News


నిఫ్టీలో తక్కువ వెయిటేజీ ఉ‍న్న వాటిపై ఫోకస్‌

Wednesday 6th November 2019
Markets_main1572981134.png-29373

నిఫ్టీ-50 సూచీలో ఉన్న 50 స్టాక్స్‌లో తక్కువ వెయిటేజీ కలిగిన స్టాక్స్‌పై మ్యూచువల్‌ ఫండ్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో దృష్టి పెట్టినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే నిఫ్టీలోని 17 స్టా‍క్స్‌లో దేశీయ ఇనిస్ట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐలు) సెప్టెంబర్‌ క్వార్టర్లో కనీసం ఒక శాతం అంతకంటే ఎక్కువే తమ వాటాను పెంచుకున్నారు. వీటిల్లో 14 స్టాక్స్‌ నిఫ్టీ రాబడుల కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే నిఫ్టీలో అధిక వెయిటేజీ  స్టాక్స్‌ ఇప్పటికే భారీ ర్యాలీ చేసినందున, తక్కువ వెయిటేజీతో అంతగా పనితీరు చూపించని స్టాక్స్‌ ఇకమీదట ర్యాలీ అందుకుంటాయని డీఐఐలు అంచనా వేస్తున్నట్టు భావిస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా సం‍స్థలను డీఐఐలుగా పేర్కొంటారు. 

 

నిఫ్టీలోని 21 స్టాక్స్‌ ఈ ఏడాది ఇంత వరకు నికరంగా నష్టాల్లోనే ఉన్నాయి. వీటిల్లో 20 స్టాక్స్‌ నిఫ్టీ ర్యాలీలో పెద్దగా పాల్గొనలేదు. మరోవైపు ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఈ మూడు నిఫ్టీ స్టాక్స్‌ ఈ ఏడాది ఇంత వరకు చేసిన ర్యాలీలో సగం పాత్ర పోషించాయి. దీంతో నిఫ్టీలో ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేయనివి ఆకర్షణీయంగా మారినట్టు తెలుస్తోంది. ‘‘నిఫ్టీలో వెయిటేజీ పరంగా టాప్‌ 10 కంపెనీలను మినహాయిస్తే, ఇతర స్టాక్స్‌ ఈ ఏడాది పనితీరులో వెనుకబడే ఉన్నాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత చాలా ఫండ్స్‌ ఇండెక్స్‌లో తక్కువ వెయిటేజీ ఉన్నవి, ‍ప్రధాన ఇండెక్స్‌కు వెలుపలి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా లాభాలు ఆర్జించేందుకు ఎదురు చూస్తున్నాయి’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. 

 

అయితే, నిఫ్టీ నెక్స్ట్‌ 50 బాస్కెట్‌లోని స్టాక్స్‌ పట్ల కూడా ఫండ్స్‌ పెద్దగా ఆసక్తితో లేవు. అదే సమయంలో మిడ్‌క్యాప్‌లొరే ఎక్కువ శాతం స్టాక్స్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను పెద్దగా ఆకర్షించలేదని తెలుస్తోంది. ‘‘మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు అన్నీ సురక్షితమైన కేవలం కొన్ని లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ వెంటే వెళుతున్నాయి. అయితే, రిస్క్‌ తీసుకునే ధోరణి తిరిగి పూర్వపు స్థితికి వస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది మరికొన్ని నెలల పాటు కొనసాగితే ఇండెక్స్‌ నాన్‌ హెవీ వెయిట్‌ స్టాక్స్‌తో పాటు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనూ ఎంపిక చేసిన వాటిల్లోకి తాజా పెట్టుబడులు రావడాన్ని చూస్తాం’’ అని నిర్మల్‌బంగ్‌ సెక్యూరిటీస్‌కు చెందిన సునీల్‌ జైన్‌ పేర్కొన్నారు. 

 

అల్ట్రాటెక్‌ సిమెంట్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ వాటాను 4 శాతం పెంచుకున్నాయి. సెప్టెంబర్‌ 30 నాటికి టాప్‌ 10 నిఫ్టీ స్టాక్స్‌ బలం మొత్తం ఇండెక్స్‌లో 61 శాతంగా ఉంది. అలాగే ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, యస్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌, గెయిల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకులోనూ ఫండ్స్‌ వాటా పెరిగింది. నిఫ్టీ నెక్స్ట్‌ 50లోని ఐదు స్టాక్స్‌.. ఐసీఐసీఐ లాంబార్డ్‌, హెచ్‌పీసీఎల్‌, పీఎఫ్‌సీ, మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌లో ఫండ్స్‌ వాటాలు పెంచుకున్నాయి. వీటికితోడు మహానగర్‌ గ్యాస్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆల్కెమ్‌ ల్యాబ్‌, ఫెడరల్‌ బ్యాంకు, క్రాంప్టన్‌గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌, టీవీఎస్‌ మోటార్స్‌, ఆయిల్‌ ఇండియా, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌లో ఫండ్స్‌ కొనుగోళ్లు జరిగాయి. You may be interested

ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో త్వరలో వీటికి చోటు?

Wednesday 6th November 2019

ఎన్‌ఎస్‌ఈ వచ్చే ఫిబ్రవరిలో చేపట్టే సవరణలో కొత్త వాటికి చోటు కల్పించే అవకాశం ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఎన్‌ఎస్‌ఈపై సెబీ విధించిన ఆరు నెలల నిషేధం అక్టోబర్‌తో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే సవరణలో సుమారు 10 నుంచి 14 సెక్యూరిటీలను ఎఫ్‌అండ్‌వోలో చేర్చొచ్చని ఎడెల్‌వీజ్‌ రీసెర్చ్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తున్నాయి.    వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా ఎఫ్‌అండ్‌వోలో ఎన్‌ఎస్‌ఈ కొత్తగా ఏ

మూడేళ్ల కనిష్ఠానికి బంగారం డిమాండ్‌

Tuesday 5th November 2019

ఇండియాలో ఊహించినట్టుగానే బంగారం డిమాండ్‌ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని డబ్యూజీసీ(వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) మంగళవారం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలు తగ్గడంతో పాటు, బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరుకోవడంతో బంగారానికి డిమాండ్‌ తగ్గుతోందని తెలిపింది. ఈ ఏడాది బంగారం డిమాండ్‌ గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం పడిపోయి 700 టన్నులకు చేరుకుందని, ఇది 2016 తర్వాత కనిష్ఠ స్థాయి అని డబ్యూజీసీ ఇండియా ఆపరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ సోమసుందరమ్‌

Most from this category