News


డెట్‌ రాబడులపై ఆర్‌బీఐ ‘ఓఎంఓ’ ప్రభావం

Friday 20th December 2019
personal-finance_main1576865404.png-30339

ఆర్‌బీఐ ఉన్నట్టుండి ఒక నిర్ణయం తీసుకుంది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రూపొందించిన ‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’ విధానాన్ని తాను కూడా అనుసరించనున్నట్టు ప్రకటించింది. రూ.10,000 కోట్లతో ఈ నెల 23న ఆర్‌బీఐ ప్రత్యేక ఓఎంఓను నిర్వహించనుంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఆబీఐ నిర్ణయంతో లాంగ్‌ డ్యురేషన్‌, డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ ఎక్కువగా లాభపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐ ఈ తరహా ఓఎంవోను ప్రకటించడం ఇదే మొదటిసారి. అమెరికాలో మొదటి సారి దీన్ని ప్రవేశపెట్టారు. 

 

ఆర్‌బీఐ పదేళ్ల బాండ్స్‌లో లిక్విడిటీని తీసుకుని, స్వల్ప కాల బాండ్స్‌ మార్కెట్లో లిక్విడిటీని పెంచనుంది. అంటే ఏడాది కాల బాండ్స్‌ను విక్రయించడంతోపాటు, పదేళ్ల కాల బాండ్స్‌ను కొనుగోలు చేస్తుంది. దీర్ఘకాల బాండ్‌ ఈల్డ్స్‌ను తగ్గించడమే ఆర్‌బీఐ చర్యల ఉద్దేశ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ఆర్‌బీఐ ప్రకటనతో దీర్ఘకాల ఫండ్స్‌ విభాగం ఎక్కువగా లాభపడనుంది. డైనమిక్‌ బాండ్‌ ఫండ్స్‌ కొనుగోలుకు మంచి అవకాశం’’ అని కోటక్‌ ఏఎంసీ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సీఐవో లక్ష్మీ అయ్యర్‌ సూచించారు. గత ఆరు నెలల కాలంలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో షార్ట్‌ టర్మ్‌ బాండ్స్‌ గణనీయంగా ర్యాలీ చేయడం గమనార్హం. 

 

‘‘లిక్విడిటీ బలీయంగా ఉంది. రేట్ల బదిలీ స్వల్ప కాలానికి జరిగింది. ఇక ద్రవ్యపరమైన ఆందోళనలు దీర్ఘకాల రేట్లను పెంచేలా చేశాయి. లాంగ్‌టర్మ్‌ బాండ్స్‌ కొంత కాలం పాటు ర్యాలీ చేస్తాయి. దీర్ఘకాల బాండ్లకు కేటాయింపులు చేసిన డైనమిక్‌ బాండ్స్‌ తరహా మ్యూచువల్‌ ఫండ్స్‌ స్వల్ప కాలంలో లాభపడతాయి’’ అని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ డిప్యూటీ హెడ్‌ దేవంగ్‌ షా తెలిపారు. ఆర్‌బీఐ ఈ తరహా ఓఎంవోను అనుకున్నట్టుగా కొనసాగిస్తే, పదేళ్ల బాండ్లు లాభపడతాయని సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సీఐవో ద్విజేంద్ర శ్రీవాస్తవ అన్నారు. ‘‘లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ ప్రయోజనం పొందుతాయి. అయితే, ద్రవ్య పరిస్థితులు సౌకర్యంగా లేనందున ఇది కొసాగుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కనుక సమీప కాలంలో ప్రయోజనాలను చూడాలి. అలాగే, భవిష్యత్తు ఓఎంఓ ఫలితాలు సైతం ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. You may be interested

యస్‌ బ్యాంకు గమనం ఎటు?

Friday 20th December 2019

గురువారం 7 శాతం వరకు లాభపడిన యస్‌ బ్యాంకు, శుక్రవారం కూడా తన ర్యాలీని కొనసాగించింది. మరో 3 శాతం లాభపడి రూ.51.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒక దశలో కొనుగోళ్ల మద్దతుతో రూ.53.50 వరకు పెరిగింది. టెక్నికల్‌గా ఈ స్టాక్‌కు తక్షణ నిరోధం రూ.57 వద్ద ఉందని, దీన్ని అధిగమిస్తే తదుపరి రూ.62.-67 శ్రేణి వరకు వెళుతుందని, ఎగువవైపున 7-26 శాతం ర్యాలీకి అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.   యస్‌ బ్యాంకు

స్వల్ప లాభాల ముగింపు

Friday 20th December 2019

నాలుగో రోజూ కొనసాగిన రికార్డుల ర్యాలీ సూచీలను నడిపించిన పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 7.62 పాయింట్లు పెరిగి 41,681.54 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 12.10 పాయింట్ల లాభంతో 12,271.80 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 143 పాయింట్లు పెరిగి

Most from this category