News


సిప్‌ పెట్టుబడుల్లో క్షీణత.. దేనికి సంకేతం!

Tuesday 10th September 2019
personal-finance_main1568139338.png-28291

మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ఎక్కువగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు మూడేళ్లుగా పరిశ్రమ ఆస్తుల వృద్ధికి సిప్‌ పెట్టుబడుల రాక ఇతోధికంగా సాయపడుతోంది. కానీ, ఈ ట్రెండ్‌ బలహీనపడినట్టు ఆగస్ట్‌ నెల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. 

 

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ యాంఫి డేటా ప్రకారం... ఆగస్ట్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నూతన ఫోలియోల నమోదు, సిప్‌ నిధుల రాక సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఆగస్ట్‌ నెలలో కొత్త ఫోలియోలు 3 లక్షలే నమోదయ్యాయి. అంతకుముందు నెల జూలైలో ఈ సంఖ్య 5 లక్షలుగా ఉంది. ఇక సిప్‌ రూపంలో పెట్టుబడుల రాక ఆగస్ట్‌లో రూ.8,230 కోట్లుగా ఉంది. జూలైలో వచ్చిన రూ.8,324 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. జూన్‌లో సిప్‌ ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.8,122 కోట్లుగా ఉన్నాయి. సిప్‌ పెట్టుబడుల్లో వృద్ధి అన్నది మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ విస్తరణను సూచిస్తుంది. దీనివల్ల వాటి నిర్వహణ ఆస్తులు కూడా మెరుగుపడతాయి. ‘‘నూతన ఫోలియోల నమోదు తగ్గడం అన్నది సాధారణమే. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతల వల్లే ఇది చోటు చేసుకుంది. ప్రస్తుతమున్నట్టు నెలవారీ సిప్‌ పెట్టుబడులు రూ.8,000 కోట్లు ఇక ముందూ కొనసాగితే... 2019-20లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి రూ.1,00,000 కోట్లు వచ్చినట్టు అవుతుంది. ఏ విధంగా చూసినా ఇది గణనీయమైన మొత్తమే అవుతుంది’’అని ఓ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో పేర్కొన్నారు. 

 

సిప్‌ రూపంలో నిధుల రాకపై యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేష్‌ బుల్లిష్‌గానే ఉన్నారు. ప్రస్తుత నెలకు సంబంధించిన ఆయన మాట్లాడుతూ... ‘‘నెలవారీ సిప్‌ నిధుల రాక తగ్గడం స్వల్పంగానే ఉంది. తమ లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని కొనసాగిస్తారని మేం నమ్ముతున్నాం. మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్నప్పటికీ సిప్‌ రూపంలో పెట్టుబడులు నిలకడగా ఉన్నాయి’’ అని వివరించారు. ప్రతీ వారం, పక్షం రోజులు, నెలవారీగా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో పెట్టుబడులకు వీలు కల్పించేదే సిప్‌. నెలకు కనీసం రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. సిప్‌ ద్వారా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల దీర్ఘకాలానికి రిస్క్‌ను అధిగమించి రాబడులు అందుకునే వీలుంటుంది. 



You may be interested

ఈ ఏడాది ఐపీవో మార్కెట్లో విజయాలే ఎక్కువ

Tuesday 10th September 2019

ఈ ఏడాది సెకండరీ మార్కెట్లోకి వచ్చిన (ఐపీవో) కంపెనీల్లో చాలా వరకు ఇష్యూలు వాటి జారీ ధర కంటే ఎగువనే ట్రేడవుతున్నాయి. మరోవైపు స్టాక్‌ మార్కెట్లు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక రంగం వృద్ధి బలహీనపడడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను చవిచూస్తున్నాయి. కానీ, ఐపీవో మార్కెట్‌కు ఇవేమీ పట్టలేదు.! ఎందుకంటే ఈ ఏడాది ఐపీవో

టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3.17శాతం అప్‌..!

Tuesday 10th September 2019

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే ఒక్క ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు సోమవారం లాభాలతో ముగిశాయి. అత్యధికంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 3శాతానికి పైగా పెరిగింది. టాటా మోటర్స్‌ ప్రధాన అనుబంధ సం‍స్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు యూరప్‌, అమెరికాలో తగ్గినప్పటికీ., చైనాలో మాత్రం పెరిగినట్లు సోమవారం సాయంత్రం డేటా విడుదల కావడం ఏడీఆర్‌ ర్యాలీకి కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 8.80 డాలర్ల వద్ద క్లోజయ్యింది. ఈ

Most from this category