News


కొత్త సంవత్సరం కనీసం ఈ ‘3’..

Wednesday 1st January 2020
personal-finance_main1577901614.png-30596

కొత్త సంవత్సరంలో అయినా ఆర్థికంగా మెరుగ్గా జీవనం ఉండాలని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ, ఇందుకోసం ఆచరణ ముఖ్యం. ముఖ్యంగా ప్రతీ కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక తప్పకుండా ఉండాలి. అప్పుడే లక్ష్యాలకు విఘాతం కలగదు. ఆచరణలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు... కనీసం ఈ మూడింటిని అయినా ముందుగా అమలు చేస్తే తర్వాత వేరే అంశాలపై ఫోకస్‌ పెట్టొచ్చు. 

 

అత్యవసర నిధి
రోజులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. దేశ జీడీపీ వేగవంతమైన వృద్ధి స్థాయి నుంచి 4.5 శాతానికి దిగొచ్చింది. రికవరీకి ఒకటి రెండేళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సమయంలో ఉద్యోగం కోల్పోతే పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే... కొంత కాలం పాటు అయినా జీవన అవసరాలు సాఫీగా సాగిపోయేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవాలి. ఈఎంఐ, ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, కిరాణా బిల్లు, యుటిలిటీ బిల్లులు ఎంతన్నది లెక్కవేసి.. ఈ తప్పనిసరి అవసరాలు ఆరు నెలల పాటు నెట్టుకొచ్చేందుకు అవసరమైనంత నిధిని సమకూర్చుకోవాలి. ఉపాధి అవకాశాలు కష్టంగా ఉండే రంగాల్లో పనిచేసే వారు కనీసం ఏడాది అవసరాలకు సరిపడా నిధిని ఉంచుకోవాలి. అయితే, వస్తున్న నెలసరి ఆదాయమే చాలడం లేదు.. అత్యవసర నిధి ఎలా సమకూర్చుకునేదీ? అంటారా.. అయితే, అనవసర వ్యయాలకు కత్తెర వేసి దాన్ని నిధి కింద సమకూర్చుకుంటే సరి. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు, రెస్టారెంట్లలో విందులకు ముగింపు పలికి, విదేశీ పర్యటనలకు బదులు దేశీయంగా దగ్గర్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లడం, నిత్యం కార్యాలయానికి సహచర ఉద్యోగితో కలసి ఒకే వాహనంలో వెళ్లడం వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి.

 

రుణాలు తీసుకోవద్దు..
రుణాలు ఆర్థిక ఆరోగ్యానికి మంచిది కాదు. రుణం తీసుకుని ఆస్తిని సమకూర్చుకునే గృహ రుణం అయితే ఫర్వాలేదు కానీ.. మరే ఇతర రుణాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. రుణాలు ఎక్కువైపోతే తీర్చడం కష్టమై ఊబిలో చిక్కుకుంటారు. ఇప్పటికే రుణాలను మోస్తున్న వారు వాటిని తీర్చే ప్రయత్నాలను ఆచరణలో పెట్టాలి. ముందుగా అధిక వడ్డీ భారం పడుతున్న వాటిని ముగించేయడం మంచిది. క్రెడిట్‌ కార్డు రుణంపై నెలకు 4 శాతం వడ్డీ అంటే ఏడాదికి 48 శాతం వడ్డీ పడుతుంది. ఏ పెట్టుబడి సాధనంలోనూ ఇంత రాబడి రావడం లేదు. కనుక ఏవైనా పెట్టుబడులు ఉంటే వెంటనే రద్దు చేసుకుని క్రెడిట్‌ కార్డు రుణం తీర్చేయాలి. ఆ తర్వాత 18-24 శాతం వడ్డీ పడే వ్యక్తిగత రుణాలను తీర్చేయండి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉంటే రద్దు చేసి తీర్చేయండి. బంగారం ఉంటే రూపాయి వడ్డీకి రుణం తెచ్చుకుని క్రెడిట్‌ కార్డు రుణం తీర్చేయడం మంచి ఆలోచనే.

 

తగినంత బీమా
ముఖ్యంగా ఆర్జించే వ్యక్తికి ప్రాణ ప్రమాదం ఏర్పడితే, ఆ పరిస్థితుల్లో ఆదుకునే సాధనం లేకపోతే కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ పరిస్థితి రాకూడదంటే తగినంత బీమా రక్షణతో పాలసీ తీసుకోవాలి. ఇందుకోసం వ్యక్తి వార్షిక ఆదాయానికి కనీసం 20 రెట్లకు సరిపడా టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి. అదే సమయంలో ఎండోమెంట్‌, యులిప్‌ పాలసీలకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే బీమాను, పెట్టుబడిని కలిపి చూడకూడదు. బీమా అన్నది కుటుంబానికి ఆర్థిక రక్షణనిచ్చే కవచం మాత్రమే. You may be interested

ఇవి దృష్టిలో పెట్టుకోండి..

Wednesday 1st January 2020

నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ఎంతో అవగాహన కలిగి, రిస్క్‌ నిర్వహణ విధానాలను అనుసరిస్తూ, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారానే లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులతో, బంధువులో సూచించారని, షేరు ధర బాగా పెరుగుతుందన్న ఆకర్షణతో లేదా షేరు ధర గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయింది కదా చౌకగా లభిస్తుందనో.. ఈ తరహా అంచనాల ఆధారంగా ఇన్వెస్ట్‌ చేయడం మంచి విధానమేమీ కాదు. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు

రిజర్వు రేషియో తగ్గించిన చైనా

Wednesday 1st January 2020

బ్యాంకుల రిజర్వు రిక్వైర్‌మెంట్‌ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) ప్రకటించింది. జనవరి 6నుంచి ఇది అమల్లోకి రానుంది. తాజా తగ్గింపుతో పెద్దబ్యాంకుల ఆర్‌ఆర్‌ఆర్‌ 12.5 శాతానికి దిగిరానుంది. 2018 నుంచి పీపుల్స్‌ బ్యాంక్‌ 8 మార్లు తగ్గించింది. బ్యాంకులకు మరింత ఫండ్స్‌ అందుబాటులోకి వచ్చేందుకు, లిక్విడిటీ పెంచేందుకు పీబీఓసీ ఈ చర్య చేపట్టింది. త్వరలో చైనా ప్రభుత్వం వృద్ధి పుంజుకునేందుకు మరిన్ని

Most from this category