News


సిప్‌ పెట్టుబడులు తగ్గాయ్‌: ఏఎంఎఫ్‌ఐ

Friday 8th November 2019
personal-finance_main1573208332.png-29453

 సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్‌ఫ్లో అక్టోబర్‌ నెలలో  స్వల్పంగా తగ్గిందని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ఇండియా(ఏఎంఎఫ్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెలలో సిప్‌ల ప్రవాహం రూ. 8,262 కోట్ల నుంచి రూ. 8,245 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కానీ మొత్తం సిప్‌ ఖాతాలు ఈ నెలలో 4.74 లక్షలు పెరిగి 2.18 కోట్లకు చేరింది. అంతేకాకుండా సిప్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తి(ఏయూఎం) రూ. 14,600 కోట్లు పెరిగి, రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ సిప్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తి రూ. 3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదొక సానుకూల సంకేతం’ అని ఏఎంఎఫ్‌ఐ సీఈఓ ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ అన్నారు. 
    ఈక్విటీ ఫండ్స్‌ పథకాలలోకి వచ్చిన నిధులు, గత నెలతో పోల్చుకుంటే 8.8 శాతం తగ్గి రూ. 6,026 కోట్లకు చేరుకున్నాయి. ఇది సెప్టెంబర్‌ నెలలో రూ. 6,609 కోట్లుగా ఉండడం గమనార్హం. అక్టోబర్‌ నెలలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ. 1,182.25 కోట్ల నిధులు రాగా, బహుళ క్యాప్స్‌లోకి రూ. 1,344.86 కోట్లు, మిడ్‌ క్యాప్స్‌లోకి రూ. 1,091 కోట్లు, స్మాల్‌ క్యాప్స్‌లోకి రూ. 678 కోట్లు వచ్చాయి. కానీ ఏ విభాగాన్నైనా సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే తక్కువగా ఉండడం గమనార్హం. లిక్విడి ఫండ్స్‌లోకి రూ. 93,202.96 కోట్ల ఇన్‌ఫ్లో జరగడంతో గత నెలలో రూ. 1.33 లక్షల కోట్ల వృద్ధి జరిగింది. ఫలితంగా మొత్తం ఇండియాలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏయూఎం రూ. 24.50 లక్షల కోట్లు నుంచి రూ. 26.32 లక్షల కోట్లుకు పెరిగింది.  ‘ప్రస్తుతం మార్కెట్‌లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. అది మ్యూచువల్‌ ఫండ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 3.78 శాతం ఎంఓఎం(మనీ ఆన్‌ మనీ) వద్ద ఉండగా, ఏడాది ప్రాతిపదికన 16 శాతం వృద్ధి చెందింది. మ్యూచవల్‌ ఫండ్స్‌ ఏయూఎం వృద్ధి కూడా 18 శాతం పెరిగింది’ అని వెంకటేష్‌ అన్నారు.     ఈక్విటీ మార్కెట్లు బుల్‌రన్‌ చేస్తున్నాయని, ఈ మూమెంటం కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ట్రేడ్‌వార్‌ పరిష్కారమవుతుండడంతో పాటు స్థూల ఆర్థిక అంశాలు గాడిలో పడ్డాయి. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ తిరగి పుంజుకోడానికి ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంది. మార్కెట్లు దీనిని పాజిటివ్‌గా తీసుకున్నాయి’ అని అన్నారు. ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో  ఖచ్చితంగా ఈక్విటీ ఫండ్స్‌ మంచి ప్రదర్శన చేస్తాయని, నిధుల ప్రవాహం ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుందని అన్నారు.



You may be interested

కుబేరుల సంపద తగ్గింది!

Friday 8th November 2019

యూబీఎస్‌, పీడబ్ల్యుసీ నివేదిక  గతేడాది ప్రపంచ ధనికుల సంపద అంతకుముందేడాది(2017)తో పోలిస్తే తగ్గిందని యూబీఎస్‌ అండ్‌ పీడబ్ల్యుసీ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ టెన్షన్లు, ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకులు... బిలియనీర్ల సంపద తగ్గేందుకు దోహదం చేశాయని వివరించింది. ప్రపంచ ధనవంతుల సంపద తగ్గడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారని తెలిపింది. గతంలో 2008లో ప్రపంచ ధనికుల సంపద తరుగుదల నమోదు చేసింది. 2018లో అందరు కోటీశ్వరుల సంపద దాదాపు 40 కోట్ల డాలర్ల

30 కంపెనీల్లో ప్రమోటర్ల తనఖాలు పెరిగాయ్‌..!

Friday 8th November 2019

 ప్రమోటర్ల తనఖా చేసిన వాటా రెండో క్వార్టర్లో 2.52శాతానికి చేరుకుంది. జూన్‌ త్రైమాసికంలో ఈ వాటా 2.47శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌ మొత్తం క్యాపిటలైజేషన్‌లో 1.24శాతానికి సమానమైన ప్రమోటర్ల ఈక్విటీ షేర్లు తనఖాలో ఉన్నట్లు కోటక్ ఇంటర్నేషనల్‌ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. తనఖా పెట్టిన షేర్ల ద్వారా సేకరించిన నిధులు... వాస్తవానికి కంపెనీ రోజువారీ వ్యాపారం సజావుగా నిర్వహించడానికి అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ను పెంచడానికి సహాయపడుతుంది.  వ్యాపార విస్తరణకు నిధుల

Most from this category