News


మార్కెట్‌ పతనంలోనూ ‘‘సిప్‌’’ ఆపలేదు.

Thursday 12th September 2019
personal-finance_main1568279122.png-28336

మార్కెట్‌ పతనంలోనూ రీటైల్‌ ఇన్వెస్టర్లు ‘‘సిప్‌’’లు కట్టడం ఆపలేదు. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూలతలతో గత కొద్దినెలలుగా ఈక్విటీ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైప్పటికీ., మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి ‘‘సిప్‌’’ల ద్వారా స్థిరమైన ప్రవాహాలొచ్చాయి. ఈ సిప్‌ ప్రవాహాల్లో అధిక మొత్తం రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి, మెట్రో నగరాలు బయటి ప్రాంతాలైన బీ-30 నగరాలను నుంచి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మార్కెట్లో అస్థిరత నెలకొన్నప్పటికీ వారు పెట్టుబడులను కొనసాగించడంలో సహనాన్ని చూపినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 

జూలై నుంచి ఎఫ్‌పీఐల నికర అవుట్‌ఫ్లో  రూ.35,500 కోట్లుగా ఉంది. ఈ అమ్మకాలకు వ్యతిరేకంగా, జూలై, ఆగస్టులలో సిప్ మార్గం ద్వారా నికర ప్రవాహం సుమారు రూ .16,500 కోట్లుగా ఉన్నాయి. అందులో 94 శాతం ఈక్విటీ ఫండ్లలోకి వచ్చాయి. సిప్‌ ప్రవాహాలు ఈ భారీ స్థాయిలో లేకపోతే సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడ్‌ అవుతున్న ప్రస్తుత స్థాయిల కంటే మరో 20శాతం దిగువున ఉండేవని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే సెన్సెక్స్‌ 29,500 స్థాయికి, నిఫ్టీ 8,800 స్థాయికి పతనయ్యేవని వారు భావిస్తున్నారు. 

ఇంతకు ముందు, మార్కెట్లలో బలహీన వాతావరణం లేదా అనిశ్చితి నెలకొన్నప్పుడు రీటైల్‌ ఇన్వెస్టర్లు నిష్క్రమణకు మొగ్గుచూపడటంతో వారి మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు నుంచి పెద్ద మొత్తం పెట్టుబడులను వెనక్కితీసుకునేవారు. ఈసారి అందుకు భిన్నంగా జరిగింది.‘‘గతంలో మార్కెట్లో ఎఫ్‌పీఐలతో పాటు, రీటైల్‌, హెనెట్‌ వర్త్‌ ఇన్వెస్టర్లు విక్రయించేవారు. సిప్‌ ప్రవాహాలు తక్కువగా ఉండేవని కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ నీలేష్‌ షా అభిప్రాయపడ్డారు. 

 You may be interested

ఐదురోజుల లాభాలకు బ్రేక్‌

Thursday 12th September 2019

11000 దిగువున ముగిసిన నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన అమ్మకాలతో మార్కెట్‌ గురువారం నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 11000 దిగువున 54.65 పాయింట్లు నష్టంతో 10,981.05 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 166 పాయింట్లు పతనమై 37,104.28 వద్ద ముగిసింది. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం అనంతరం వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలకు మొగ్గుచూపారు.  ఐదురోజుల ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు

సిమెంట్‌, రియల్‌ ఎస్టేట్‌లో ఈ స్టాకులు బెటర్‌!

Thursday 12th September 2019

-ఐటీలో సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌పై జాగ్రత్త.. -సిమెంట్‌, మెటల్‌ షేర్లు మంచి ప్రదర్శనను చేయగలవు: దీపాన్‌ మెహతా స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు మరి కొన్ని సెషన్‌ల వరకు అద్భుతమైన ప్రదర్శనను చేస్తాయని ఎలిక్సిర్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దీపాన్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యులోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది.. గత కొన్ని సెషన్‌లను గమనిస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులలో కొనుగోలు పెరిగాయి. అధిక స్థాయిల

Most from this category