STOCKS

News


మీ చిన్నారుల భవిష్యత్తుకు ‘సిప్‌’

Friday 16th August 2019
personal-finance_main1565893881.png-27793

తల్లిదండ్రులకు తమ పిల్లల విషయంలో ఎన్నో ఆనందాలు ఉంటుంటాయి. అదే సమయంలో బోలెడన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కేవలం వారి ప్రస్తుత అవసరాలను చూడడమే కాకుండా, వారి భవిష్యత్తుకు తగిన ప్రణాళికలు కూడా రెడీ చేసుకోవాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులు, భవిష్యత్తులో విద్య పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూలు ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, రవాణా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఎంతగానో ప్రభావితం చేస్తాయనడం ఎంత మాత్రం అసత్యం కాదు. ‍పిల్లలకు సంబంధించి ప్రతీ తల్లిదండ్రికి తప్పని ఈ బాధ్యతలకు సన్నద్ధం కావడమే మంచి మార్గం. 


లక్ష్యాలు, అవసరాలు
ముందు లక్ష్యాలపై స్పష్టతకు వస్తే, ఆ తర్వాత విడిగా ఒక్కో లక్ష్యానికి తగిన ప్రణాళిక రూపొందించుకోవచ్చు. మీ పిల్లల ఉన్నత విద్య, వివాహం ఈ తరహా లక్ష్యాలు. ఒక్కసారి వీటన్నింటినీ ఒక లిస్ట్‌గా రాసుకున్న తర్వాత, ఒక్కో లక్ష్యానికి ఎంత కాలం ఉంది, ఎంత అవసరం అవుతుందో కూడా అంచనా వేసుకోవాలి. అయితే, చాలా మందికి ఈ విషయమై అవగాహన ఉండదు. కానీ, అంచనాతో ఆ అవసరాన్ని అధిగమించే మార్గాలను చూసుకోవడం వీలవుతుందన్నది మర్చిపోవద్దు. 


ఎంత మొత్తం కావాలి
ఈ తరహా భవిష్యత్తు లక్ష్యాలకు అవరమైన మొత్తాన్ని అంచనా వేసేందుకు పలు మార్గాలు ఉన్నాయి. అందుకు ఈ రోజు రూపాయి విలువకు ద్రవ్యోల్బణ రేటును ముడిపెట్టి లెక్కించడం. ఏటా పెరిగే విద్యా కోర్సుల ఫీజులు, వస్తు, సేవల ధరల ప్రభావమే ద్రవ్యోల్బణం. ఉదాహరణకు మీ చిన్నారికి భవిష్యత్తులో చెప్పించాలనుకుంటున్న కోర్సుకు నేడు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అనుకుంటే, పదేళ్ల తర్వాత అదే కోర్సు వ్యయం రూ.21.59 లక్షలు అవుతుంది. ఏటా విద్యా వ్యయాలు 8 శాతం పెరుగుతాయన్న అంచనా ఆధారంగా వేసిన లెక్క ఇది. విద్యా ద్రవ్యోల్బణం 8-15 శాతం స్థాయిలో ఉంది మరి. ఆన్‌లైన్‌లో ఎన్నో కాంపౌండెడ్‌ కాలిక్యులేటర్లు, ద్రవ్యోల్బణ ‍ప్రభావాన్ని మినహాయించి చెప్పేవి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. 


నిధి సమకూర్చుకోవడం
ఒక్కసారి లక్ష్యం, అందుకు అవసరమైన మొత్తాన్ని నిర్ణయించుకున్న తర్వాత అందుకు చేరుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రతీ నెలా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. ఒకవేళ భవిష్యత్తు అవసరాలకు సరిపడా మొత్తం నేడే సిద్ధంగా ఉంటే, ఆ మొత్తాన్ని డెట్‌ ఫండ్స్‌లో వెంటనే ఇన్వెస్ట్‌ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చొప్పున (సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా) ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి 18 నెలల కాలంలో మళ్లించుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇచ్చేవి ఈక్విటీ సాధనాలే. అలాగే, నిర్దేశిత లక్ష్యానికి మళ్లీ 18 నెలల మందు నుంచి క్రమంగా వెనక్కి తీసుకోవడం (సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌) ఆరంభించాలి.You may be interested

ప్రధాని ప్రకటనలు... ఈ రంగాలపై ప్రభావం!

Friday 16th August 2019

ప్రధాని నరేంద్రమోదీ 73వ స్వాతంత్ర్యదినం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశాభివృద్ధి, ఆర్థిక రంగం, వ్యాపార, పర్యాటకం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం ఇలా ఎన్నో రంగాలను స్పృశించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం ఇందులో కీలకమైనది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నది ప్రధాని ప్రకటన సారాంశం. అలాగే, రసాయన ఎరువుల వినియోగ వాడకాన్ని రైతులు ఆపేయాలని కూడా ప్రధాని కోరారు. విదేశాల్లోని అందాలు చూడడానికి బదులు... దేశంలోనే ఉన్న

ఏడాది కోసం ఐదు స్టాక్స్‌

Thursday 15th August 2019

దీర్ఘకాలానికి మంచి పోర్ట్‌ఫోలియో రెడీ చేసుకునేందుకు ఇప్పటి నుంచి వచ్చే మూడు నెలల కాలం అనువైనదని చాలా మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. దేశ ఈక్విటీ మార్కెట్లు గత ఏడాదిన్నరగా అస్థిరతల్లో ఉండడం, ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఏడాదికి పైగా బేరిష్‌లోకి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కనుక వీటిల్లో నాణ్యమైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని క్రమంగా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచిస్తు‍న్నారు. రెండేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు వేచి చూసే

Most from this category