News


స్మార్ట్‌ ఇన్వెస్టర్‌ నామ సంవత్సరం

Monday 31st December 2018
personal-finance_main1546233358.png-23328

  • 25 లక్షల కోట్లకు ఫండ్‌ అసెట్స్‌
  • 2.5 కోట్లకు సిప్‌ ఖాతాలు

    పెట్టుబడుల విషయంలో దేశీ ఇన్వెస్టర్లు మరింత స్మార్ట్‌గా వ్యవరించడం 2018 సంవత్సరంలో అత్యంత సానుకూలాంశం. అక్టోబర్‌ విషయమే తీసుకుంటే.. సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్‌)లోకి రూ. 7,985 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. ఇది గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 42 శాతం అధికం కావడం గమనార్హం. బలహీన రూపాయి. ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పరిస్థితుల్లో కూడా ఇలా సిప్‌లలో పెట్టుబడులు రావడం .. మార్కెట్లపై ఇన్వెస్టర్లలో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు సంబంధించి దేశీయంగా సిప్‌ ఖాతాల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ యాంఫీ గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా సగటున ప్రతి నెలా 10 లక్షల పైచిలుకు సిప్‌ ఖాతాలు జతయ్యాయి. సగటు పెట్టుబడి విలువ రు. 3,200గా ఉంది. సూచీలపై ఆధారిత పాసివ్‌ ఫండ్స్‌ పరిమాణం కూడా క్రమంగా పెరుగుతోంది. 2008లో రూ. 9,000 కోట్లుగా ఉన్న ఈ విభాగం.. 2018 ఆగస్టు నాటికి రూ. 1 లక్ష కోట్లకు చేరింది. మొత్తం రూ. 25 లక్షల కోట్ల దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్స్‌లో ఇది సుమారు 5 శాతం మాత్రమే అయినప్పటికీ .. క్రమంగా వృద్ధి చెందుతుండటం గమనార్హం. బెంచ్‌మార్క్‌ రాబడులను అధిగమించడంలో యాక్టివ్‌ ఫండ్స్‌ దీర్ఘకాలికంగా మంచి చరిత్రే ఉంది.

పారదర్శకతకు సెబీ పెద్ద పీట..
మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో పారదర్శకత పెంచే దిశగా.. వ్యయాల నిష్పత్తులను తగ్గించడం, ఫండ్‌ పథకాలను మరింత మందికి చేరువ చేసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు చర్యలు తీసుకుంటోంది. స్కీముల పునర్‌వర్గీకరణ వంటివి పాసివ్‌ విభాగానికి మేలు చేసేవే. ఇక, డైరెక్టర్‌ ప్లాన్లపై కూడా సెబీ ప్రధానంగా దృష్టి పెడుతుండటం సైతం ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌కు ప్రయోజనకరం. ఇటు యాక్టివ్, అటు పాసివ్‌ వ్యూహాలతో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో.. మధ్యేమార్గంగా ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకోవచ్చు.

మేలు కలయిక..
పెట్టుబడి సాధనాల్లో పసిడి కూడా రాణించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సాధనాల మేలుకలయికతో పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకుంటే మంచిది. ఈక్విటీలు, ఫిక్సిడ్‌ ఇన్‌కంతో పాటు పసిడిని కూడా పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు శ్రేయస్కరం. ఇవన్నీ కూడా డిజిటల్‌ విధానంలో లభ్యమవుతుండటం, చెల్లింపులు కూడా డిజిటల్‌ విధానంలో జరిపే సౌలభ్యం ఉండటంతో ఈ సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి.

కరెక్షన్లతో అవకాశాలు ..
మార్కెట్లలో ఒడిదుడుకులు సహజం. వీటికి సిద్ధపడి ఉండాలి. వివిధ దశల్లో మార్గనిర్దేశనం చేయగలిగే మంచి అడ్వైజర్‌ సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. తీవ్ర ఒడిదుడుకుల్లో కూడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించేలా ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు కీలకపాత్ర పోషించారు. మార్కెట్లు పడిపోయినప్పుడు భయపడిపోకుండా కరెక్షన్లను అవకాశాలుగా మల్చుకునేలా, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించేలా ప్రోత్సహించడం సానూకూలాంశం. మొత్తం మీద చూస్తే 2018 మ్యూచువల్‌ ఫండ్‌కు సానుకూల సంవత్సరంగా సాగింది. వివేకవంతంగా దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇకపై కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలోనూ ఇన్వెస్టర్లు క్రమశిక్షణతో, దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించడం ద్వారా సంపదను సమకూర్చుకోగలరన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.You may be interested

స్వల్పంగా పెరిగిన రూపాయి

Monday 31st December 2018

వివిధ కరెన్సీలతో డాలరు బలహీనపడిన నేపథ్యంలో సోమవారం భారత్‌ రూపాయి సైతం ఇతర ఆసియా కరెన్సీలబాటలోనే బలపడింది. ముంబైలోని ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే‍్ఛంజ్‌ మార్కెట్లో డాలరుతో పోలిస్తే మారకపు విలువ 13 పైసలు పెరిగి 69.81 స్థాయికి చేరింది. అయితే 2018లో ఆసియా కరెన్సీల్లోకెల్లా అత్యధికంగా నష్టపోయింది రూపాయే. ఈ ఏడాది ఇది 9 శాతం పతనమయ్యింది. 2011లో 15.8 శాతం నష్టపోయిన తర్వాత రూపాయి అధ్వాన్న పనితీరు కనపర్చడం ఈ

హ్యాపీ న్యూయర్‌ షేర్లవి..!

Monday 31st December 2018

- 2019కి బ్రోకరేజీ సంస్థల సిఫారసులు - ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనా - సార్వత్రిక ఎన్నికలు, ముడి చమురు ధరలే కీలకం - ఫెడ్‌ రేట్లు పెరగనుండటమూ ప్రభావం చూపిస్తుంది - వినియోగ, వ్యవసాయ, ఐటీ షేర్లు బాగుంటాయి - బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు పెరిగే అవకాశాలు - ఆటో రంగం మాత్రం అంతగా పెరగకపోవచ్చు నిఫ్టీ     జనవరి 1- 2018 : 10,435        జనవరి 1-2019:  10,859   - 424    సెన్సెక్స్‌     జనవరి 1- 2018

Most from this category