News


సిప్‌తో రిస్కు తగ్గించుకోండి!

Tuesday 27th August 2019
personal-finance_main1566888017.png-28047

చిన్న స్టాకుల్లో పెట్టుబడులపై నిపుణుల సలహాలు
గత కరెక‌్షన్‌లో భారీగా పతనమైన చిన్నస్టాకుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే  ఇన్వెస్టర్లు సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) మార్గాన్ని ఎంచుకోవాలని వెల్త్‌ మేనేజర్లు సూచిస్తున్నారు. గతేడాది జనవరి నుంచి చాలా చిన్న స్టాకులు దాదాపు 70 శాతం మేర పతనమయ్యాయి. దీంతో వీటి వాల్యూషన్లు బాగా చౌకగా మారాయి. అయితే ఎర్నింగ్స్‌ ఆందోళనల నేపథ్యంలో వీటిలో వెనువెంటనే భారీ రికవరీ ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అందువల్ల ఇలాంటి షేర్లలో పెట్టుబడులు ఒకేసారిగా పెట్టేబదులు సిప్‌ మార్గంలో పెట్టడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచిస్తున్నారు. స్మాల్‌క్యాప్‌ సిప్స్‌ ఇన్వెస్టర్లకు రిస్కును తగ్గిస్తాయి. ఈ తరుణంలో 5-7 ఏళ్ల కాలానికి వీటిని పరిశీలించవచ్చని ప్రభుదాస్‌ లీలాధర్‌ బ్రోకరేజ్‌ ప్రతినిధి దీపక్‌ చల్లాని చెప్పారు. ఈ ఫండ్స్‌ గతంలో ఇన్వెస్టర్లకు నిరాశనిచ్చాయి. గత ఏడాది కాలంలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ 18.76 శాతం నెగిటివ్‌ రాబడి నమోదు చేసినట్లు గణాంకాలు చూపుతున్నాయి. అయితే పదేళ్ల కాలానికి చూస్తే ఈ ఫండ్స్‌ దాదాపు 13 శాతం రాబడినిచ్చాయి. అందువల్ల దీర్ఘకాలానికి వీటిని ఎంచుకోవచ్చన్నది నిపుణుల మాట.


బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 40 శాతం పతనమైంది. ఇప్పుడు బాటమ్‌ అవుట్‌ సంకేతాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. సూచీలో 80 శాతానికి పైగా స్టాకులు తమ గరిష్ఠాల నుంచి దాదాపు 30 శాతం దిగువన ట్రేడవుతున్నాయి. స్మాల్‌క్యాప్‌ సూచీ వచ్చే మూడేళ్లలో కనీసం 20 శాతం వార్షిక రాబడినిస్తుందని మార్కెట్‌ నిపుణుల అంచనా. అందువల్ల ఈ సమయంలో నాణ్యమైన కంపెనీల షేర్లని, వాల్యూషన్ల కారణంగా పతనమైనవాటిని ఎంచుకోవాలని ఎస్‌బీఐ ఎంఎఫ్‌ ఈడీ నవనీత్‌మునోత్‌ సూచించారు. మార్కెట్లో అనుకోకుండా వచ్చే ఆటుపోట్లను తట్టుకోవడానికి సిప్‌ మార్గం సురక్షితమైనదని చెప్పారు. అయితే ఎకానమీలో మందగమన పవనాలు వీస్తున్నందున ఒకమారు మొత్తం పెట్టుబడులు పెట్టకుండా సమయానుగతంగా నిర్ణయాలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఎకానమీలో రికవరీ సంకేతాలు కనిపించిన తర్వాతే పెట్టుబడులు పెట్టడం మంచిదని క్యాపిటల్‌ అడ్వైజర్‌ వ్యవస్థాపకుడు జిగ్నేశ్‌ షా సూచిస్తున్నారు. 

 You may be interested

లాభాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 27th August 2019

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు వరుసగా రెండోరోజూ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల నిధుల కేటాయిస్తున్నట్లు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఈ రంగ షేర్లలో ర్యాలీ నెలకొంది. తాజా నిన్న ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదం వేయడం కూడా కలిసొచ్చింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90వేల కోట్ల డివిడెండు

ఆరేళ్ల గరిష్టం నుంచి దిగొచ్చిన పసిడి ధర

Tuesday 27th August 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర ఆరేళ్ల గరిష్టం నుంచి దిగివచ్చింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య పరిష్కార చర్చలు తెరపైకి రావడం ఇందుకు తోడ్పడింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.25డాలరుతో 1,538.45డాలర్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. అయితే.., మంగళవారం వాణిజ్య చర్చలపై చైనా  అమెరికాకు గందరగోళ సంకేతాలను పంపడంతో పాటు అమెరికా చేసే డిమాండ్లకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చైనా స్పష్టత చేసింది. ఈ వివాస్పద

Most from this category