News


గృహ రుణాలపై ఎస్‌బీఐ న్యూఇయర్‌ గిఫ్ట్‌

Monday 30th December 2019
personal-finance_main1577696555.png-30531

వడ్డీ రేటులో 25 బేసిస్‌ పాయింట్ల కోత
తగ్గనున్న నెలసరి వాయిదా మొత్తాలు

పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) గృహ రుణ వినియోగదారులకు కొత్త ఏడాది శుభవార్తను మోసుకొచ్చింది. ఎస్‌బీఐ.. తాజాగా హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్లు(పావు శాతం) కోత పెట్టింది. దీంతో వార్షిక ప్రామాణిక వడ్డీ రేటు(ఈబీఆర్‌) ప్రస్తుత 8.05 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గనుంది. రేట్ల తగ్గింపును 2020 జనవరి 1 నుంచీ అమలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీంతో ఇప్పటికే ఈబీఆర్‌ ఆధారంగా గృహ రుణాలు తీసుకున్న కస్టమర్లు, ఎస్‌ఎంఈలు 25 బేసిస్‌పాయింట్లమేర వడ్డీ రేటులో లబ్ది పొందనున్నట్లు వివరించింది. కొత్తగా గృహ రుణాలు పొందేవారికి గృహ రుణ వడ్డీ రేటు 7.9 శాతం నుంచి ప్రారంభంకానున్నట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. ఇటీవలి వరకూ ఈ రేటు 8.15 శాతంగా అమలవుతోంది. 

రెపో రేటుకు అనుగుణంగా
దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ 5.15 శాతానికి పరిమితం చేసింది. దీంతో రెపో రేటుకు అనుసంధానమైన ఈబీఆర్‌ను ఎస్‌బీఐ ఆమేర సర్దుబాటు చేసినట్లు తెలియజేసింది. రెపో రేటుకు 265 బేసిస్‌ పాయింట్లు(2.65 శాతం) జత కలిపి ఎస్‌బీఐ ఈబీఆర్‌ను నిర్ణయిస్తుంది. దీనికి అదనంగా కస్టమర్ల గృహ రుణ రేట్లకు 10-75 బేసిస్‌ పాయింట్ల పరిధిలో చార్జీని విధిస్తుంది. అక్టోబర్‌లో ఆర్‌బీఐ 0.25 శాతం కోత ద్వారా రెపో రేటును 5.15 శాతానికి చేర్చిన విషయం విదితమే. వెరసి రెపో రేటు 2010 మార్చి తదుపరి కనిష్టస్థాయికి చేరింది. రెపో రేటులో మార్పులకు అనుగుణంగా బ్యాంకులు ప్రతీ మూడు నెలలకోసారి ఈబీఆర్‌ను సమీక్షించవలసి ఉంటుంది. కాగా.. ఈ నెల 10న ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రేటును 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో ఎంసీఎల్‌ఆర్‌ 7.9 శాతానికి దిగివచ్చింది. తద్వారా ఈ ఏడాది ఎస్‌బీఐ 8సార్లు ఎంసీఎల్‌ఆర్‌లో కోతను అమలు చేసినట్లయ్యింది. 



You may be interested

ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌!

Monday 30th December 2019

బుల్లిష్‌ అంటున్న నిపుణులు  రెండేళ్ల తర్వాత ఆటో సూచీలో బుల్లిష్‌ సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమ్మకాల్లో రికవరీ ఉంటుందన్న ఆశల నడుమ ఆటో స్టాకులు క్రమంగా పాజిటివ్‌ ధృక్పథంలోకి మారుతున్నాయంటున్నారు. తాజాగా నిఫ్టీ ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2016 మే తర్వాత నిఫ్టీ ఆటో సూచీలో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడడం ఇదే తొలిసారి. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖ దిగువ నుంచి పైకి

వారం గరిష్టానికి టాటామోటర్స్‌

Monday 30th December 2019

టాటా మోటర్స్‌ షేరు  సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో  వారం రోజుల గరిష్ట స్థాయిని అందుకుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.177.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరకు కొనుగోలుకు ఆసక్తి చూపడంతో ఒకదశలో 2.69శాతం పెరిగి రూ.180.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.1:07ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.176.15)తో

Most from this category