News


లిక్విడ్‌ ఫండ్స్‌పైనా ఎగ్జిట్‌లోడ్‌

Monday 21st October 2019
personal-finance_main1571598212.png-29013

లిక్విడ్‌ ఫండ్స్‌ అన్నవి అవసరమైనప్పుడు వెంటనే నగదుగా మార్చుకునేందుకు వీలున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు. ఇప్పటి వరకు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసి మరుసటి రోజు వెనక్కి తీసుకున్నా కానీ ఎటువంటి చార్జీలు లేవు. కానీ, ఇకపై ఆ అవకాశం లేదు. లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారు, వారంలోపు తిరిగి వెనక్కి తీసుకుంటే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో దాదాపు అధిక భాగం పెట్టుబడులు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచే వస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్‌ ఒత్తిళ్లు అధికమవుతుండడంతో సెబీ ఎగ్జిట్‌ లోడ్‌ అమలు దిశగా ఏఎంసీలకు ఆదేశాలు ఇచ్చేసింది. ఈ నెల 19 నుంచే ఇవి అమల్లోకి వచ్చేసినట్టే.  

 

చార్జీలు ఇలా...

  • ఏడో రోజు నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే లిక్విడ్‌ ఫండ్స్‌లో చార్జీలు ఇక మీదటా ఉండవు. 
  • ఒక్కరోజులోపే లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ 0.007 శాతం(పెట్టుబడుల విలువపై). 
  • రెండో రోజు వెనక్కి తీసుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ 0.0065 శాతం.
  • మూడో రోజు ఉపసంహరించుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ 0.006 శాతం.
  • నాలుగో రోజు ఉపసంహరణపై 0.0055 శాతం.
  • ఐదో రోజు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే రూ.0.005 శాతం. 
  • ఆరో రోజు ఎగ్జిట్‌ లోడ్‌ 0.0045 శాతం. 

 

దీని ప్రకారం ఒక ఇన్వెస్టర్‌ రూ.కోటి పెట్టుబడులను ఉపసంహరించుకునేట్టు అయితే, ఇన్వెస్ట్‌ చేసిన రోజున ఆ పనిచేస్తే రూ.700, రెండో రోజు వెనక్కి తీసుకుంటే రూ.650 చెల్లించాల్సి వస్తుంది. ఈ చార్జీలు చాలా స్వల్ప మొత్తమే. కానీ, పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు ఇది కొంత బ్రేక్‌ వేస్తుందని అంచనా. పైగా ఏఎంసీలకు అదనపు ఆదాయం కూడా. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ సంఘం యాంఫి వార్షికంగా ఎగ్జిట్‌ లోడ్‌ చార్జీలను సమీక్షిస్తుందని సెబీ పేర్కొంది. కార్పొరేట్‌ సంస్థలు తమ స్వల్ప కాలిక అవసరాల కోసం అవసరమైన నిధులను లిక్విడ్‌ ఫండ్స్‌లోనే ఉంచుతుంటాయి. ఇటీవలి కాలంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి కూడా లిక్విడ్‌ ఫండ్స్‌లోకి నిధుల రాక పెరుగుతోంది. బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాల్లో వడ్డీ రేటు 3 శాతంతో పోలిస్తే లిక్విడ్‌ ఫండ్స్‌లో రెట్టింపు రాబడులకు అవకాశం ఉంటుండడమే దీనికి కారణం. 



You may be interested

ఐఆర్‌సీటీసీ స్టాక్‌.. బఫెట్‌ మెచ్చే క్వాలిటీలు

Monday 21st October 2019

ఐఆర్‌సీటీసీ తాజాగా మార్కెట్లో లిస్ట్‌ అవగా, ఇష్యూ ధరతో పోలిస్తే ఇప్పటికే 130 శాతం రాబడులను ఇచ్చింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,448 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్‌కు వారెన్‌ బఫెట్‌ మెచ్చే బలాలు ఉన్నాయని, ఏ ధరలో అయినా (కరెక్షన్‌లో) కొనుగోలు చేసుకోవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ పేర్కొన్నారు. ఆయన విశ్లేషణ ఇలా ఉంది..   ‘‘ఐఆర్‌సీటీసీ అన్నది వారెన్‌ బఫెట్‌ కొనుగోలు చేసే బలాలు కలిగిన స్టాక్‌.

‘నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు’

Monday 21st October 2019

మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఉన్న అధిక వ్యాల్యూషన్లు పూర్తిగా ఆవిరైపోయాయని, ప్రస్తుత  స్థాయి నుంచి, వచ్చే రెండు మూడేళ్ల కాలం కోసం మంచి నాణ్యమైన, అధిక వృద్ధి అవకాశాలు కలిగిన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నది తమ అభిప్రాయంగా కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ షిబాని కురియన్‌ పేర్కొన్నారు. మార్కెట్‌కు సంబంధించి వివిధ అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.   ‘‘కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అన్నది

Most from this category