News


లార్జ్‌క్యాప్‌లో రాబడుల కోసం..

Monday 4th November 2019
personal-finance_main1572839875.png-29321

  • లార్జ్‌క్యాప్‌లో రాబడుల కోసం..
  • ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌
  • డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌ఫార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

దేశ స్టాక్‌ మార్కెట్లు ఇటీవల నూతన శిఖరాలకు చేరినప్పటికీ, స్థూల ఆర్థిక అంశాలు ఇంకా మెరుగుపడలేదు. మెజారిటీ కీలక రంగాల్లో వృద్ధి పదిహేనేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇటీవలే ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో (మూడు నాలుగేళ్లు) మేలు చేయగలవు. కానీ సమీప కాలంలో ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది. చిన్న, మధ్య స్థాయి (ఎస్‌ఎంఈ) సంస్థలకు నగదు లభ్యత పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. దీంతో కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పుంజుకోవడం ఆలస్యం కావొచ్చు. ఈ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ లేదా లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని ఇన్వెస్టర్లకు మేం సూచిస్తున్నాం. ఎందుకంటే లార్జ్‌క్యాప్‌ విభాగం మార్కెట్‌ అస్థిరతలను తట్టుకుని, సహేతుక రాబడులను ఇవ్వగలదు. కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గించడం పెద్ద స్థాయి కంపెనీల లాభాలు పెరిగేందుకు సాయపడుతుంది. లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ (ఏబీఎస్‌ఎల్‌) ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. 
పెట్టుబడులకు మెరుగైన వ్యూహాలు
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ (ఏబీఎస్‌ఎల్‌) ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ గరిష్టంగా 30 స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంటుంది. ప్రస్తుతానికైతే ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 28 స్టాక్స్‌ ఉన్నాయి. అధిక రాబడులు, అధిక నాణ్యతతో పాటు, భిన్న రంగాలకు చెందిన స్టాక్స్‌తో కూడిన వైవిధ్యాన్ని ఈ పథకంలో చూడొచ్చు. తద్వారా రిస్క్‌ను తగ్గించే విధంగా పెట్టుబడుల వ్యూహం ఉంటుంది. బోటమ్‌అప్‌ విధానం, విస్తృత పరిశోధన, కంపెనీ లాభాల వృద్ధి, రిటర్న్‌ రేషియో, వ్యాల్యూషన్లు తదితర ఎన్నో అంశాలను ఫండ్‌ మేనేజర్‌ స్టాక్స్‌ ఎంపిక కోసం అనుసరిస్తుంటారు. పటిష్టమైన యాజమాన్యం, చక్కని కార్పొరేట్‌ గవర్నెన్స్‌, బలమైన, స్థిరమైన బ్యాలన్స్‌షీట్‌ కలిగిన కంపెనీలను ఎంచుకుంటారు. ఈ విధమైన వ్యూహాలు ఈ పథకం పనితీరు అస్థిర సమయాల్లోనూ స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతున్నాయని చెప్పొచ్చు. 
సత్తా ఉన్న కంపెనీల్లో ఎక్స్‌పోజర్‌..
 గడిచిన ఏడాదిన్నర సమయంలో (2017 డిసెంబర్‌ నుంచి 2019 జూన్‌ వరకు) ఈక్విటీ మార్కెట్లు ఎన్నో అస్థిరతలను చవిచూశాయి. కానీ, అదే సమయంలో నిఫ్టీ-50 సూచీ 11 శాతం పెరిగింది. ముఖ్యంగా నిఫ్టీ-50లో 15 స్టాక్స్‌ మంచి పనితీరు ప్రదర్శించాయి. వీటిల్లో 9 స్టాక్స్‌లో ఏబీఎస్‌ఎల్‌ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేసి ఉంది. తన మొత్తం పెట్టుబడుల్లో 45 శాతం మేర ఈ 9 స్టాక్స్‌లో జూన్‌ నాటికి కలిగి ఉండడం గమనార్హం. ఇక నిఫ్టీ-50లో ప్రతికూల పనితీరు చూపించిన టాప్‌ 15 స్టాక్స్‌లో కేవలం మూడింటిలోనే ఈ పథకానికి పెట్టుబడులు ఉన్నాయి. అది కూడా ఈ మూడు కంపెనీల్లో కేవలం 8.5 శాతమే పెట్టుబడులను కలిగి ఉంది. మెరుగైన పనితీరుకు అవకాశం ఉన్న స్టాక్స్‌ను జల్లెడ పట్టి వాటిల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. You may be interested

ప్రారంభంలోనే సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డు

Monday 4th November 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సూచి చరిత్రాత్మక గరిష్టస్థాయి 40,400 పాయింట్లపైన ప్రారంభంకావడం ద్వారా ఈ ఫీట్‌ సాధించింది. గత శుక్రవారం నెలకొల్పిన 40,360 పాయింట్ల రికార్డును తిరగరాసిన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 250 పాయింట్లు జంప్‌చేసి 40,415 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇంకా రికార్డుస్థాయికి 1.5 శాతంపైగా దూరంగా వున్న ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

ఇంటి ముందుకే బ్యాంక్‌ సేవలు!

Monday 4th November 2019

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచీ డోర్‌ స్టెప్‌ సేవలు సీనియర్‌ సిటీజన్స్, వికలాంగులకు మాత్రమే ఉచితం డిపాజిట్స్, చెక్‌ బుక్స్, డ్రాఫ్ట్, ఫామ్‌-16 వంటివెన్నో.. నగదు లావాదేవీల్లో జాగ్రత్త: నిపుణులు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్యాంక్‌ సేవలు మీ ఇంటి ముందుకొచ్చేశాయి. కొన్నాళ్లుగా ప్రైవేట్‌ బ్యాంక్‌లు మాత్రమే అందిస్తున్న డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ సిద్ధమయ్యాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2017లో వృద్ధులకు, బ్యాంక్‌ శాఖలకు రాలేని పరిస్థితుల్లో

Most from this category