News


మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల రక్షణకు సెబీ కొత్త చర్యలు

Friday 9th August 2019
personal-finance_main1565328614.png-27660

  • లిస్టెడ్‌ షేర్లు, డెట్‌ సెక్యూరిటీల్లోనే పెట్టుబడులు
  • రేటింగ్‌లేని సెక్యూరిటీల్లో పెట్టుబడుల పరిమితి తగ్గింపు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడుల రక్షణ దిశగా సెబీ నూతన నిర్ణయాలను అమల్లోకి తీసుకురానుంది. ఏఎంసీలు తమ పెట్టుబడులు అన్నింటినీ దశలవారీగా లిస్టెడ్‌ ఈక్విటీలు, డెట్‌ సెక్యూరిటీల్లోకి మళ్లించడం ఇందులో ఒకటి. జూన్‌ నెలలో సెబీ బోర్డులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా ఇందుకు సంబంధించి నిబంధనల సవరణల ముసాయిదాను తాజాగా సెబీ ఖరారు చేసింది. అంతేకాదు ఈ నెల చివర్లో జరిగే బోర్డు సమావేశంలో మరిన్ని సవరణలను ప్రతిపాదించనుంది. ఇందులో రేటింగ్‌ లేని డెట్‌ సాధనాల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పెట్టుబడుల పరిమితిని 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలన్నది ప్రతిపాదన. రేటింగ్‌ లేని సాధనాల్లో పెట్టుబడులకు అధిక రిస్క్‌ను సెబీ పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా ఈ సవరణ తీసుకురానుంది. మార్కెట్‌ పరిస్థితులు, ఫండ్స్‌ పెట్టుబడులకు అనుగుణంగా ఈ పరిమితులను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ప్రవేశ రుసుములను తీసుకునేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ను అనుమతించడం, వ్యాల్యూషన్‌ ఏజెన్సీలకు ఈ తరహా అన్ని రకాల ఫీజుల వివరాలను తెలియజేయడం వంటి వాటిని సెబీ సంప్రదింపుల అనంతరం మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ విడుదల చేయనుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఎక్కువగా ఇన్వెస్ట్‌చేసే అన్‌ రేటెడ్‌ సెక్యూరిటీల్లో... ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బిల్స్‌ రీడిస్కౌంటింగ్‌ (బీఆర్‌డీఎస్‌), కార్పొరేట్‌ బాండ్ల రెపో, రీట్‌/ఇన్విట్‌లు ఉంటున్నాయి. 



You may be interested

సీఎస్ఆర్‌లో విఫలమైతే నేరంగా చూడబోం

Friday 9th August 2019

కార్పొరేట్‌ శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కింద ఏదేనీ కంపెనీ నిర్ణీత మేర నిధులను ఖర్చు చేయని సందర్భాల్లో నేరంగా పరిగణించే ఉద్దేశ్యమేదీ లేదని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ స్పష్టం చసింది. సీఎస్‌ఆర్‌ అన్నది ఇకపై ఎంత మాత్రం ఔదార్య చర్యగా కొనసాగదన్నారు. కంపెనీలు తమ వార్షిక లాభాల్లో 2 శాతం మేర (క్రితం మూడు సంవత్సరాల సగటు వార్షిక లాభం) సీఎస్‌ఆర్‌ కోసం ఖర్చు

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

Friday 9th August 2019

అప్పుడే పెట్టుబడులు, వృద్ధి పుంజుకుంటాయి కేంద్రానికి పారిశ్రామిక వేత్తల సూచన న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు

Most from this category