News


ఈ సమయంలో మల్టీక్యాప్‌ ఫండ్స్‌..

Sunday 1st March 2020
Markets_main1583087038.png-32192

మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నప్పుడు ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా..? అన్న సంశయం రిటైల్‌ ఇన్వెస్టర్లలో కనిపిస్తుంది. లార్జ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ ఇలా వేర్వేరుగా కాకుండా.. ఈ మూడింటికి చోటు ఇచ్చే మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఈ సమయంలో అనుకూలమని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్‌ ఉంటుందని పూర్తిగా లార్జ్‌క్యాప్‌నకే పరిమితం కాకుండా, దీర్ఘకాలంలో అధిక రాబడుల కోసం మిడ్‌, స్మాల్‌క్యాప్‌లోనూ కొంత మేర పెట్టుబడులు వైవిధ్యాన్నిస్తాయని తెలిసిందే.

 

మార్కెట్‌ డేటాను గమనిస్తే.. 2015-2018 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ను రాబడుల విషయంలో మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ వెనక్కి నెట్టేశాయి. కానీ, 2018లో ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వెలుగు చూసిన తర్వాత ఈ పరిస్థితి తలక్రిందులైంది. అప్పటి నుంచి మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ నష్టాలను మూటగట్టుకోగా, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ కాస్త మంచి పనితీరు చూపించాయి. 2019లో ఈ మూడు విభాగాల్లోనూ నాణ్యమైన కంపెనీలు మంచి ప్రదర్శన చూపించాయని, 2020లోనూ ఈ ధోరణి కొనసాగుతుందని బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వైవిధ్యంతో లాభాలను గరిష్ట స్థాయికి పెంచుకోవడంతోపాటు రిస్క్‌ను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నాయి. కనుక విడిగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను గుడ్డిగా అనుసరించొద్దని సూచిస్తున్నాయి.

 

‘‘మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలోనూ రాబడుల పరంగా వ్యత్యాసం అధికంగా ఉంది. కనుక మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ మధ్య తగినంత వైవిధ్యం కూడా అవసరమే. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఏక మొత్తంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు. అయితే, ప్రధాన పోర్ట్‌ఫోలియో అన్నది మల్టీక్యాప్‌ ఫండ్స్‌తో కూడుకుని ఉండాలి. సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలియజేసింది. ఇన్వెస్టర్లు వారి రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాలని ఆనంద్‌రాతికి చెందిన జర్నాఅగర్వాల్‌ సూచించారు. ‘‘దూకుడుగా, రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను దీర్ఘకాలం కోసం ఎంచుకోవాలి. ఎందుకంటే గత రెండేళ్లలో ఈ విభాగాలు బాగా దిద్దుబాటుకు గురయ్యాయి. స్వల్పకాలంలో వీటిల్లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రాబడులకు అవకాశం ఉంది. అదే రిస్క్‌ ఎక్కువగా తీసుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు లార్జ్‌, మల్టీక్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు’’ అని అగర్వాల్‌ వివరించారు. ఏ ఫండ్‌ కూడా అన్ని కాలాల్లోనూ అద్భుత పనితీరు చూపించలేదని, మధ్యలో నిర్ణీత కాలాల్లోనే మంచి రాబడులను ఇస్తాయని, కనుక ఇన్వెస్టర్లు మంచి పనితీరు చూపించే పథకాన్ని ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సూచించింది.You may be interested

దేశీయ ఔషధ కంపెనీలకు కరోనా వరమా..?

Monday 2nd March 2020

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) చైనా తయారీ రంగాన్ని స్తంభింపజేసింది. దీంతో చైనా ముడిసరుకులపై, చైనా దిగుమతులపై ఆధారపడిన పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఔషధాల్లో వాడే ముడి సరుకుల్లో అధిక భాగాన్ని మన ఫార్మా కంపెనీలు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి ప్రపంచీకరణ అన్నది ఇటువంటి ఆటుపోట్లను తట్టుకునే విధంగా ఉండాలి కానీ, దాదాపు అన్ని దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడిపోవడమే ప్రస్తుత ఇబ్బందులకు కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం.     మన

క్రాష్‌తో...కుబేరుల సంపద కరిగిపోయిందిలా..!

Saturday 29th February 2020

ఇండియాలో  అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సంపద కరోనా వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్‌లు పతనమవ్వడంతో 5 బిలియన్‌డార్ల తగ్గిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలో ఉన్న ఫార్చూన్‌ 500 బిలీయనీర్స్‌ సంపద కూడా అంతర్జాతీయ మార్కెట్ల పతనంతో 444 బిలియన్‌ డాలర్లుత తగ్గింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ సూచీ 12 శాతానికిపైగా పడిపోయింది. 2008 ఆర్థిఖ

Most from this category