్క్‌ను తగ్గుకుని రాబడులు వచ్చే విధంగా విధానాలను అనుసరించడం, ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకోవడం చేయాలి. 

 

ధోరణలు...
మార్కెట్‌ పనతం అవుతుంటే కంగారు పడిపోకుండా కారణాలు ఏంటన్నది తెలుసుకోవాలి. ఈ సందర్భంలో చెత్త వార్తలను పట్టించుకోవద్దు. అ‍స్థిరతల తర్వాత మార్కెట్‌ రికవరీలో అన్నీ కోలుకోవు. ఫండమెంటల్స్‌ బలహీనంగా ఉన్న స్టాక్స్‌ మార్కెట్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా వెనుకనే ఉండిపోతాయి. అందుకే కంపెనీ, ఆయా రంగంపై పూర్తి అధ్యయనం తర్వాత వాటిపై నిర్ణయం తీసుకోవాలి.

 

విజయం..
పెట్టుబడి పెట్టే ముందు... ఆ పెట్టుబడి వృద్ధి అవకాశాలపై దృష్టి సారించాలి. మార్కెట్‌ పతనాల తర్వాత మీ పెట్టుబడుల విలువ వేగంగా రికవరీ అవ్వాలి. సమస్యల నుంచి పారిపోకుండా, మార్కెట్‌ పతనంలో పరిష్కారాలపై దృష్టి పెట్టి విజయం సాధించాలి. You may be interested

ఈ స్టాక్స్‌తో మీ నోరు తీపి..!

Sunday 1st September 2019

చక్కెర రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పూర్తి మద్దతు... ఈ రంగానికి చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే వారికి మంచి రాబడులు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటోంది ఐసీఐసీఐ డైరెక్ట్‌. ఎందుకంటే ఒక వైపు చక్కెరకు మద్దతు ధరలు ప్రకటించడంతోపాటు, మరోవైపు ఎగుమతులకు సబ్సిడీ కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. ఇంకోవైపు పెట్రోల్‌లో ఎథనాల్‌ బ్లెండింగ్‌ను 2022 నాటికి 10 శాతానికి, ఆ తర్వాత 2030 నాటికి 20 శాతానికి పెంచాలని కేంద్రం

ఈ నెల 1 నుంచి ఇవి మారాయి.. తెలుసా?

Sunday 1st September 2019

సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులను గమనించినట్టయితే..   ఇల్లు కొనుగోలు చేసే సమయంలో టీడీఎస్‌ ఒకటి ఉంటుందని తెలుసు కదా. అయితే, ఇకపై మీరు ఎంచుకునే క్లబ్‌ మెంబర్‌షిప్‌, కారు పార్కింగ్‌ వంటి వాటికి చేసే చెల్లింపులు కూడా టీడీఎస్‌ పరిధిలోకి వస్తాయి.  ప్రతీ అవసరానికి ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక ఏడాదిలో నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌

Most from this category