News


పీపీఎఫ్‌ఏఎస్‌ నుంచి ముచ్చటగా మూడో ఫండ్‌

Wednesday 29th May 2019
personal-finance_main1559154413.png-25985

పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ను తీసుకొచ్చిన ఆరేళ్ల తర్వాత మరో ఈ‍క్విటీ పథకాన్ని పీపీఎఫ్‌ఏఎస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకురానుంది. కాకపోతే పన్ను ఆదా కోసం ఉపకరించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకం ఇది. దీని పేరు పరాగ్‌ పారిఖ్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌. మిగిలిన అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు పీపీఎఫ్‌ఏఎస్‌కు మధ్య ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. ఎందుకంటే గత ఆరేళ్లలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ 62 ఈక్విటీ పథకాలను లాంచ్‌ చేసింది. సుందరం ఏఎంసీ 59 ఈక్విటీ పథకాలు, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ 28 పథకాలు, బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ 25 పథకాల రూపంలో భారీగా నిధులు సమీకరించాయి. కానీ, పీపీఎఫ్‌ఏఎస్‌ ఒక్కటంటే ఒక్క ఈక్విటీ పథకాన్నీ లాంచ్‌ చేయలేదు. 

 

2013లో పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ను ఆవిష్కరించిన సమయంలో... ఒకటికి మించి ఈక్విటీ పథకాలను ప్రారంభించబోమని ప్రకటించినట్టు పీపీఎఫ్‌ఏఎస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో రాజీవ్‌ ఠక్కర్‌ తెలిపారు. 2018లో ఇదే సంస్థ పరాగ్‌ పారిఖ్‌ లిక్విడ్‌ ఫండ్‌ పేరుతో రెండో పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ట్యాక్స్‌ సేవింగ్‌ ఈక్విటీ పథకాన్ని తీసుకురానుంది. జూలై మొదటి వారంలో ట్యాక్స్‌ సేవింగ్‌ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఠక్కర్‌ పేర్కొన్నారు. ‘‘మా మొదటి పథకాన్ని ప్రారంభించిన అనంతరం తొలి సంవత్సరాల్లో పెద్దగా విస్తరించలేదు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల ద్వారా వచ్చినవారే. 2013లో ప్రారంభించినప్పుడు కేవలం రూ.152 కోట్లనే సమీకరించాం. ఇప్పుడు పన్ను ఆదా పథకం రూపంలోనూ అంతకంటే తక్కువే రావచ్చు’’ అని ఠక్కర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పథకానికి నకలుగా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్పిన మాట ప్రకారం ఇంత వరకు మరో ఈక్విటీ పథకాన్ని తీసుకురాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో కేవలం లిక్విడ్‌ ఫండ్‌నే తీసుకొచ్చామన్నారు. ఇన్వెస్టర్లు ముందు లిక్విడ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసి, ఆ తర్వాత క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని అదే ఫండ్‌ హౌస్‌లోని ఈక్విటీ ఫండ్‌లోకి మార్చుకోవచ్చని చెప్పారు.

 

పీపీఎఫ్‌ఏఎస్‌ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్‌, పెట్టుబడుల విషయంలో పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌నే పోలి ఉంటుందన్న విషయాన్ని ఠక్కర్‌ స్పష్టం చేశారు. పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ మొత్తం పెట్టుబడుల్లో 20 శాతాన్ని అంతర్జాతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. నిబంధనల ప్రకారం పన్ను ఆదా పథకాలు ఇతర దేశాల ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయరాదు. 80 శాతాన్ని ఈక్విటీలు, మిగిలిన 20 శాతం వరకు డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అంతర్జాతీయ ఈక్విటీల వాటాను మినహాయిస్తే మిగిలిన పోర్ట్‌ఫోలియోలు రెండు పథకాల్లోనూ ఒకే విధంగా ఉంటాయని ఠక్కర్‌ తెలిపారు. రెండూ కూడా మల్టీక్యాప్‌ పథకాల మాదిరే పనిచేస్తాయన్నారు.You may be interested

కరెక్షన్‌కు అవకాశం... లాంగ్‌ పొజిషన్లకు దూరం...!

Wednesday 29th May 2019

నిఫ్టీ 12,000 మార్క్‌ను అధిగమించి ఇంట్రాడేలో 12,041 రికార్డు స్థాయిని గత వారంలో నమోదు చేసిన తర్వాత సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. లాంగ్‌ పొజిషన్లకు ట్రేడర్లు దూరంగా ఉండడమే మంచిదన్న సూచన వారి నుంచి వినిపిస్తోంది. నిఫ్టీ ఈ నెల 28న హ్యాంగింగ్‌ మ్యాన్‌ పాటర్న్‌ను నమోదు చేసిందని, దీన్ని బేరిష్‌ రివర్సల్‌‍ ప్యాటర్న్‌గా పేర్కొంటున్నారు. నిఫ్టీ 12,000-12,041 వద్ద మధ్యంతర గరిష్టాన్ని నమోదు చేసిందని,

రికార్డుల ర్యాలీకి మరో బ్రేక్‌

Wednesday 29th May 2019

 రికార్డుల ర్యాలీకి బుధవారం మరో బ్రేక్‌ పడింది. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడినప్పటి నుంచి వువ్వెత్తున పరుగులు తీసిన మార్కెట్‌ ఎన్నికల ఫలితాల వెలువడిన రోజున ఒక బ్రేక్‌ తీసుకున్న తర్వాత మళ్లీ తాజాగా మరో బ్రేక్‌ తీసుకుంది.  సెన్సెక్స్‌ 248 పాయింట్లను నష్టపోయి 39,502 వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 11900 మార్కును కోల్పోయి 68 పాయింట్ల నష్టంతో 11,861 వద్ద ముగిసింది. రేపు(గురువారం) మే నెల ఎఫ్‌అండ్‌ఓ ఫ్యూచర్‌

Most from this category