News


చిన్న మొత్తమే... అయినా భారీ వ్యత్యాసం

Tuesday 11th June 2019
personal-finance_main1560191780.png-26210

వేతన జీవులకు నిర్ణీత కాలానికి ఎంతో కొంత వేతన పెంపు ఉంటుంది. వ్యాపార ఆదాయంలోనూ చాలా మంది వృద్ధిని చూస్తున్న వారుంటారు. పెరిగే ఆదాయం మీ జీవన ప్రమాణాలను కూడా పెంచుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు తగ్గ ఆర్థిక ప్రణాళిక కూడా ఎంతో అవసరం. వేతన పెంపు లేకపోతే కచ్చితంగా పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఏటా వేతన పెంపు అన్నది ఎంతో అవసరం. ఎందుకంటే ఏటేటా ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ తరిగిపోతుంటుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణ రేటు దీర్ఘకాలిక సగటు ఆధారంగా 4-5 శాతంగా ఉంది. కనుక ఏటా ఎంతలేదన్నా మీ ఆదాయం హీనపక్షం 5 శాతమైనా పెరగాల్సి ఉంటుంది. అప్పుడు మీ జీవన ‍ప్రమాణాలు మునుపటి మాదిరే కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అది ప్రతికూల పరిస్థితికి దారితీస్తుంది. 

 

మరీ ముఖ్యంగా జీవన ప్రణాళికల్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ముఖ్యంగా ఏటేటా ఆదాయం పెంచుకోవడంతోపాటు ఆ పెరిగే ఆదాయానికి తగినట్టుగా సిప్‌ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలు కల్పించే సాధనమే సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌). ఏటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్ని పెంచుకోవడం వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీరు నిర్ణీత కాలానికి సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్న దాని కంటే ఎక్కువ సమకూరేందుకు దారితీస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో పడిపోయినా, లేదా ఆశించినంత సమకూరకపోయినా (రాబడుల రేటు తగ్గిన సందర్భాల్లో), ఆ లోటును, పెంచుకుంటూ వెళ్లే సిప్‌ మొత్తం భర్తీ చేయగలదు.  

 

ఉదాహరణకు మీరు రూ.కోటి మొత్తాన్ని సమకూర్చుకోవాలనుకున్నారు. ప్రతీ నెలా రూ.20,000ను సిప్‌గా ఇన్వెస్ట్‌ చేద్దామనుకున్నారు. ఏటా 12 శాతం రాబడుల ఆధారంగా మీరు అనుకున్నంత సంపద సమకూరడానికి 15 ఏళ్లు పడుతుంది. అదే మీరు ముందుగా అనుకున్న రూ.20,000 సిప్‌ను ఏటా 10 శాతం పెంచుతూ ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే... రూ. కోటి కేవలం 13 ఏళ్లలోనే సమకూరుతుంది. అలాగే, ప్రతీ నెలా రూ.20,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే 12 శాతం రాబడి అంచనా ఆధారంగా రూ.7.06 కోట్ల సంపద సమకూరుతుంది. దీనికి బదులు ఏటా మీ సిప్‌ మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ ఇన్వెస్ట్‌ చేశారనుకోండి... అప్పుడు సమకూరే మొత్తం రూ.15.01 కోట్లు అవుతుంది. ఏటా పెంచుతూ వెళ్లేది 10 శాతమే అయినా, చివర్లో సమకూరే మొత్తం నూరు శాతం అదనం. పెంచే మొత్తం చిన్నదే అయినా దీర్ఘకాలంలో వ్యత్యాసం అంత భారీగా ఉంటుందని ప్రతీ ఇన్వెస్టర్‌ తెలుసుకోవాలి. భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం వల్ల ద్రవ్యోల్బణ ప్రభావంపై మీదే పైచేయి అవుతుంది. You may be interested

ఈ ఐదూ పెట్టుబడులకు మంచి ఆప్షన్లు

Tuesday 11th June 2019

ఎన్నో సవాళ్లతో కూడిన ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే వారు మూలాలు బలంగా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఈ కంపెనీలు పుంజుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మంచి కంపెనీలను ఎంచుకోవాలంటే అందుకోసం వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, ఎర్నింగ్స్‌, మార్జిన్లు, రిటర్న్‌ రేషియోలు, ఎబిట్డా ఇవన్నీ పరిగణనలోకి

యాక్సిస్‌ నుంచి టాప్‌ రికమండేషన్లు

Monday 10th June 2019

మిడ్‌టర్మ్‌ కోసం యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ నాలుగు స్టాకులను రికమండ్‌ చేస్తోంది. 1. టాటా గ్లోబల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 266. స్టాప్‌లాస్‌ రూ. 242. వీక్లీ చార్టుల్లో దీర్ఘకాలిక నిరోధ శ్రేణి రూ. 246- 248ను ఛేదించింది. ఈ బ్రేకవుట్‌కు మంచి వాల్యూం మద్దతు కూడా దొరికింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ ఇండికేటర్లు పాజిటివ్‌గా కదలాడుతున్నాయి. ప్రస్తుతం స్టాకు తన 20, 50, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా

Most from this category